OTT Releases: ఓటీటీలోకి ఒక్కరోజే 8 సినిమాలు- 3 మాత్రమే స్పెషల్- రెండు బోల్డ్, మరొకటి క్రైమ్ థ్రిల్లర్- ఎక్కడ చూస్తారంటే?
Friday OTT Movies Releases: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ప్రతివారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు వస్తాయని తెలిసిందే. అలాగే ఈ వారం కూడా అన్ని కలిపి 16కిపైగానే విడుదల అయ్యాయి. వాటిలో ఒక్కరోజే 8 సినిమాలు రిలీజ్ కాగా వాటిలో మూడు మాత్రమే చాలా స్పెషల్‌గా ఉన్నాయి. మరి వాటిని ఎక్కడ చూడాలో తెలుసుకుందాం.
Today OTT Releases: ప్రతి వారం డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు, సిరీసులు డిజిటల్ వేదికలపై అలరించేందుకు దర్శనం ఇస్తుంటాయి. ఇక ఓటీటీల్లో సినిమాలు, సిరీసులు చూడాలనుకునేవారికి ప్రతి వారం ఓ పండుగ అనే చెప్పొచ్చు. ఎందుకుంటే ఎప్పటిలాగే ఈ వారం కూడా అన్ని కలిపి మొత్తంగా 16కుపైగా సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఒక్కరోజు అంటే మే 3న ఏకంగా 8 సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ మూవీ)- మే 3
ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- మే 3
ఆహా ఓటీటీ
సిద్ధార్థ్ రాయ్ (తెలుగు సినిమా)- మే 3
హ్యాపీ ఎండింగ్ (తెలుగు అడల్ట్ కామెడీ సినిమా)- మే 3
అసుర గురు (తెలుగు డబ్బింగ్ సినిమా)- మే 3
జియో సినిమా ఓటీటీ
వోంకా (ఇంగ్లీష్ సినిమా)- మే 3
ది టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 3
హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 3
చాలా స్పెషల్
ఇలా సినిమాలు, సిరీసులు కలుపుకుని 8 మే 3 నుంచి ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. వీటిలో ఆహా ఓటీటీలో (Aha OTT) స్ట్రీమింగ్ అవుతోన్న సిద్ధార్థ్ రాయ్ (Siddharth Roy OTT), హ్యాపీ ఎండింగ్ (Happy Ending OTT) రెండు తెలుగు సినిమాలు బోల్డ్ అండ్ అడల్డ్ కంటెంట్‌తో ఉన్నవి. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆదరణ పొందని ఈ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో చాలా స్పెషల్‌గా మారాయి.
Aha OTT Movies: ఇక మూడో సినిమా అసుర గురు (Asura Guru OTT). తమిళంలో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా మే 3 నుంచి ఆహా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగు భాషలో ప్రసారం అవుతోంది. ఇలా రెండు స్ట్రైట్ తెలుగు సినిమాలతోపాటు ఒక తెలుగు డబ్బింగ్ ఈ సినిమా ఓటీటీలో ప్రత్యేకంగా నిలిచాయి. ఈ వీకెండ్‌కు ఈ మూడు చూడటం మంచి టైమ్ పాస్. కానీ, మొదటి రెండు సినిమాలను మాత్రం ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేం.
నెట్‌ఫ్లిక్స్
ఇదిలా ఉంటే, నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ సినిమా సైతాన్ (Shaitaan OTT) స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా కేవలం హిందీ భాషలోనే స్ట్రీమింగ్ అవుతోంది. దీంతోపాటు ది అటిపికల్ ఫ్యామిలీ అనే కొరియన్ వెబ్ సిరీస్ మే 4 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. మే 2 నుంచి సర్వైవల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఎస్కేప్ ప్లాన్: టోర్నమెంట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రసారం అవుతోంది.
టాపిక్