OTT: ఇండియాలో థియేటర్లలో రిలీజ్ కాకుండానే ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ గాడ్జిల్లా మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..-godzilla minus one streaming started in india on netflix ott in four languages godzilla minus ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఇండియాలో థియేటర్లలో రిలీజ్ కాకుండానే ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ గాడ్జిల్లా మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..

OTT: ఇండియాలో థియేటర్లలో రిలీజ్ కాకుండానే ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ గాడ్జిల్లా మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 01, 2024 04:07 PM IST

Godzilla Minus One OTT Steaming: గార్జిల్లా మైనస్ వన్ సినిమా ఎట్టకేలకు ఇండియాలో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. వివిధ దేశాల్లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ భారత్‍లో నేరుగా ఓటీటీలో అడుగుపెట్టింది. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Godzilla Minus One OTT: ఇండియాలో థియేటర్లలో రిలీజ్ కాకుండానే ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ గాడ్జిల్లా మూవీ
Godzilla Minus One OTT: ఇండియాలో థియేటర్లలో రిలీజ్ కాకుండానే ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ గాడ్జిల్లా మూవీ

Godzilla Minus One OTT: ‘గాడ్జిల్లా మైనస్ వన్’ సినిమా గతేడాది నవంబర్‌లో జపాన్‍లో థియేటర్లలో రిలీజ్ అయింది. ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, న్యూడిలాండ్ ఆస్ట్రియా, జర్మనీ, ఫ్రాన్స్ సహా మరికొన్ని దేశాల్లో ఈ చిత్రం విడుదలైంది. అద్భుతమైన వీఎఫ్‍ఎక్స్‌తో ఈ జపనీస్ మూవీ అదిరిపోయిందనే టాక్ వచ్చింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ చిత్రానికి ఆ ఏడాది ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. దీంతో గాడ్జిల్లా మైనస్ వన్ చిత్రం ఇండియాలో ఎప్పుడు థియేటర్లకి వస్తుందా అని చాలా మంది వేచిచూశారు. అయితే, ఈ సినిమా భారత్‍లో థియేటర్లలో రిలీజ్ కాకుండానే సడెన్‍గా ఓటీటీలోకి అడుగుపెట్టేసింది.

సడెన్‍గా ఓటీటీలోకి.. నాలుగు భాషల్లో..

గాడ్జిల్లా మైనస్ వన్ చిత్రం నేడు (జూన్ 1) సడెన్‍గా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో భారత్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చేసింది. జపనీస్‍తో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ముందుగా ఎలాంటి ప్రకటన లేకుండా నేడు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది ఈ చిత్రం.

గాడ్జిల్లా చిత్రాలను హాలీవుడ్‍తో పాటు జపాన్ ఇండస్ట్రీ కూడా చాలా చాలా ఏళ్లుగా తెరకెక్కిస్తోంది. గాడ్జిల్లా ఫ్రాంచైజీలో చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో జపాన్ నుంచి గతేడాది ఈ గాడ్జిల్లా మైనస్ వన్ మూవీ వచ్చింది. ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకొని భారీ కలెక్షన్లు రాబట్టింది.

గాడ్జిల్లా మైనస్ వన్ కలెక్షన్లు

గాడ్జిల్లా మైనస్ వన్ మూవీకి సుమారు 12 మిలియన్ డాలర్ల బడ్జెట్ అయింది. అయితే, ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఈ మూవీకి వసూళ్ల వర్షం కురిసింది. దీంతో ఈ చిత్రానికి సుమారు 115.8 మిలియన్ డాలర్ల కలెక్షన్లు దక్కాయి. బడ్జెట్ కంటే సుమారు పది రెట్లు వసూళ్లను సొంతం చేసుకుంది. 2023లో విడుదలైన బెస్ట్ జపనీస్ మూవీ అంటూ కూడా ప్రశంసలు దక్కించుకుంది.

గాడ్జిల్లా మైనస్ వన్ మూవీకి తకాషి యమజాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్‍ప్లే, డైరెక్షన్‍కు భారీగా ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రానికి తకాషి విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా చేసుకున్నారు. నొవాకీ సాటో సంగీతం అందించారు. టెక్నికల్‍గా ఈ మూవీకి అన్ని అంశాల్లో సూపర్ రెస్పాన్స్ దక్కింది.

గాడ్జిల్లా మైనస్ వన్ చిత్రానికి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ ఏడాది ఆస్కార్ అవార్డు దక్కింది. దీంతో ఈ మూవీ క్రేజ్ మరో స్థాయికి వెళ్లింది. వివిధ దేశాల్లో థియేటర్లలో రన్ మరింత పెరిగింది. అయితే, ఇండియాలో మాత్రం నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకే వచ్చేసింది.

గాడ్జిల్లా మైనస్ వన్ చిత్రం రెండో ప్రపంచ యుద్ధం కాలమైన 1945 బ్యాక్‍డ్రాప్‍లో పీరియడ్ డ్రామాగా రూపొందింది. అణు బాంబుల ధాటికి హిరోషిమా, నాగసాకి ధ్వంసమైన నాటి కాలం బ్యాక్‍డ్రాప్‍లో ఫిక్షనల్ స్టోరీతో ఈ గాడ్జిల్లా చిత్రం వచ్చింది. ఇంట్రెస్టింగ్స్ స్టోరీ, కళ్లు చెరిగే గ్రాఫిక్స్‌ ఈ మూవీలో మెప్పించాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ మూవీని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయవచ్చు.