Soya Idly Recipe : సోయాబీన్స్​తో ఇడ్లీలు.. ప్రోటీన్​కు మంచి నేస్తాలు..-soya idly recipe for breakfast here is the making process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Soya Idly Recipe : సోయాబీన్స్​తో ఇడ్లీలు.. ప్రోటీన్​కు మంచి నేస్తాలు..

Soya Idly Recipe : సోయాబీన్స్​తో ఇడ్లీలు.. ప్రోటీన్​కు మంచి నేస్తాలు..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 20, 2022 07:15 AM IST

Soya Idly Recipe : ఉదయాన్నే చాలామంది ఇడ్లీలు తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దీనిని ఎలాంటి ఆయిల్ లేకుండా.. స్టీమ్ మీద ఉడికిస్తారు కాబట్టి ఆరోగ్యానికి మంచిదంటారు. అయితే దీనిలో ప్రోటీన్​ను మరింత పెంచుకోవాలి అనుకుంటే.. మీరు ఈ రెసిపీని ట్రై చేయాల్సిందే.

సోయాబీన్స్​తో ఇడ్లీలు
సోయాబీన్స్​తో ఇడ్లీలు

Soya Idly Recipe : రోజూ ప్రోటీన్​ను తగినంత తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెప్తారు. ఆరోగ్యానికి ఇది చాలా అవసరం కూడా. అయితే మీ ఇడ్లీలలో ప్రోటీన్​ ఎక్కువ ఉండేలా తీసుకుంటే.. అది రోజంతా మిమ్మల్ని మరింత ఎనర్జిటిక్​గా ఉంచుతుంది. అది ఎలా అనుకుంటున్నారా? సోయాబీన్స్​ను మీ ఇడ్లీ రెసిపీలో చేర్చుకుంటే.. ఇది మీకు ప్రోటీన్​ను అందిస్తుంది. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* సోయాబీన్ - 1 కప్పు

* మినపప్పు - 1 కప్పు

* మెంతి గింజలు - 1 టీస్పూన్

* ఇడ్లీరవ్వ - 1 కప్పు

* శనగపప్పు - 1 టీస్పూన్

తయారీ విధానం

ముందుగా పప్పు, బియ్యం, సోయాబీన్‌లను విడిగా నానబెట్టండి. వాటిలో మెంతిగింజలు, శనగపప్పు వేయండి. బియ్యాన్ని కనీసం 5-6 గంటలు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత అన్నింటిని కలిపి మందపాటి, స్థిరమైన పేస్ట్‌గా రుబ్బుకోవాలి. అనంతరం దానిలో ఇడ్లీరవ్వ, ఉప్పు వేసి బాగా కలపండి. పిండిని కనీసం 6 గంటలు లేదా రాత్రిపూట పులియనివ్వండి. ఉదయాన్నే లేదా పులిసిన తర్వాత.. పిండిని మరోసారి బాగా కలపండి. ఇప్పుడు ఇడ్లీ స్టీమర్‌లో ఇడ్లీలు వేసేయండి. దీనిని సాంబార్, కొబ్బరి చట్నీతో వేడి వేడిగా లాగించేయవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం