Hair Care with Home Remedies : మృదువైన, స్ట్రాంగ్ జుట్టును పొందాలంటే.. ఈ ఇంటి చిట్కాలు ఫాలో అయిపోండి..-hair care with home remedies for a smooth and consistent hair texture ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Care With Home Remedies : మృదువైన, స్ట్రాంగ్ జుట్టును పొందాలంటే.. ఈ ఇంటి చిట్కాలు ఫాలో అయిపోండి..

Hair Care with Home Remedies : మృదువైన, స్ట్రాంగ్ జుట్టును పొందాలంటే.. ఈ ఇంటి చిట్కాలు ఫాలో అయిపోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 19, 2023 05:58 PM IST

Hair Care with Home Remedies : ఈ కాలంలో అందమైన జుట్టు పొందాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. మృదువైన, స్ట్రాంగ్ హెయిర్​ పొందాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచి.. మెరుగైన ఆకృతినిచ్చే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు సంరక్షణ
జుట్టు సంరక్షణ

Hair Care with Home Remedies : మీ జుట్టు కాలుష్యం, ధూళీ, బాక్టీరియాకు గురికావడం వల్ల మీ జుట్టు పొడిగా, పెళుసుగా మారుతుంది. రసాయన చికిత్సలు, స్టైలింగ్ ఉత్పత్తులు, బ్లో-డ్రైయింగ్‌లను ఉపయోగించడం వల్ల మీ జుట్టు దాని సహజ ఆకృతిని ప్రభావితం చేస్తుంది.

ఈ సమస్యను పరిష్కరించి.. మీకు మృదువైన, ఒత్తైన, స్ట్రాంగ్ జుట్టును పొందడం కష్టమే. అయితే దానిని పొందడానికి మీరు కొన్ని జుట్టు సంరక్షణ దినచర్యను అనుసరించవచ్చు. మృదువైన జుట్టు ఆకృతిని నిర్వహించడానికి కొన్ని ఇంటి నివారణలు పాటించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి నూనెతో..

కొబ్బరి నూనెను వారానికి రెండుసార్లు రాయండి. మాయిశ్చరైజింగ్ లక్షణాలతో నిండిన కొబ్బరి నూనె మీ జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది. జుట్టును ఆరోగ్యంగా, మృదువుగా చేస్తుంది. ఇది స్కాల్ప్​లోపలికి చొచ్చుకుని పోయి ప్రొటీన్ నష్టాన్ని నివారిస్తుంది. జుట్టు చిట్లడం, చివర్లు చిట్లకుండా కూడా సహాయం చేస్తుంది.

కొద్దిగా కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి మీ జుట్టు అంతటా మసాజ్ చేయండి. 30-60 నిమిషాలు వేచి ఉండి.. తేలికపాటి క్లెన్సర్‌తో కడగాలి. వారానికి రెండుసార్లు కొబ్బరినూనె ఉపయోగించండి.

గుడ్డు మాస్క్..

మాంసకృత్తులు, కొవ్వులు పుష్కలంగా ఉన్న గుడ్డు పచ్చసొన మీ జుట్టుకు పోషణ, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది స్ప్లిట్ చివరలను, విరిగిపోవడాన్ని నివారిస్తుంది. మీ జుట్టును బలంగా, మృదువుగా చేస్తుంది.

గుడ్డును పగులగొట్టి బాగా గిలకగొట్టండి. మీ జుట్టు, తలపై మసాజ్ చేయండి. మీ తలను షవర్ క్యాప్‌తో కప్పుకోండి. ఒక గంట పాటు ఉంచి.. తేలికపాటి క్లెన్సర్‌తో కడగాలి. ప్రతి వారం ఒకసారి ఈ మాస్క్ ఉపయోగించండి.

ప్రతి రోజు గ్రీన్ టీ

గ్రీన్ టీ.. మీ జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా ఆరోగ్యకరమైన జుట్టు, ఆకృతిని అందించండంలో సహాయపడుతుంది.

ఇందులో ఉండే పాలీఫెనాల్స్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఒక సాస్పాన్లో నీటిని మరిగించి.. ఒక టీస్పూన్ గ్రీన్ టీ జోడించండి. వడకట్టి తాగేయండి. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చగా తాగండి.

మైక్రోఫైబర్ తువ్వాళ్లతో..

రెగ్యులర్ టవల్స్ సాధారణంగా మీ జుట్టు కంటే ముతకగా, చాలా పొడిగా ఉంటాయి. ఇది తంతువులను బలహీనపరుస్తుంది. విచ్ఛిన్నం కూడా చేస్తుంది. ఈ తువ్వాళ్లు స్ప్లిట్ ఎండ్స్ కలిగిస్తాయి. జుట్టులోని సహజమైన తేమను తీసివేస్తాయి.

బదులుగా మీ జుట్టుపై సున్నితంగా ఉండే మైక్రోఫైబర్ తువ్వాళ్లను తీసుకోండి. తక్కువ రాపిడిని కలిగిస్తుంది. దానిని పొడిగా, గజిబిజిగా చేయదు.

చెక్క దువ్వెనతో..

చెక్క దువ్వెనను ఉపయోగించండి. అంతేకాకుండా మీ జుట్టును ఎక్కువగా బ్రష్ చేయకండి. మీరు మృదువైన, స్థిరమైన జుట్టు కొనసాగించాలనుకుంటే.. మీ సాధారణ ప్లాస్టిక్ దువ్వెనలను వదిలివేసి.. చుండ్రు, చివర్లు, జుట్టు రాలడాన్ని తగ్గించి.. మీ జుట్టు నాణ్యతను మెరుగుపరిచే చెక్క దువ్వెనను ఎంచుకోండి.

చెక్క దువ్వెన మీ తలలో రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. ఇది సహజ నూనెలను మీ జుట్టు అంతటా పంపిణీ చేస్తుంది. అలాగే మీ జుట్టును ఎక్కువగా దువ్వకండి.

WhatsApp channel

సంబంధిత కథనం