Krishna Mukunda Murari October 21st Episode: శీనుపై మురారి ఫ్రెండ్ పరిమళకు డౌట్.. నిజం తెలుసుకోనున్న కృష్ణ, ప్రభాకర్-krishna mukunda murari serial today episode of october 21st 2023 parimala has doubt ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari October 21st Episode: శీనుపై మురారి ఫ్రెండ్ పరిమళకు డౌట్.. నిజం తెలుసుకోనున్న కృష్ణ, ప్రభాకర్

Krishna Mukunda Murari October 21st Episode: శీనుపై మురారి ఫ్రెండ్ పరిమళకు డౌట్.. నిజం తెలుసుకోనున్న కృష్ణ, ప్రభాకర్

Sanjiv Kumar HT Telugu

Krishna Mukunda Murari Today Episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్‍ అక్టోబర్ 21వ తేది ఎపిసోడ్‌లో కృష్ణ గురించి చెప్పడానికి భవానీ ఇంటికి వస్తాడు ప్రభాకర్. మధ్యలో మధుకర్‌తో మాట్లాడతాడు. మురారి చనిపోయాడన్న విషయాన్ని మధు చెబుతాడు. ఇలా నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి సీరియల్‍ అక్టోబర్ 21వ తేది ఎపిసోడ్‌

Krishna Mukunda Murari Day 294 Episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్‍‌లో మురారి చనిపోయాడని బాధగా ప్రభాకర్‌కు చెబుతాడు మధుకర్. దానికి షాక్ అయిన ప్రభాకర్.. ఏంట్రా నువ్ మాట్లాడేది అని అంటాడు. మురారి చనిపోయాడు. కృష్ణ ఎక్కడికి వెళ్లిందో తెలియదు. మురారి చనిపోయాడన్న బాధకంటే కృష్ణ ఎక్కడికి వెళ్లిందో అని కోపంగా ఉన్నారు అని మధుకర్ అంటాడు. ఇప్పుడు కిట్టమ్మ ఆసుపత్రిలో ఉందని తెలిస్తే గొడవ అయ్యేలా ఉంది. కిట్టమ్మ ఎక్కడుందో చెప్పకూడదు అని ప్రభాకర్ అనుకుంటాడు.

కృష్ణ తట్టుకోలేదు

మురారి చనిపోయాడన్న విషయం తెలిస్తే కృష్ణ తట్టుకోలేదు అని మధుకర్ ఏడుస్తూ అంటాడు. అవును, నా బిడ్డ తట్టుకోలేదు అని మనసులో అనుకున్న ప్రభాకర్.. ఇంత జరిగితే.. నాకు ఫోన్ చేయాలని పించలేదారా. కనీసం మా అల్లుడిని చివరిచూపు చూసుకునే అదృష్టం కూడా మాకు లేదా. ఇప్పుడే అందరినీ కడిగేస్తా ఉండు అని అంటాడు. మీతో మాట్లాడని తెలిస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. పెద్దమ్మకు తెలిస్తే తాట తీస్తుంది. ముందు కృష్ణ ఎక్కుడుందో కనిపెట్టండి. తనకు విషయం చెప్పండి. అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అని మధుకర్ అంటాడు.

బాధగా నడుచుకుంటూ ప్రభాకర్ వెళ్లిపోతాడు. ఇంత ఘోరం జరిగింది. బిడ్డకు ఈ విషయం ఎలా చెప్పాలి. ఏం పాపం చేసిందో. ఎందుకు ఇంత పెద్ద శిక్ష అని ప్రభాకర్ అనుకుని వెళ్లిపోతాడు. హాస్పిటల్‌లో అదే బాధపడుతూ వెళ్తున్న ప్రభాకర్‌ను భార్య శకుంతల అడుగుతుంది. అల్లుడు మంచిగుండాలే అని నూటొక్క కొబ్బరికాయాలు కొట్టినా. ఎలా ఉన్నాడు. అల్లునికి దెబ్బలు తగిలినయా. వాళ్లు లోపలికి రానిచ్చిండ్రా అని వరుసగా ప్రశ్నలు వేస్తుంది శకుంతల. కానీ, ప్రభాకర్ సైలెంట్ గా ఉంటాడు.

ఆరోగ్యం కుదుటపడ్డాకా

ఏం అడిగిన చెప్పవేంది అని శకుంతల కోపంతో అనడంతో.. మన బిడ్డ ఐదో తనాన్ని దేవుడు తీసుకెళ్లిపోయాడు. అల్లుడు చనిపోయాడు అని ప్రభాకర్ చెబుతాడు. దీంతో కుప్పకూలిపోతుంది శకుంతల. అల్లుడిని తీసుకొస్తానని చెప్పిన నేను చనిపోయడాని ఎలా చెప్పాలి అని ప్రభాకర్ అంటాడు. బిడ్డకు ఇప్పుడే విషయం చెప్పకు. తన ఆరోగ్యం కుదుటపడ్డాక చెబుతాం అని శకుంతల అంటుంది. మరోవైపు మురారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణ.

ఇంతలో వచ్చిన ప్రభాకర్‌ను మురారి గురించి వరుసగా అడుగుతుంది. అల్లుడు కనిపించలేదు. కానీ, ఎక్కడున్నా తీసుకొస్తాను అని ప్రభాకర్ అంటాడు. ఏసీపీ సార్‌కు ఏం కాదు. నేను బాగానే ఉన్నాను కదా. మన హాస్పిటల్‌కు వెళ్దాం. నాకోసం అక్కడికి వస్తారు అని కృష్ణ చెబుతుంది. మరోవైపు మురారిని షిప్ట్ చేయడానికి రెడీ అని, పేమెంట్ మాత్రం ఇక్కడే కట్టాలని శీనుతో డాక్టర్ చెబుతాడు. అదంతా మీరు చూసుకోండి. అంతా అయ్యాకా మీ హాస్పిటల్ స్టాఫ్ కి అదిరిపోయే గిఫ్ట్ ఉంటుంది అని శీను అంటాడు.

మురారి గురించి

ముకుందకు కాల్ చేసి మురారిని షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ అంతా ఓకేనా అడుగుతాడు శీను. మురారి ఫొటోకు దండ వేశారు అని బాధగా చెబుతుంది ముకుంద. ఫొటోకే కదా లైట్ తీసుకో అని కాల్ కట్ చేస్తాడు శీను. అటువైపు తన హాస్పిటల్ కి వెళ్లిన కృష్ణ మురారి డ్రాప్ చేయడం గురించి చెబుతూ సంతోషిస్తుంది. మెడికల్ కాలేజీలో మురారి డ్రాప్ చేయడం, తనకు ఇచ్చిన మాట గుర్తు చేసుకుంటుంది. అదంతా విని శకుంతల ఏడుస్తుంది.

చిన్నమ్మ ఏడవకు. ఏసీపీ సార్ వస్తారు అని కృష్ణ అంటుంది. ఇంతలో తన ముందు నుంచే మురారిని తరలిస్తారు. దీంతో ఏసీపీ సార్ ఇక్కడే ఉన్నారు చిన్నాన్న. నా మనసు చెబుతుంది అని కృష్ణ అంటుంది. అది చూడలేక ప్రభాకర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఏసీపీ సార్ ఇక్కడే ఉన్నట్లు నాకు చాలా బలంగా ఉన్నట్లు అనిపిస్తుంది చిన్నమ్మ అని కృష్ణ అంటుంది. తర్వాత మురారి ఫ్రెండ్ పరిమళ దగ్గరికి మురారిని తీసుకెళ్తాడు శీను.

పరిమళకు డౌట్

ట్రీట్ మెంట్ గురించి చెబుతాడు శీను. తన పేరు అడిగితే.. ముకుందకు ప్రాబ్లమ్ అవుతుందని శేఖర్ అని చెబుతాడు. పేషంట్ పేరు అని అడిగితే.. మురారి అంటాడు. దీంతో మురారినా అని పరిమళ షాక్ అవుతుంది. మురారి కాదు మురళి అని శీను కవర్ చేస్తాడు. ఏంటీ ఏదో తేడాగా ఉన్నాడు అనుకున్న పరిమళ.. ట్రీట్ మెంట్ చేస్తాం. వారంలో డిశ్చార్జ్ ఉంటుంది అని చెబుతుంది. మరోవైపు మురారి కోసం హాస్పిటల్ మొత్తం పిచ్చిదానిలా వెతుకుతుంది కృష్ణ.

ఈ క్రమంలోనే మళ్లీ తన కళ్ల ముందే మురారిని ఐసీయూకి తరలిస్తారు. ఏసీపీ సార్ ఇక్కడే ఉన్నారని అనిపిస్తుంది. అలా అయితే కనిపించాలి కదా అనుకుంటుంది కృష్ణ. తర్వాతి ఎపిసోడ్‌లో ఇంతకుముందు మురారికి ట్రీట్ మెంట్ ఇచ్చిన హాస్పిటల్ లో యాక్సిడెంట్ గురించి అడుగుతారు కృష్ణ, ప్రభాకర్. శీను గురించి చెబుతాడు డాక్టర్. మరోవైపు మురారి స్పృహలోకి వస్తే మనసు మార్చుకోవాలి అని ముకుంద అనుకుంటుంది.