World Cup Points Table 2023: న్యూజిలాండ్‌కు చావో రేవో - శ్రీలంక గెల‌వాల‌ని కోరుకుంటున్న పాక్ ఫ్యాన్స్‌-new zealand vs sri lanka world cup 2023 prediction and wc points table ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  World Cup Points Table 2023: న్యూజిలాండ్‌కు చావో రేవో - శ్రీలంక గెల‌వాల‌ని కోరుకుంటున్న పాక్ ఫ్యాన్స్‌

World Cup Points Table 2023: న్యూజిలాండ్‌కు చావో రేవో - శ్రీలంక గెల‌వాల‌ని కోరుకుంటున్న పాక్ ఫ్యాన్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 09, 2023 10:40 AM IST

New Zealand vs Sri lanka: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నేడు (గురువారం) శ్రీలంక‌తో న్యూజిలాండ్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే న్యూజిలాండ్ సెమీస్ ఆశ‌లు నిలుస్తాయి. మ‌రోవైపు నెద‌ర్లాండ్స్‌పై విజ‌యంతో ఇంగ్లండ్ పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానానికి చేరుకుంది.

విలియ‌మ్స‌న్‌
విలియ‌మ్స‌న్‌

New Zealand vs Sri lanka:వ‌ర‌ల్డ్ క‌ప్‌లో గురువారం (నేడు) శ్రీలంక‌తో న్యూజిలాండ్ త‌ల‌ప‌డ‌నుంది. న్యూజిలాండ్ సెమీస్ ఆశ‌లు నిల‌వాలంటే ఈ మ్యాచ్‌లో త‌ప్ప‌కుండా విజ‌యం సాధించాల్సివుంది. ప్ర‌స్తుతం న్యూజిలాండ్ ఎనిమిది పాయింట్ల‌తో పాకిస్థాన్‌, అప్ఘ‌నిస్థాన్‌ల‌తో పాయింట్స్ టేబుల్‌లో స‌మానంగా ఉంది. శ్రీలంక‌పై న్యూజిలాండ్ విజ‌యం సాధిస్తే ప‌ది పాయింట్ల‌తో ముంద‌జ వేస్తుంది.

అయితే పాకిస్థాన్, ఇంగ్లాండ్‌తో పాటు అప్ఘ‌నిస్థాన్‌, సౌతాఫ్రికా మ్యాచ్ ఫ‌లితాల‌ను అనుస‌రించే న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ అవ‌కాశాలు ఆధార‌ప‌డ్డాయి. ఒక‌వేళ ఇంగ్లాండ్ చేతిలో పాకిస్థాన్‌, సౌతాఫ్రికా చేతిలో అప్ఘ‌నిస్థాన్ ఓడితే న్యూజిలాండ్ సెమీస్‌లో అడుగుపెడుతుంది. శ్రీలంక‌తో పోరులో న్యూజిలాండ్ ఆశ‌ల‌న్నీ ర‌చిన్ ర‌వీంద్ర‌పైనే ఉన్నాయి.

ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌ల‌తో వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టాప్ స్కోర‌ర్‌లో ఒక‌రిగా ర‌చిన్ ర‌వీంద్ర నిలిచాడు. ర‌చిన్‌తో పాటు విలియ‌మ్స‌న్‌, మిచెల్‌, లాథ‌మ్ రాణిస్తే న్యూజిలాండ్ భారీ స్కోరు చేయ‌డం ఖాయం. మ‌రోవైపు రెండు విజ‌యాల‌తో వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి శ్రీలంక నిష్క్ర‌మించింది. న్యూజిలాండ్‌పై గెలిచి ప‌రువు నిలుపుకోవాల‌ని అనుకుంటోంది.

ఏడో స్థానంలో ఇంగ్లండ్‌

వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రెండో విజ‌యాన్ని సొంతం చేసుకున్న‌ది ఇంగ్లండ్‌. బుధ‌వారం నెద‌ర్లాండ్స్‌ఫై 160 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. స్టోక్స్ (108 ర‌న్స్‌) సెంచ‌రీతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవ‌ర్ల‌లో 339 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో నెద‌ర్లాండ్స్ 179 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఈ విజ‌యంతో ఇంగ్లండ్ పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానానికి చేరుకుంది. రెండు విజ‌యాల‌తో వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి నెద‌ర్లాండ్స్ నిష్క్ర‌మించింది.

IPL_Entry_Point