Telugu News  /  Entertainment  /  Kamal Haasan Gifts Suriya A Rolex Watch After Vikram Success
సూర్య, కమల్ హాసన్
సూర్య, కమల్ హాసన్ (Twitter)

Vikram Movie: సూర్యకు స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చిన కమల్‌ హాసన్‌

08 June 2022, 17:08 ISTHari Prasad S
08 June 2022, 17:08 IST

విక్రమ్‌ మూవీ ఊహించని సక్సెస్‌ సాధించడంతో ఈ సినిమా ప్రొడ్యూసర్‌, హీరో కమల్‌ హాసన్‌ ఆనందం పట్టలేకపోతున్నాడు. సినిమాలో పని చేసిన వాళ్లందరికీ స్పెషల్‌ గిఫ్ట్‌లతో సర్‌ప్రైజ్‌ చేస్తున్నాడు.

కమల్‌ హాసన్‌కు చాలా రోజుల తర్వాత దక్కిన అతిపెద్ద విజయం విక్రమ్‌. ఓ హీరోగా, ప్రొడ్యూసర్‌గా ఈ మూవీ సక్సెస్‌ కమల్‌లో ఎంతో ఉత్సాహం నింపింది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతోపాటు బాక్సాఫీస్‌ దగ్గర కూడా దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అసలు ఈ సినిమా ఈ రేంజ్‌ సక్సెస్‌ అవుతుందని ఎవరూ ఊహించలేదు.

ట్రెండింగ్ వార్తలు

ఈ విజయంతో పట్టరాని ఆనందంలో ఉన్న కమల్‌.. సినిమాలో పని చేసిన వాళ్లందరికీ ఏదో ఒక గిఫ్ట్‌ ఇస్తున్నాడు. డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌కు ఖరీదైన లెక్సస్‌ కారును అతడు బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 13 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లకు కూడా అపాచీ ఆర్టీఆర్‌ 160 బైక్‌లను గిఫ్ట్‌లు ఇచ్చాడు. తాజాగా ఈ మూవీలో గెస్ట్‌ రోల్‌ చేసిన సూర్యకూ ఓ ప్రత్యేకమైన బహుమతి ఇవ్వడం విశేషం.

సినిమా చివర్లో కనిపించిన ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిన సూర్య.. ఈ మూవీ సక్సెస్‌కు అదనపు కారణమయ్యాడు. ఈ సినిమాకు ఎలాంటి రెమ్యునరేషన్‌ లేకుండా పని చేసినట్లు ఈ మధ్యే కమల్‌ హాసన్‌ చెప్పాడు. దీంతో ఇప్పుడతనికి ఖరీదైన రోలెక్స్‌ వాచ్‌ను కమల్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. సూర్యను వ్యక్తిగతంగా కలిసి మరీ ఈ బహుమతి ఇవ్వడం విశేషం. తన జీవితంలో ఇది స్పెషల్‌ మూమెంట్‌ అని ఈ సందర్భంగా సూర్య అన్నాడు.

దీనిని ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఇలాంటి మూమెంట్ జీవితాన్ని అందంగా మార్చేస్తుంది. థ్యాంక్యూ అన్నా ఫర్‌ యువర్‌ రోలెక్స్‌ అని సూర్య కామెంట్ చేశాడు. విక్రమ్‌ సక్సెస్‌ తర్వాత అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతూ వీడియోలు చేసిన కమల్‌ హాసన్‌.. తాను సూర్యతో పూర్తిస్థాయి మూవీ చేయనున్నట్లు కూడా చెప్పాడు.

టాపిక్