OTT: ఓటీటీలో ఆహా అనిపించే ట్రెండింగ్ సినిమాలు.. పోటీగా 2 టాక్ షోలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-top 10 trending movies and talk shows this week on aha ott premalu ott streaming now chef mantra 3 ott sam jam ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలో ఆహా అనిపించే ట్రెండింగ్ సినిమాలు.. పోటీగా 2 టాక్ షోలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT: ఓటీటీలో ఆహా అనిపించే ట్రెండింగ్ సినిమాలు.. పోటీగా 2 టాక్ షోలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 18, 2024 12:55 PM IST

OTT Trending Talk Shows This Week: ఓటీటీల్లో సినిమాలు తరచుగానే ట్రెండింగ్‌లో ఉంటాయి. కానీ, ఆ సినిమాలను పక్కన పెట్టి మరి రెండు టాక్ షోలు ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. మరి ఆ టాక్ షోలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

ఓటీటీలో ఆహా అనిపించే ట్రెండింగ్ సినిమాలు.. పోటీగా 2 టాక్ షోలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలో ఆహా అనిపించే ట్రెండింగ్ సినిమాలు.. పోటీగా 2 టాక్ షోలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Trending Movies This Week: సాధారణంగా ఓటీటీల్లో విడుదలైన సినిమాలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని థియేటర్లలో పెద్దగా ఆదరణ దక్కించుకోని సినిమాలు ఉంటే.. మరికొన్ని నేరుగా ఓటీటీలో రిలీజైనవి ఉంటాయి. అయితే, మూవీస్‌కే పోటీ ఇచ్చేలా కొన్ని టాక్ షోలు ట్రెండింగ్‌లో నిలవడం ఇప్పుడు విశేషంగా మారింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ రెండు టాక్‌ షోలు ట్రెండ్ అవుతున్నాయి. ఆ టాక్ షోలతో పాటు ఆహా ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు కూడా ఏంటో లుక్కేద్దాం.

ప్రేమలు ఓటీటీ

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచంది ప్రేమలు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో తెలుగులో సైతం రిలీజ్ చేశారు. ప్రేమలు సినిమా రెండు ఓటీటీల్లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, కన్నడ, హిందీ వెర్షన్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజ్ అవ్వగా.. తెలుగు వెర్షన్ మాత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

విడుదలైనప్పటి నుంచి

ప్రేమలు తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో నెంబర్ వన్ ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది. మూవీ ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మొదటి స్థానంలోనే ఉంటోంది. ఎప్పటిలాగే ఈ మలయాళం సినిమాకు కూడా మంచి ఆదరణ వస్తోంది.

డీజే టిల్లు

ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాతో మరో సాలిడ్ సక్సెస్ కొట్టాడు సిద్దు జొన్నలగడ్డ. ఈ సినిమా డీజే టిల్లుకు సీక్వెల్ అని తెలిసిందే. టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న నేపథ్యంలో ఆహా ఓటీటీలో ఉన్న డీజే టిల్లు ట్రెండింగ్‌లోకి వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి నటించిన ఈ సినిమా టాప్ 2 ట్రెండింగ్‌లో నిలిచింది.

గ్రాండ్ గాలా నైట్

గ్రాండ్ గాలా నైట్ పేరుతో నిర్వహించిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ 2024 వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఆహాలో ప్రసారం అవుతోంది. ఇప్పుడు టాప్ 3 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది.

చెఫ్ మంత్ర సీజన్ 3

నిహారిక కొణిదెల హోస్ట్‌గా చేస్తున్న టాక్ షో చెఫ్ మంత్ర సీజన్ 3. ఈ టాక్ షోకు అతిథులుగా మై డియర్ దొంగ టీమ్ అభినవ్ గోమఠం, షాలిని వచ్చారు. వీరిద్దరు వచ్చి సందడి చేసిన ఎపిసోడ్ 7 ఆహా ఓటీటీలో టాప్ 4 ప్లేస్ దక్కించుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న మై డియర్ దొంగ ప్రమోషన్స్‌లో మూవీ హీరోహీరోయిన్స్ అభినవ్ గోమఠం, షాలినీ ఆ టాక్ షోలో పాల్గొన్నారు.

సామ్ జామ్ టాక్ షో

స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన టాక్ షో సామ్ జామ్. ఈ షో ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ప్రారంభించారు. 2021 సంవత్సరంలో స్టార్ట్ అయిన ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు ఆహాలో టాప్ 5వ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ఇటీవల విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఈ ఎపిసోడ్ ట్రెండింగ్ అవుతోందని తెలుస్తోంది.

వెనక్కి నెట్టి

వీటి తర్వాత టాప్ 6 నుంచి 10 వరకు స్థానాల్లో హారర్ మూవీ తంత్ర, ఫీల్ గుడ్ కామెడీ సినిమా సుందరం మాస్టర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ, బోల్డ్ మూవీ మిక్స్ అప్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాలు ఉన్నాయి. మొన్నటివరకు టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోయిన ఈ సినిమాలను వెనక్కి నెట్టి మరి చెఫ్ మంత్ర, సామ్ జామ్ టాక్ షోలు ఆహాలో ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. దీంతో ఆహాలోని అన్ని సినిమాలకు ఈ రెండు షోలు గట్టి పోటీ ఇస్తున్నట్లు అర్థమవుతోంది.