AP Medical Colleges Posts : ఏపీలో కొత్త వైద్య కళాశాలలకు 380 పోస్టులు మంజూరు, జీవో జారీ
AP Medical Colleges Posts : ఏపీలో కొత్త మెడికల్ కాలేజీలకు మరో 380 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 21 విభాగాల్లో 380 పోస్టులు మంజూరు చేసింది.
AP Medical Colleges Posts : ఏపీలో కొత్త మెడికల్ కాలేజీలకు పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మెడికల్ కాలేజీలకు 21 విభాగాల్లో 380 పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, విజయనగరం మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. 2024-25 విద్యా సంవత్సరంలో పాడేరు, పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని కాలేజీలు ప్రారంభం కానున్నాయి.
380 పోస్టులు మంజూరు
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలకు 222, బోధన ఆస్పత్రికి 484 చొప్పున గతంలో ప్రభుత్వం పోస్టులను మంజూరు చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్(NMC) నిబంధనల మేరకు వైద్యులు, బోధనా సిబ్బంది అందుబాటులో ఉంచేందుకు తాజాగా మరో 380 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రొఫెసర్లు 60, అసోసియేట్ ప్రొఫెసర్లు 85, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 75, ఎస్‌ఆర్/ట్యూటర్ పోస్టులు 160... కొత్తగా మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2024–25 విద్యా సంవత్సరంలో ప్రారంభించే మెడికల్ కాలేజీల్లో పోస్టుల భర్తీకి డీఎంఈ ఉత్తర్వులు ఇచ్చింది. 130 మంది ట్యూటర్, 37 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక ఉత్తర్వులు ఇచ్చింది. కొత్తగా మంజూరు అయితే పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్ ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్, ఆర్‌సీఐ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 15 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.అడ్‌హక్ ప్రాతిపదికన భర్తీ ఈ ఉద్యోగాల్లో టీచింగ్, నాన్ - టీచింగ్ కొలవులు ఉన్నాయి. దరఖాస్తులకు జూన్ 10వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- మొత్తం ఖాళీలు - 15
- ఖాళీల వివరాలు - ప్రైమరీ టీచర్: 05 పోస్టులు
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 05 పోస్టులు
- ల్యాబ్ ఇన్‌ఛార్జ్ (ఏటీఎల్ ల్యాబ్ ఇన్‌చార్జ్): 01 పోస్టు
- ఏఐ టీచర్ (టీజీటీ): 01 పోస్టు
- ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్: 02 పోస్టులు
- అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్: 01 పోస్టు
- అర్హతలు - పోస్టును అనుసరించి డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ ఉండాలి. టీచింగ్ పోస్టులకు టెట్, సీటెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. పని అనుభవం కూడా ఉండాలి.
- దరఖాస్తులు - ఆన్ లైన్ లో ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోని ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ: 10.06.2024.
- దరఖాస్తు ఫారమ్ డౌన్లోడ్ లింక్ - https://www.dlsrci.in/media/docs/TeachersRecruitmentRegistrationForm.pd
- అప్లికేషన్లు పంపాల్సిన చిరునామా - DEFENCE LABORATORIES' SCHOOL, VIGNYANAKANCHA, RCI, HYDERABAD - 500069.
- ఈమెయిల్- DLSRCI.RECRUITMENT@GMAIL.COM
సంబంధిత కథనం