Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ-shaitaan movie tops in india trending in netflix ott platform and laapataa ladies in second ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Ott Top Movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

Chatakonda Krishna Prakash HT Telugu
May 07, 2024 05:19 PM IST

Netflix OTT Trending: షైతాన్ సినిమా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయిన ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్‍లోనూ సత్తాచాటుతోంది. టాప్‍లో ట్రెండ్ అవుతోంది.

Netflix OTT: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ డ్రామా
Netflix OTT: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ డ్రామా

shaitan movie: అజయ్ దేవ్‍గణ్ ప్రధాన పాత్ర పోషించిన సైతాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మోతమోగించింది. ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీలో జ్యోతిక, ఆర్.మాధవన్, జానకీ బోడీవాలా కూడా ప్రధాన పాత్రలు చేశారు. థియేటర్లలో మార్చి 8న రిలీజైన ఈ మూవీ మంచి వసూళ్లు దక్కించుకుంది. లాంగ్ రన్ సాధించి ఏకంగా రూ.210కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ షైతాన్ దుమ్మురేపుతోంది.

ట్రెండింగ్‍లో టాప్‍ ప్లేస్‍కు..

షైతాన్ సినిమా మే 4వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీలో స్ట్రీమ్ అవుతోంది. అయితే, ఈ చిత్రంపై మంచి బజ్ ఉండటంతో ఆరంభం నుంచి భారీ వ్యూస్ దక్కించుకుంది. దీంతో ట్రెండింగ్‍లోకి దూసుకొచ్చింది.

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్రస్తుతం (మే 7) షైతాన్ మూవీ ట్రెండింగ్‍లో టాప్‍కు ‍వచ్చేసింది. స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన మూడు రోజుల్లో నెట్‍ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్‍కు చేరుకుంది. మరికొంత కాలం ఈ మూవీ జోరు కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది.

షైతాన్ చిత్రానికి వికాక్ బహ్ల్ దర్శకత్వం వహించారు. గుజరాతీ మూవీ ‘వర్ష్’కు రీమేక్‍గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. షైతాన్ చిత్రంలో అజయ్ దేవ్‍గణ్, మాధవన్, జ్యోతికతో పాటు జానకీ బోడీవాలా పర్ఫార్మెన్స్‌పై కూడా ప్రశంసలు వచ్చాయి. ఉత్కంఠతో ఈ మూవీ ఆద్యంతం కట్టిపడేసిందనే టాక్ వచ్చింది.

సుమారు రూ.60కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన షైతాన్ సినిమా సుమారు రూ.211 కోట్లకు కలెక్ట్ చేసి సూపర్ హిట్‍గా నిలిచింది. ఈ చిత్రాన్ని దేవ్‍గణ్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్, పనోరమ స్టూడియోస్ నిర్మించగా.. అమిత్ త్రివేది సంగీతం ఇచ్చారు.

రెండో ప్లేస్‍లో ‘లాపతా లేడీస్’

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ప్రస్తుతం కామెడీ డ్రామా మూవీ లాపతా లేడీస్.. ఇండియా ట్రెండింగ్‍లో రెండో స్థానంలో ఉంది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై సెటైర్ వేస్తూనే ఎంటర్‌టైనింగ్‍గా ఈ మూవీ సాగుతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లాపతా లేడీస్ మూవీ మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజై సక్సెస్ అయింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ 26న స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంపై చాలా మంది ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా ఓటీటీలోనూ ఈ చిత్రం దుమ్మురేపుతోంది. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ రంట, రవికిషన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.

టాప్-5లో టిల్లు స్క్వేర్ కూడా..

యామి గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించిన ఆర్టికల్ 370 సినిమా ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ టాప్-10 సినిమాల జాబితాలో మూడో ప్లేస్‍లో ఉంది. తెలుగు సినిమా ‘టిల్లు స్క్వేర్’ ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో నాలుగో ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం థియేటర్లలో బంపర్ హిట్ అయింది. ఏప్రిల్ 26వ తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ బాషల్లోనూ టిల్లు స్క్వేర్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. ఇక, జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ సినిమా డియర్ ఐదో ప్లేస్‍‍లో ఉంది.

వెబ్ సిరీస్‍ల విషయానికి వస్తే ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఇండియాలో హీరామండి టాప్ ప్లేస్‍లో ట్రెండింగ్‍లో ఉంది. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఈ సిరీస్ తెరకెక్కించారు.