Bitter gourd Curry Recipe। రోగనిరోధక శక్తిని పెంచే కాకరకాయ.. మాన్‌సూన్ డైట్‌లో తప్పక ఉండాలి!
Bitter gourd Curry Recipe: మాన్‌సూన్ డైట్‌లో కాకరకాయను తప్పకుండా చేర్చుకోండి. రుచికరమైన కాకరకాయ కర్రీ రెసిపీని ఇక్కడ చూడండి.
Healthy Monsoon Recipes: వర్షాకాలంలో మీ శరీరానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ అవసరం. ఇది అంటువ్యాధులు, వైరస్‌లు ప్రబలంగా ఉండే సీజన్ కాబట్టి వాటితో పోరాడే శక్తిని మీ శరీరానికి అందివ్వాలి. ఇందులోసం రోగ నిరోధక శక్తిని పెంచే కొన్ని సూపర్‌ఫుడ్‌లను మీ మాన్‌సూన్ డైట్‌లో చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, తరచుగా అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. ముఖ్యంగా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాబితాలో కాకరకాయ కచ్చితంగా ఉంటుంది.
కాకరకాయ రుచిలో చేదుగా ఉంటుంది కానీ, ఇది మీకు అసంఖ్యాక ప్రయోజనాలను అందిస్తుంది. కాకరకాయ విటమిన్ C కి గొప్ప మూలం, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీనిలోని బలమైన యాంటీవైరల్ లక్షణాలు కాలానుగుణ ఫ్లూ నుండి మనలను రక్షిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేసి అంటువ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇక్కడ రుచికరమైన కాకరకాయ రెసిపీని అందిస్తున్నాం. మీరూ ఇలా వండుకొని తినండి.
Bitter gourd Curry Recipe కోసం కావలసినవి
- 4 కాకరకాయలు
- 2 ఉల్లిపాయలు
- 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- ½ స్పూన్ పసుపు
- 1 టీస్పూన్ కారం
- 1 టీస్పూన్ గరం మసాలా పొడి
- 1/2 స్పూన్ ధనియాల పొడి
- 1 టేబుల్ స్పూన్ చింతపండు పేస్ట్ లేదా 1.5 స్పూన్ ఆమ్చూర్ పొడి
- 2 టీస్పూన్ నూనె
- రుచికి తగినంత ఉప్పు
కాకరకాయ కర్రీ తయారీ విధానం
- ముందుగా కాకరకాయలను ముక్కలుగా కట్ చేసుకొని వాటిపైన కొద్దిగా ఉప్పు చల్లి, కొన్ని నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత కడిగి వాడాలి.
- ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడయ్యాక, తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు తక్కువ మంట మీద వేయించాలి.
- అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- ఆ తర్వాత కాకరకాయ ముక్కలు వేసి కలపాలి, ఆపైన పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. 10-15 నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి.
- అనంతరం చింతపండు పేస్ట్ లేదా డ్రై మ్యాంగో పౌడర్‌తో పాటు కొంచెం ఉప్పు, గరం మసాలా వేయండి.
- తరువాత 1/2 కప్పు నీరు పోసి, మూత పెట్టి 5 నుండి 7 నిమిషాలు ఉడికించాలి.
అంతే, కాకరకాయ కర్రీ రెడీ.
సంబంధిత కథనం