OTT Movies: ఓటీటీలో ఈవారం 17 మూవీస్.. హిట్ సినిమాలతోపాటు హారర్, సర్వైవల్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?-ott movies web series released on this week tillu square ott bhimaa ott release netflix ott releases on this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలో ఈవారం 17 మూవీస్.. హిట్ సినిమాలతోపాటు హారర్, సర్వైవల్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movies: ఓటీటీలో ఈవారం 17 మూవీస్.. హిట్ సినిమాలతోపాటు హారర్, సర్వైవల్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 22, 2024 02:35 PM IST

OTT Movies Releases On This Week: ఈ వారం ఓటీటీలోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 17 స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ఏప్రిల్ 22 నుంచి 28 తేదిల్లో ఈ సినిమాలు, సిరీసులు విడుదల కానున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలో ఈవారం 17 మూవీస్.. హిట్ సినిమాలతోపాటు హారర్, సర్వైవల్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలో ఈవారం 17 మూవీస్.. హిట్ సినిమాలతోపాటు హారర్, సర్వైవల్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

New OTT Movies This Week: ప్రతివారం అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీల్లో సరికొత్త సినిమాలు విడుదలవుతూ ఎంటర్టైన్ చేసేందుకు రెడీగా ఉంటాయి. అలా ఈ వారం థియేటర్లలో లవ్ మీ, నవదీప్ లవ్ మౌళి వంటి చిన్న సినిమాలతోపాటు కోలీవుడ్ హీరో విశాల్ రత్నం తెలుగు డబ్బింగ్ మూవీ రిలీజ్ కానున్నాయి.

ఇక ఓటీటీల్లో ఏప్రిల్ 22 నుంచి 28 మధ్య ఏకంగా 17 (సినిమాలు, సిరీసులు కలిపి) స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో చూసేద్దాం మరి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

భీమా- (తెలుగు మూవీ)- ఏప్రిల్ 25

క్రాక్ (అమీ జాక్సన్ హిందీ సినిమా)- ఏప్రిల్ 26

థ్యాంక్యూ.. గుడ్ నైట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 26

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఫైట్ ఫర్ ప్యారడైజ్ (జర్మన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 23

బ్రిగంటి (ఇటాలియన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 23

డెలివర్ మీ (స్వీడిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 24

డెడ్ బాయ్స్ డికెట్టివ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 25

సిటీ హంటర్ (జపనీస్ మూవీ)- ఏప్రిల్ 25

టిల్లు స్క్వేర్ (తెలుగు సినిమా)- ఏప్రిల్ 26

గుడ్ బై ఎర్త్ (కొరియన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 26

ది అసుంత కేస్ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 26

జియో సినిమా ఓటీటీ

ది జింక్స్ పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 22

వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 27

ది బిగ్ డోర్ ప్రైజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- ఏప్రిల్ 24

దిల్ దోస్తీ డైలమా (హిందీ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- ఏప్రిల్ 25

ది బీ కీపర్ (ఇంగ్లీష్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే- ఏప్రిల్ 26

కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ మూవీ)- బుక్ మై షో- ఏప్రిల్ 26

ఎక్కువగా వెబ్ సిరీసులు

ఇలా ఈ వారం ఓటీటీలో సినిమాలు, సిరీసులు కలుపుకుని 17 స్ట్రీమింగ్‌కు రానున్నాయి. అయితే వీటిలో మూవీస్ కంటే ఎక్కువగా వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) 8 విడుదల అవుతుంటే వాటిలో 6 సిరీసులే ఉండటం గమనార్హం. అలాగే జియో సినిమాలో రెండు, అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), ఆపిల్ ప్లస్ టీవీ (Apple Plus TV OTT), డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar)లో ఒక్కో సిరీస్ రానుంది. ఇలా పదిహేడింటిలో 11 వెబ్ సిరీస్‌లో ఉండటం విశేషంగా మారింది.

3 సిరీసులు.. 4 సినిమాలు

ఈ సిరీసుల్లో హారర్ ఇన్వెస్టిగేటివ్ ఫాంటసీ థ్రిల్లర్ డెడ్ బాయ్స్ డికెట్టివ్స్, సర్వైవల్ థ్రిల్లర్ గుడ్ బై ఎర్త్, దిల్ దోస్తీ డైలమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉండగా.. టిల్లు స్క్వేర్ (Tillu Square OTT), భీమా (Bhimaa OTT), కుంగ్ ఫూ పాండా 4 (Kung Fu Panda 4 OTT), అమీజాక్సన్ యాక్షన్ మూవీ క్రాక్ (Crakk OTT) సినిమాలు స్పెషల్ కానున్నాయి. అంటే 17లో మూడు సిరీసులు, 4 సినిమాలు ఆసక్తిని కలిగించేవిలా ఉన్నాయి.