Mangalavaram OTT: ఓటీటీలోకి వచ్చేసిన పాయల్ బోల్డ్ మూవీ.. మరిన్ని అడల్ట్ సీన్స్ యాడ్ చేసి స్ట్రీమింగ్
Payal Rajput Mangalavaram OTT Streaming: హాట్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ బోల్డ్ మూవీ మంగళవారం మరిన్ని బోల్డ్ సీన్స్ యాడ్ చేసి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారని సమాచారం. అజయ్ భూపతి తెరకెక్కించిన మంగళవారం ఓటీటీ వివరాల్లోకి వెళితే..
Mangalavaram OTT Release: బోల్డ్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్ మరోసారి తన హాట్‌నెస్‌తో అలరించిన చిత్రం మంగళవారం. 'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌తోపాటు 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి, కమెడియన్ ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మంగళవారం సినిమాకు అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థ భాగస్వామి కాగా ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించారు. ట్రైలర్, పోస్టర్లతో అంచనాలు పెంచిన మంగళవారం మూవీ నవంబర్ 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందాయి. మూవీ ఆద్యంతం ఉత్కంఠంగా ఉండటంతోపాటు అడల్ట్ కంటెంట్ కూడా ఉందని టాక్ వచ్చింది.
మంగళవారం సినిమాలో అఫైర్స్ వంటి టాపిక్‌ను బోల్డ్‌గా ప్రజంట్ చేసి వాటి ప్రభావం ఎలా ఉంటుందో చూపించారని రివ్యూస్ వచ్చాయి. ఇలాంటి క్రేజీ కాన్సెప్టుతో తెరకెక్కిన మంగళవారం సినిమా థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వచ్చింది. కానీ, మూవీ యూనిట్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, మంగళవారం సినిమాను కాస్తా ఆలస్యంగా డిసెంబర్ 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 25 అర్ధరాత్రి నుంచి (డిసెంబర్ 26 తెల్లవారు జామున) ప్రసారం చేస్తున్నారు. ఈ ఓటీటీ స్ట్రీమింగ్‌లో అడల్ట్ కంటెంట్‌కు ఎలాంటి సెన్సార్ లేనందున థియేటర్లోల చూపించని బోల్డ్ సన్నివేశాలను, సెన్సార్ బోర్డ్ కట్ చేసిన సీన్స్, మ్యూట్ చేసిన డైలాగ్‌లతోపాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలను యాడ్ చేశారని టాక్ వినిపిస్తోంది. దీంతో పాయల్ రాజ్‌పుత్ ఫ్యాన్స్ మంగళవారం మూవీకి ఓటీటీలో కూడా బ్రేక్ ఇద్దామనుకుంటున్నారు.