Smile Review: నవ్వు చూస్తే చనిపోతారు.. స్మైల్ మూవీ రివ్యూ.. ఓటీటీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?-smile movie review in telugu smile ott streaming on netflix ott horror movies hollywood news ott horror thrillers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Smile Review: నవ్వు చూస్తే చనిపోతారు.. స్మైల్ మూవీ రివ్యూ.. ఓటీటీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Smile Review: నవ్వు చూస్తే చనిపోతారు.. స్మైల్ మూవీ రివ్యూ.. ఓటీటీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
May 04, 2024 10:16 AM IST

Smile Movie Review In Telugu: సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ స్మైల్. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఆకట్టుకుందా? లేదా? అనేది స్మైల్ రివ్యూలో తెలుసుకుందాం.

నవ్వు చూస్తే చనిపోతారు.. స్మైల్ మూవీ రివ్యూ.. ఓటీటీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
నవ్వు చూస్తే చనిపోతారు.. స్మైల్ మూవీ రివ్యూ.. ఓటీటీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Smile Review In Telugu: హారర్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. సరికొత్త కాన్సెప్టుతో తెరకెక్కిస్తే హారర్ థ్రిల్లర్స్ మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అలాంటి ఓ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీనే స్మైల్ (Smile Movie). డైరెక్టర్ పార్కర్ ఫిన్ తెరకెక్కించిన ఈ అమెరికన్ సైకలాజికల్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ 2022 సెప్టెంబర్‌ 30న యూఎస్‌లో రిలీజై మంచి ఆదరణ పొందింది.

ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) గతేడాది జూన్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో (Amazon Prime Video) రూ. 75తో రెంటల్ విధానంలో ప్రసారం అవుతోంది. సోసి బేకన్, కైట్లిన్ స్టాసి, కైల్ గాల్నర్, రాబిన్ వీగెర్ట్, కాల్ పెన్, గిలియన్ జిన్సర్, జెస్సీ టి అషర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా అప్పట్లో ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంది. ఇప్పటికీ ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉంటుంది. మరి అలాంటి ఈ సినిమా ఎలా ఉందో స్మైల్ రివ్యూలో చూద్దాం.

కథ:

రోజ్ కార్టర్ (సోసి బేకన్) ఒక సైకాలజీ డాక్టర్. పబ్లిక్‌లో న్యూసెన్స్ చేస్తోందని పీహెచ్‌డీ స్టూడెంట్ లారా వీవర్ (కైట్లిన్ స్టాసి)ను ఎమర్జెన్సీ కేసు కింద రోజ్ దగ్గరికి తీసుకొస్తారు పోలీసులు. తన సమస్య గురించి చెప్పిన లారా ఒక్కసారిగా రోజ్‌ను చూసి నవ్వుతూ సూసైడ్ చేసుకుంటుంది. దాంతో ఒక్కసారిగా మెంటల్‌గా అప్సట్ అవుతుంది రోజ్ కార్టర్.

లారా సూసైడ్ అనంతరం డాక్టర్ రోజ్ కార్టర్ జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటీ? ఆమె ఎదుర్కొన్న భయానక సంఘటనలు ఏంటీ? లారా లాగే ఇంతకుముందు స్మైల్ చేస్తూ సూసైడ్ చేసుకున్నవాళ్లు ఎంతమంది? వాళ్లు అలా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?

రోజ్‌ను వెంటాడుతున్న తెలియని శక్తి ఏంటీ? ఆ శక్తి నుంచి రోజ్ ప్రాణాలతో బయటపడిందా? నవ్వు చూస్తే చనిపోయే శాపం ఏంటీ? రోజ్ గతం ఏంటీ? తను ఎందుకు గిల్ట్‌గా ఫీల్ అవుతూ జీవిస్తోంది? వంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే స్మైల్ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

స్మైల్ సినిమాను 2020లో డైరెక్టర్ పార్కర్ ఫిన్ తీసిన "లారా హ్యస్ నాట్ స్లీప్" (Laura Hasn't Sleep) అనే షార్ట్ ఫిల్మ్ ఆధారంగా ఫుల్ ఫ్లెడ్జ్‌డ్‌గా తెరకెక్కించారు. ఇదొక సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్. సినిమా ప్రారంభం నుంచే ఆసక్తికరంగా, ఇంటెన్స్ బీజీఎమ్‌తో హారిఫిక్ ఫీలింగ్ కలిగిస్తూ ప్రారంభం అవుతుంది. లారా వీవర్ తను ఎదుర్కొన్న భయానక సంఘటనలు చెప్పడంతో సినిమాలో ఏం చూపించనున్నారో ముందే చెప్పేశారు డైరెక్టర్.

థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్

లారా సూసైడ్ తర్వాత రోజ్ కార్టర్ జీవితంలో జరిగే భయానక సంఘటనలు, మార్పులు, పరిస్థితులను థ్రిల్లింగ్‌గా, గ్రిప్పింగ్‌గా చూపించారు. భయపడే సన్నివేశాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే మూవీ ట్రైలర్‌లో ఉన్న సీన్సే సినిమా అంతా ఉన్నాయి. అంతకుమించి ఎక్కువగా లేవు. కొన్నిసార్లు ఊహించనివిధంగా వచ్చే సన్నివేశాలు భయపెడతాయి. డాక్టర్ రోజ్ కార్టర్ తన తల్లితో ఉన్న గతం పర్వాలేదు.

బీజీఎమ్-సినిమాటోగ్రఫీ

స్మైల్ చూసి సూసైడ్ చేసుకున్నవాళ్ల గురించి ఇన్వెస్టిగేట్ చేయడం, చావు నుంచి బయటపడేందుకు దారులు వెతకడం బాగానే ఉంది. సినిమాకు ప్రధాన హైలెట్ నటీనటుల యాక్టింగ్, క్రిస్టోబల్ టాపియా డి వీర్ అందించిన బీజీఎమ్. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కొన్ని సీన్స్ రివర్స్‌లో చూపించారు. క్లైమాక్స్ బాగుంది. కానీ, అది తెలుగు ప్రేక్షకులను నిరాశపరచవచ్చు.

ఘోస్ట్ వెనుక కథ

ఈ సూసైడ్స్ వెనుక ఒక భయంకర రాకాసి ఉన్నట్లు చూపించారు. కానీ, ఈ స్మైల్ వెనుక, ఆ ఘోస్ట్ వెనుక ఉన్న కథ మాత్రం ఏం చెప్పలేదు. దీనికి సీక్వెల్ కూడా రానుంది. స్మైల్ 2 మూవీని ఈ ఏడాది అక్టోబర్‌ 18న విడుదల చేయనున్నారు. మరి అందులో దీనికి సంబంధించిన కథ చెబుతారేమో చూడాలి.

ఫైనల్‌గా చెప్పాలంటే..

2022లో వచ్చిన స్మైల్ మూవీ చూస్తుంటే ఈ ఏడాది నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన నాగ చైతన్య తొలి వెబ్ సిరీస్ ధూత గుర్తుకు వస్తుంది. కానీ, ధూత కంటే ఎక్కువ హార్రిఫిక్ సీన్స్ ఉంటాయి. కథ మాత్రం కాస్తా తక్కువగా ఉంటుంది. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే మంచి హారిఫిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం స్మైల్ కచ్చితంగా చూడొచ్చు. రెండు ముద్దు సీన్స్ తప్పా ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. సినిమా చూశాక ఎవరు స్మైల్ చేసిన మూవీ ఎక్స్‌పీరియన్స్ హంట్ చేసే అవకాశం ఉంది.