Rose Green Tea Benefits । రోజ్ గ్రీన్ టీ.. రోజూ తాగండి, ఒక కప్పుతో బోలెడు ప్రయోజనాలు!
Rose Green Tea Benefits: రోజా పూల సుగంధం, గ్రీన్ టీలోని ఆరోగ్య ప్రయోజనాల సరైన కలయిక రోజ్ గ్రీన్ టీ.. ఈ చాయ్ తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
చిన్న విరామం దొరికితే టీ తాగాలనిపిస్తుంది, ఈ విరామ సమయంలో మంచి విశ్రాంతి లభించాలంటే మామూలు టీ సరిపోదు, అందుకు ప్రత్యేకమైన టీ తాగాలి. మీలో చాలా మంది గ్రీన్ టీ తాగి మధ్యలోనే మానేసి ఉంటారు. కారణం ఈ టీ చాలా చేదు ఫ్లేవర్ కలిగి ఉంటుంది. గ్రీన్ టీ చేదు రుచిని ఆస్వాదించలేకపోతే, బదులుగా మీరు రోజ్ గ్రీన్ టీ తాగి చూడండి. ఈ రోజ్ గ్రీన్ టీ కచ్చితంగా మీ మనసును మారుస్తుంది రోజా పూల సుగంధం, గ్రీన్ టీలోని ఆరోగ్య ప్రయోజనాల సరైన కలయిక.
ఒక కప్పు రోజ్ గ్రీన్ టీ తాగితే అది మీ ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా ఈ రోజ్ గ్రీన్ టీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ గుణాలను కలిగి శరీరాన్ని రక్షించే మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఈ రోజ్ గ్రీన్ టీ చేయడం కూడా చాలా సులభం. రోజ్ గ్రీన్ టీ రెసిపీని ఈ కింద చూడండి.
Rose Green Tea Recipe కోసం కావాలసినవి
- 2 గ్రీన్ టీ బ్యాగులు
- 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్
- 2 టేబుల్ స్పూన్లు ఎండిన గులాబీ రేకులు
- 3 కప్పు నీరు
- రుచికోసం తేనె
రోజ్ గ్రీన్ టీ ఎలా తయారు చేయాలి
- ముందుగా ఒక గిన్నెలో నీటిని మరిగించండి.
- నీరు మరిగిన తర్వాత, ఎండిన గులాబీ రేకులను వేయండి.
- గులాబీ రేకుల నుండి సారం విడుదలైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నీటిని వడకట్టి ఒక కప్పులో పోయండి.
- ఇప్పుడు ఈ కప్పులో గ్రీన్ టీ బ్యాగులు వేసి కాసేపు ఉంచండి.
- చివరగా టీ బ్యాగులు తీసేసి తేనే, రోజ్ వాటర్ మిక్స్ చేయండి.
రోజ్ గ్రీన్ టీ రెడీ.. ఒక్కో సిప్ తాగండి, రిలాక్స్ అవ్వండి.
సంబంధిత కథనం