SRH vs RCB: మరో అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. మెరుపు అర్ధ శకతం చేసిన పటిదార్
IPL 2024 SRH vs RCB: సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో నేటి (ఏప్రిల్ 25) మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ అర్ధ శతకాలతో అదరగొట్టారు. మెరుపు హిట్టింగ్‍తో పటిదార్ రెచ్చిపోయాడు. కోహ్లీ ఓ అరుదైన రికార్డు సాధించాడు.
(1 / 7)
సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మంచి స్కోరు చేసింది. హైదరాబాద్‍లోని ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‍కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. (AP)
(2 / 7)
బెంగళూరు స్టార్, ఓపెనర్ విరాట్ కోహ్లీ ఈ సీజన్‍లో మరో అర్ధ శకతంతో దుమ్మురేపాడు. 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 పరుగులు చేశాడు విరాట్. ఈ సీజన్‍లో అద్భుత ఫామ్‍ను కొనసాగించాడు. ఆరెంజ్ క్యాప్‍ను మరింత పదిలం చేసుకున్నాడు. ఈ సీజన్‍లో తొమ్మిది మ్యాచ్‍ల్లోనే 430 రన్స్ చేసేశాడు.(PTI)
(3 / 7)
విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కుపైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా ఘనత దక్కించుకున్నాడు. ఐపీఎల్‍లో తాను ఆడిన 17 సీజన్లలో 10 సంవత్సరాలు 400 కంటే ఎక్కువ రన్స్ చేశాడు కోహ్లీ. (AP)
(4 / 7)
ఆర్సీబీ యంగ్ స్టార్ రజత్ పాటిదార్ మెరుపు హిట్టింగ్ చేశాడు. 20 బంతుల్లోనే 50 పరుగులతో సూపర్ అర్ధ శకతం చేశాడు. 2 ఫోర్లు మాత్రమే కొట్టిన రజత్.. ఏకంగా 5 సిక్స్‌లు బాదుడు. హైదరాబాద్ స్పిన్నర్ మయాంక్ మార్కండే వేసిన 11వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లతో అదరగొట్టాడు. అయితే, 13వ ఓవర్లో పటిదార్‌ను ఉనాద్కత్ ఔట్ చేశాడు. (AP)
(5 / 7)
ఫాఫ్ డుప్లెసిస్ (25), విల్ జాక్స్ (6), మహిపాల్ లోమ్రోర్ (7), దినేశ్ కార్తీక్ (11) ఎక్కువసేపు రాణించలేకపోయారు. అయితే, చివర్లో కామెరూన్ గ్రీన్ (20 బంతుల్లో 37 పరుగులు నాటౌట్) మెరిపించాడు. (AP)
(6 / 7)
సన్‍రైజర్స్ హైదరాబాద్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ మూడు వికెట్లతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్ (7)లను ఔట్ చేశాడు. నటరాజన్ రెండు, మయాంక్ మార్కండే, ప్యాట్ కమిన్స్ చెరో వికెట్ తీశారు. (AP)
ఇతర గ్యాలరీలు