Soya Khichdi Recipe : పోషక విలువలతో కూడిన సోయా కిచ్డీ.. పిల్లలకు చాలా మంచిది..
Soya Khichdi Recipe : సోయాబీన్స్ పూర్తిగా ప్రోటీన్‌తో నిండి ఉంటాయని మనందరికీ తెలుసు. ప్రోటీన్ శరీరానికి ఎంతో అవసరం. అందుకే దీనిని మీ ఆహారంలో కచ్చితంగా తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. లేకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు. మరి మీ డైట్లో సోయా బీన్స్‌ను టేస్టీగా ఎలా కలిపి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Soya Khichdi Recipe : కిచ్డీ అనేది మన రోజువారీ ఆహారంలో ఓ రుచికరమైన వంటకం. అయితే దీనిలో మరింత పోషక విలువలను చేర్చుకోవాలంటే మీరు కచ్చితంగా సోయా కిచ్డీని మీ బ్రేక్‌ఫాస్ట్‌లో కలిపి తీసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఇంట్లో తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మరి దీనిని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* సోయా బీన్స్ - 1 కప్పు (నానబెట్టాలి)
* బియ్యం - 1 1/2 కప్పు (నానబెట్టాలి)
* పచ్చిమిర్చి - 2 (తరగాలి)
* టొమాటో - 2 (తరగాలి)
* ఉల్లిపాయ - 1 పెద్దది (తరగాలి)
* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
*నూనె - 1 టేబుల్ స్పూన్
* ఉప్పు - రుచికి తగినంత
* పసుపు - చిటికెడు
* జీలకర్ర - 1 టీస్పూన్
* కొత్తిమీర - 2,3 టేబుల్ స్పూన్ల్ (తాజాది, తరిగినది)
* పెరుగు - 1/2 కప్పు
* పచ్చి బఠాణీలు - ¼ కప్పు
తయారీ విధానం
ముందుగా ఓ పెద్ద పాన్ తీసుకుని.. దానిలో నీరు వేసి మరిగించండి. ఇప్పుడు దానిలో సోయా బీన్స్, బియ్యం, టమోటాలు, పచ్చిమిర్చి వేసి ఉడకనివ్వండి. బియ్యం, బీన్స్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
అనంతరం ఓ పాన్ తీసుకుని దానిలో నూనె వేసి.. ఉల్లిపాయ, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత దానిలో పసుపు, పెరుగు, రుచికి ఉప్పు, బఠానీలు వేసి కలపాలి. తర్వాత వండిన అన్నం, బీన్స్ వేసి బాగా కలపండి. కనీసం 10 నిముషాల పాటు దానిని బాగా కలపండి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసి.. తరిగిన కొత్తిమీర వేయాలి. అంతే వేడి వేడి సోయా కిచ్డీ రెడీ.
సంబంధిత కథనం