Benefits of Spinach : బచ్చలికూరతో బెనిఫిట్స్ ఎన్నో.. ఎముకల నుంచి గర్భధారణ వరకు..
Benefits of Spinach : బచ్చలికూర అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ కాలంలోనైనా అది తన పోషకాలతో జుట్టు నుంచి ఎముకల వరకు మనకు కావాల్సిన అన్ని ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మరి దీనిని రోజూవారీ ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Benefits of Spinach : ఆకు కూరలు ఆరోగ్యానికి మంచివని తెలుసు. అయితే మీకు రోగనిరోధక శక్తిని అందిస్తూ.. గర్భధారణ సమయంలో పిల్లలకు కావాల్సిన విటమిన్లు అందించే బచ్చలికూర గురించి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి. అవును మరి శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంలో బచ్చలికూర ఎప్పుడూ ముందే ఉంటుంది. పలు పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల దీనిని సూపర్‌ఫుడ్ అని కూడా అంటారు.
బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది
మీరు బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నట్లయితే లేదా మీ ఎముకలు వయస్సుతో బలహీనపడుతున్నట్లయితే.. మిమ్మల్ని బచ్చలికూర రక్షిస్తుంది.
ఈ గ్రీన్ వెజ్జీలో కాల్షియం, విటమిన్ కె, మాంగనీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. అందువల్ల బచ్చలికూరను క్రమం తప్పకుండా తీసుకోవాలి. దీని వల్ల మీ శరీరంలో కాల్షియం శోషణను మెరుగుపడుతుంది. తద్వారా మీ ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇది మీ ఎముక సాంద్రతను కాపాడుతుంది.
కళ్లకు మంచిది
బచ్చలికూర కంటికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. దానిలో లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కంటి చూపును అందిస్తాయి.
ఈ ఆకు కూరను క్రమం తప్పకుండా తినడం వల్ల కంటిశుక్లం, వయస్సు సంబంధిత మచ్చల క్షీణత, అనేక ఇతర కంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ యాంటీఆక్సిడెంట్లతో పాటు.. ఇందులో విటమిన్ ఎ కూడా ఉంది. ఇది మెరుగైన దృష్టి కోసం కళ్లలో శ్లేష్మ పొరలను కాపాడుతుంది.
ఆరోగ్యకరమైన గర్భధారణకు
అనేక ఇతర పోషకాలతో పాటు.. బచ్చలికూర ఫోలేట్ సుగుణాలతో నిండి ఉంటుంది. ఇది శిశువులలో న్యూరల్ ట్యూబ్ బర్త్ డిఫెక్ట్స్‌ను నిరోధించే విటమిన్ అని చెప్తారు. ఈ కారణంగానే గర్భధారణ సమయంలో మీ డాక్టర్ ఫోలేట్ సప్లిమెంట్లకు ప్రత్యామ్నాయంగా ఇవి తినమని మీకు సూచించవచ్చు.
అంతే కాకుండా బచ్చలికూరలో విటమిన్ B6 కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపులోని శిశువు మెదడు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
బచ్చలికూర ఆకట్టుకునే పోషక ప్రొఫైల్‌ను కలిగి ఉంది. ఇది విటమిన్ సిని మంచి మొత్తంలో కలిగి ఉంటుంది. ఇది శరీరం పెద్ద, చిన్న అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
అందుకే వాతావరణ పరిస్థితుల కారణంగా జీవక్రియ, రోగనిరోధక ప్రతిస్పందన మందగించిన శీతాకాలంలో ఈ ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తీసుకుంటారు. రోగనిరోధక శక్తిని మరింత పెంచే విటమిన్ ఇ, మెగ్నీషియం కూడా ఇందులో ఉన్నాయి.
మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది
హైడ్రేటెడ్‌గా ఉండాలంటే తగినంత నీరు తాగడం ఒక్కటే మార్గం అని మీరు అనుకోవచ్చు. అయితే ఇది పాక్షికంగా తప్పు. అవును హైడ్రేటెడ్‌గా ఉండటానికి మీకు నీరు అవసరమే కానీ.. దాని ద్రవ స్థితిలో మాత్రమే తీసుకోవాలని రూల్ లేదు.
బచ్చలికూర 91% నీటితో నిండి ఉంది. ఇది మీ నీటి వినియోగ స్థాయిని నిర్వహించగల చాలా అరుదైన ఆహార పదార్థాలలో ఒకటి.
సంబంధిత కథనం