Harmful for Bones | మాంసం ఎక్కువగా తినకండి.. లేదంటే ఎముకలు పలుచన అవుతాయట!
- మాంసం ఎక్కువగా తినడం వలన శరీరంలోని కాల్షియం మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ఇలా కాల్షియం కోల్పోవడం వల్ల ఎముకల్లో దృఢత్వం దెబ్బతింటుంది. ఇంకా ఎలాంటి ఆహారపు అలవాట్లు ఎముకలను పలుచన చేస్తాయో చూడండి.
- మాంసం ఎక్కువగా తినడం వలన శరీరంలోని కాల్షియం మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ఇలా కాల్షియం కోల్పోవడం వల్ల ఎముకల్లో దృఢత్వం దెబ్బతింటుంది. ఇంకా ఎలాంటి ఆహారపు అలవాట్లు ఎముకలను పలుచన చేస్తాయో చూడండి.
(1 / 9)
కాల్షియంను మన శరీరం అంత సులభంగా గ్రహించలేదు. తీసుకున్న ఆహారంలో కేవలం 20-30% కాల్షియం మాత్రమే శరీరానికి అందుతుంది. అయితే కొన్ని రకాల ఆహరపు అలవాట్లు కూడా కాల్షియం శోషణను అడ్డుకుంటాయి. ఇది ఎముకలకు నష్టాన్ని చేకూరుస్తుంది అని పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ పేర్కొన్నారు.
(Unsplash)(2 / 9)
శీతల పానీయాలలో ఫాస్పోరిక్ యాసిడ్ అనేది ప్రిజర్వేటివ్‌గా ఉంటుంది. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది.
(Unsplash)(3 / 9)
జంతు సంబధమైన ప్రోటీన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని కాల్షియం స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల ఎముకల దృఢత్వం దెబ్బతింటుంది.
(Unsplash)(4 / 9)
కెఫిన్ సమ్మేళనం ఉండే టీ, కాఫీలు ఎక్కువగా తాగితే శరీరంలోని కాల్షియం మూత్రం ద్వారా విసర్జన అవుతుంది.
(Unsplash)(5 / 9)
నికోటిన్ కాల్షియం శోషణపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ధూమపానం, పొగాకు నమలడం ఎముకల పెరుగుదలకు హానికరం.
(Unsplash)(7 / 9)
బక్కపలుచగా ఉండే వారిలో కూడా కాల్షియం తక్కువ ఉంటుంది. కండ లేకపోవడం వలన కాల్షియం నిల్వ చేయటానికి శరీరానికి స్థలం దొరకదు.
(Unsplash)(8 / 9)
నిశ్చలమైన జీవనశైలి ఎముకల పటుత్వానికి హానికరం. వాకింగ్ లేదా రన్నింగ్ వంటి శారీరక వ్యాయామం చేస్తూ ఉండాలి.
(Unsplash)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు