Khichdi Health Benefits : కిచ్డీ తినడం వలన కలిగే ప్రయోజనాలివే
Khichdi Health Benefits In Telugu : కిచ్డీ చేయడం ఈజీ. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కిచ్డీ తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు దొరుకుతాయి.
కిచ్డీ వంటకం ఇప్పటిది కాదు.. వందల ఏళ్ల నుంచి ఉంది. సాంప్రదాయ భారతీయ వంటకాలలో ప్రసిద్ధ వంటకం ఇది. ధాన్యాలు, వివిధ కూరగాయలతో తయారు చేసే ఈ కిచ్డీ చాలా ఫేమస్. సౌత్ ఇండియాలో అయితే దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తప్పకుండా ప్రతీ ఇంట్లో దీనిని చేస్తుంటారు. చాలా మంది తమ ఇష్టానుసారం వివిధ రకాల మసాలాలు, కొన్ని ముడి పదార్థాలతో కిచ్డీ తయారు చేసి ఎంజాయ్ చేస్తూ తింటారు.
మీ పొట్ట బాగా లేకుంటే కొద్దిగా కిచ్డీ తింటే పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. కిచ్డీ సాధారణంగా రోగులకు ఉత్తమమైన ఆహారం. వ్యాధిగ్రస్తుల నుండి ఆరోగ్యవంతుల వరకు అందరూ తినదగిన ఆహారంగా కిచ్డీ ఉంది. దీనితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆహార పట్టికలో కిచ్డీకి ముఖ్యమైన స్థానం ఉందని మనలో చాలా మందికి తెలియదు. కిచ్డీ తినడం అలవాటు చేసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. కిచ్డీ తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. శరీరం రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని శక్తి స్థాయి కూడా బాగుంటుంది.
కిచ్డీ పప్పు, అన్నం, కూరగాయలు, వివిధ మసాలా దినుసులతో చేసిన రుచికరమైన, పోషకమైన వంటకం. కిచ్డీ ఈ పోషకాలు శరీరానికి శక్తిని, పోషణను అందిస్తాయి. కిచ్డీ చాలా తక్కువ మసాలా దినుసులతో తయారు చేస్తారు. ఇది ఆరోగ్య ఆహారంలో భాగంగా పరిగణిస్తారు. ఆయుర్వేదంలో కిచ్డీ ప్రత్యేక స్థానం రావడానికి ఇది ప్రధాన కారణం. కిచ్డీ మన పేగులకు, పొట్టకు ఎంతో మేలు చేస్తుంది. కిచ్డీ జీర్ణక్రియ పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. అనేక వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది.
మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు మలబద్ధకం, అజీర్ణం సర్వసాధారణం. ఇది కాకుండా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రజలలో కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కిచ్డీ తీసుకోవడం వల్ల మీ శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. కిచ్డీ తిన్నాక కడుపులో బరువుగా అనిపించడం తగ్గి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
సాధారణంగా పని చేసే పురుషులు, మహిళలు తక్కువ వండుతారు. మనలో చాలా మందికి పని ముగించుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు దొరికినవి కొని వండే అలవాటు ఉంటుంది. కిచ్డీ అనేది సులభమైన వంటకం. ఇది పనిలో ఉండేవారికి వంట సమయాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మీరు కిచ్డీ రుచిని మెరుగుపరచడానికి వేరుశెనగ, పప్పు వంటి వాటిని కలుపుకోవచ్చు.