Evarevaro Song Lyrics: యానిమల్ ఎవరెవరో సాంగ్ లిరిక్స్.. రణ్ బీర్, తృప్తి దిమ్రి బోల్డ్ సీన్స్‌తో ఏమో ఏం చేస్తున్నానో పాట
Animal Emo Em Chesthunnano Song Lyrics: డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యానిమల్‌లోని పాటలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందులోని ఏమో ఏం చేస్తున్నానో.. ఇంకా ఏమేం చేస్తానో అనే పాట లిరిక్స్ చూద్దాం.
Animal Evarevaro Song Lyrics: సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ యానిమల్. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. యానిమల్ మూవీలోని సాంగ్స్, బీజీఎమ్, బీట్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. సినిమాలోని సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకులు రింగ్ టోన్స్, డయలర్ టోన్స్ సైతం పెట్టేసుకుంటున్నారు.
యానిమల్ మూవీలో రణ్ బీర్ కపూర్, తృప్తి దిమ్రి చేసిన బోల్డ్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ శృంగార సన్నివేశంలో బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే సాంగ్ చాలా బాగా ఆకట్టుకుంది. ఎవరెవరో అనే ఈ పాటలో ఏమో ఏం చేస్తున్నానో.. ఇంకా ఏమేం చేస్తానో అంటూ వచ్చే లిరిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ పాటకు విశాల్ మిశ్రా సంగీతం అందించడంతోపాటు ఆలపించారు.
యానిమల్ చిత్రంలోని ఎవరెవరో పాటకు హిందీలో రాజ్ శేఖర్ లిరిక్స్ రాయగా.. తెలుగులో అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. మరి ఇంత బాగా హిట్ అయిన నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఎవరెవరో సాంగ్ లిరిక్స్ చూస్తే..
ఎవరెవరో.. నాకేదురైనా.. నువ్ కలిసాకే మొదలైందే..
మెలకువలో కలలా తూచి.. మరుజన్మేదో మొదలైందే..
ఏమో ఏం చేస్తున్నానో.. ఇంకా ఏమేం చేస్తానో..
చేస్తూ ఏం అయిపోతానో.. మరి..
ఎవరెవరో.. నాకేదురైనా.. నువ్ కలిసాకే మొదలైందే..
మెలకువలో కలలా తూచి.. మరుజన్మేదో మొదలైందే..
ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటే.. ప్రమాదం అనేదే ఇటే రాదే..
సముద్రాల కన్న సొగసెంత లోతే.. ఎలా ఈదుతున్నా ముంచేస్తోందో..
కాల్చుతు ఉన్నాదే కౌగిలే కొలిమిలా.. ఇది వరకు మనసుకు లేని...
పరవసమేదో.. మొదలైందే.. మెలకువలో కలలా తూచి.. మరుజన్మేదో.. మొదలైందే..
ఏమో ఏం చేస్తున్నానో.. ఇంకా ఏమేం చేస్తానో..
చేస్తూ ఏం అయిపోతానో.. మరి..
ఎవరెవరో.. నాకేదురైనా.. నువ్ కలిసాకే మొదలైందే..
మెలకువలో కలలా తూచి.. మరుజన్మేదో మొదలైందే..
ఓ.. ఓ.. ఓ.. ఓ... ఓ.. ఓ.. ఓ.. ఓఓఓ... ఓ.. ఓ..