Brahmamudi: రాజ్ రెండో భార్య విషయంలో నిజం చెప్పమని మావయ్యను నిలదీసిన కావ్య.. ఇంటి వారసుడిగా మను.. కుంగిపోయిన మురారి
Brahmamudi Serial Latest Episode Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్‌లలో ఏం జరిగనుందనేది ప్రోమోల్లో చూస్తే..

Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్ తీసుకొచ్చిన బిడ్డకు తల్లి ఎవరో సుభాష్‌కు తెలుస్తుంది. బిడ్డ కోసం రాజ్ ఇంట్లోనుంచి వెళ్లిపోడానికి రెడీ కావడంతో ఆ బాబును సుభాష్ బయటకు తీసుకెళ్లిపోతాడు. అది చూసిన రాజ్ అడ్డుపడతాడు. వీళ్లిద్దరు వెళ్లడం చూసిన కావ్య వారిని ఫాలో అయి వారు మాట్లాడుకున్నదంతా వింటుంది.
నిజం తెలుసుకోవాలి
నువ్ ఇంట్లోనుంచి బయటకు వెళ్లే పరిస్థితి వస్తే నిజం ఎలాంటి భయంకరమైనదైన సరే చెబుతానని సుభాష్ అంటాడు. మీరు మాటిచ్చారు. మాట తప్పరని తెలుసు అని రాజ్ కట్టడి చేస్తాడు. ఆ మాటలన్నీ విన్న కావ్య.. మావయ్యకు నిజం తెలుసున్నమాట. ఎలాగైనా మావయ్యను అడిగి నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది.
మీరు బాబును తీసుకుని వెళ్లడం, మీ అబ్బాయి మీ వెనుకే వచ్చి మాట్లాడటం మొత్తం నేను విన్నాను మావయ్య అని కావ్య అంటుంది. దానికి సుభాష్ చాలా షాక్ అవుతాడు. ఒక వైపు ఆయన్ను ఈ సమస్య నుంచి ఎలా కాపాడాలని నేను ఆలోచిస్తుంటే మీరు అన్ని తెలిసి మౌనంగా ఉండిపోయారు అని కావ్య అడుగుతుంది.
ఒట్టు వేయించుకున్న కావ్య
ఇంకోదారి లేక అని సుభాష్ బదులిస్తాడు. నిజం ఏంటో చెప్పండి మావయ్య. దానికి దారి నేను చూపిస్తాను అని కావ్య అంటుంది. చెప్పలేనమ్మా అని సుభాష్ అంటాడు. దాంతో సుభాష్ చేయి తీసుకుని తలపై పెట్టుకుంటుంది కావ్య. మీరు చెప్పకుంటే నా మీద ఒట్టు అని కావ్య అంటుంది. దాంతో సుభాష్ మరింత షాక్ అయి చూస్తాడు.
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు సీరియల్‌లో తనను దత్తత తీసుకుంటున్నట్లు మహేంద్ర ప్రకటించడంతో మను ఫైర్ అవుతాడు. మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారా అని వసుధారపై మండిపడతాడు మను. ఒకరు గట్టిగా నిర్ణయం తీసుకున్నాకా ఎవరు ఎంకరేజ్ చేయాల్సిన పని లేదని వసుధార అంటుంది. ఈ నిర్ణయాన్ని మానుకోండని మను అంటే.. మహేంద్ర లేదని చెబుతాడు.
మహేంద్ర బ్లాక్ మెయిల్
సార్ ఒకసారి చెబితే అర్థం కాదా అని కోపంగా ఫైర్ అవుతాడు మను. దత్తత కార్యక్రమానికి రావాలని, లేకుంటే తాను చనిపోతానని మనును బ్లాక్ మెయిల్ చేస్తాడు మహేంద్ర. దాంతో ఆలోచనలో పడిపోతాడు మను. మరోవైపు ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నువ్వు నోరు తెరిస్తేనే పరిష్కారం అవుతుందని, మౌనం వీడాలని అనుపమకు సలహా ఇస్తుంది పెద్దమ్మ.
ఇంకోవైపు మను, మహేంద్ర మధ్య పెద్ద అగ్గి రాజేశానని, ఇక రాజీవ్‌తో పని లేదని శైలేంద్ర అంటాడు. అలాగే మను బాబాయ్ కొడుకే అని మహేంద్రలో మొదటి అక్షరం మ.. అనుపమలోని రెండో అక్షరం ను అని శైలేంద్ర చెబుతాడు. అదంతా కొట్టిపారేసిన దేవయాని మనసులో మాత్రం కంగారు పడుతుంది. ఇది తెలిస్తే మనును ఇంటి వారసుడిగా మీ నాన్న (ఫణీంద్ర) ప్రకటిస్తాడని హెచ్చరిస్తుంది.
మురారి టెన్షన్
Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కృష్ణ తీవ్ర కడుపునొప్పితో హాస్పిటల్‌లో జాయిన్ అవుతుంది. కృష్ణను తన ఫ్రెండ్ డాక్టర్ పరిమళ బెడ్‌పై చెక్ చేస్తుంటుంది. కృష్ణ స్పృహ లేకుండా ఉంటుంది. పరిమళ కృష్ణకు ఎలా ఉంది అని మురారి అడుగుతాడు.
తర్వాత పరిమళ క్యాబిన్‌లో ఏదో చూస్తూ కంగారుపడుతుంటుంది. నేను ఇంత టెన్షన్ పడి అడుగుతుంటుంటే నువ్ ఏం చెప్పట్లేదేంటీ అని మురారి అరుస్తాడు. ఆ మాటలను చాటుగా ఉండి మీరా వింటూ ఉంటుంది. ఏం జరిగింది అని పరిమళను మరోసారి అడుగుతాడు మురారి.
కుంగిపోయిన మురారి
కృష్ణకి గర్భసంచి తీసేయాలి అని డాక్టర్ పరిమళ బాధగా చెబుతుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మురారి. కానీ, అదంతా విన్న మీరా మాత్రం సంతోషపడుతుంది. పరిమళ మాట విన్న మురారి ఒక్కసారిగా లేచి ఏంటీ.. అని అరుస్తాడు. వారం రోజుల్లో ఆపరేషన్ చేసి గర్భసంచిని తీసేయాలి అని పరిమళ అంటుంది. దానికి మరింత షాక్ అవుతాడు మురారి.
టాపిక్