Tillu Square Collections: రూ.100 కోట్ల క్లబ్‍లోకి సిద్ధు.. టిల్లు స్క్వేర్ కలెక్షన్ల మోత.. 9 రోజుల లెక్కలు ఇవే-tillu square day 9 box office collections siddu jonnalagadda joins 100 crores club ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tillu Square Collections: రూ.100 కోట్ల క్లబ్‍లోకి సిద్ధు.. టిల్లు స్క్వేర్ కలెక్షన్ల మోత.. 9 రోజుల లెక్కలు ఇవే

Tillu Square Collections: రూ.100 కోట్ల క్లబ్‍లోకి సిద్ధు.. టిల్లు స్క్వేర్ కలెక్షన్ల మోత.. 9 రోజుల లెక్కలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Published Apr 07, 2024 02:19 PM IST

Tillu Square Day 9 Collections - ₹100 crore: టిల్లు స్క్వేర్ సినిమా ముఖ్యమైన మైల్‍స్టోన్ దాటేసింది. ఈ మూవీతో రూ.100 కోట్ల క్లబ్‍లోకి వచ్చేశాడు సిద్దు జొన్నలగడ్డ. ఆ వివరాలివే..

Tillu Square Collections: రూ.100 కోట్ల క్లబ్‍లోకి సిద్ధు.. టిల్లు స్క్వేర్ కలెక్షన్ల మోత.. 9 రోజుల లెక్కలు ఇవే
Tillu Square Collections: రూ.100 కోట్ల క్లబ్‍లోకి సిద్ధు.. టిల్లు స్క్వేర్ కలెక్షన్ల మోత.. 9 రోజుల లెక్కలు ఇవే

Tillu Square Day 9 Collections: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. అంచనాలకు మించి అదరగొట్టిన ఈ చిత్రం భారీ వసూళ్లను సొంతం చేసుకుంటోంది. మార్చి 29న రిలీజై ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రం ఆరంభం నుంచే కలెక్షన్లలో దూకుడు చూపిస్తోంది. దీంతో అనుకున్న దాని కంటే ముందే రూ.100 కోట్ల మైల్‍స్టోర్‍ను టిల్లు స్క్వేర్ దాటేసింది.

రూ.100 క్లబ్‍లోకి సిద్ధు

టిల్లు స్క్వేర్ సినిమాకు రూ.100 కోట్ల కలెక్షన్లను టార్గెట్‍గా పెట్టుకున్నట్టు నిర్మాత నాగవంశీ ముందుగానే చెప్పారు. అదే నిజమై ఇప్పుడు ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‍లోకి ఎంటర్ అయింది. అయితే, 9 రోజుల్లోనే ఈ చిత్రం ఈ మార్క్ దాటి ఆశ్చర్యపరిచింది. టిల్లు స్క్వేర్ మూవీకి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.101.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.

రెండేళ్ల క్రితం సిద్ధు చెప్పిన మాటతో..

రూ.100 కోట్ల బ్లాక్ బస్టర్ పోస్టర్‌ను టిల్లు స్క్వేర్ మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. తర్వాతి మూడేళ్లలో తాను రూ.100 కోట్ల సినిమా స్టార్ అవ్వాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్టు సిద్ధు జొన్నలగడ్డ 2022లో ఓ మీడియాతో చెప్పిన మాటను పోస్టర్‌లో పేర్కొంది. సిద్దు కల నెరవేరిందనేలా ట్వీట్ చేసింది. “ఎప్పుడూ పెద్దగా కలలు కనండి. దాన్ని సాకారం చేసుకునేందుకు కష్టపడండి. మా స్టార్ బాయ్ సిద్ధు తాను సెట్ చేసుకున్న గోల్‍ను డబుల్ స్పీడ్‍లో నిజం చేసుకున్నారు. డబుల్ బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ సినిమా రూ.100 కోట్లను 9 రోజుల్లోనే దాటేసింది” అని సితార ఎంటర్‌టైన్‍మెంట్ పోస్ట్ చేసింది.

సిద్ధు వన్‍మ్యాన్ షో

టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ వన్‍మ్యాన్ షోతో అదరగొట్టారు. తన మార్క్ డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్, యాక్టింగ్‍తో దుమ్మురేపారు. ఈ చిత్రానికి సిద్ధు రాసుకున్న డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. డీజే టిల్లుకు సీక్వెల్‍గా భారీ అంచనాలతో వచ్చిన టిల్లు స్క్వేర్ అంతకు మించి ప్రేక్షకులను అలరిస్తోంది. 

టిల్లు స్క్వేర్ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సీక్వెల్ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‍గా నటించారు. ఈ మూవీకి అనుపమ కూడా బాగా ప్లస్ అయ్యారు. ఈ మూవీకి రామ్ మిర్యాల, అచ్చు రాజమణి పాటలతో పాటు భీమ్స్ సిసిరోలియో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయాయి. మొత్తంగా టిల్లు స్క్వేర్ మూవీ ఓవరాల్‍గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

టిల్లు స్క్వేర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రంలో నేహా శెట్టి కూడా క్యామియో రోల్‍లో కనిపించారు. మురళీధర్ గౌడ్, ప్రిన్స్ సెసిల్, మురళీ శర్మ, ప్రణీత్ రెడ్డి కీరోల్స్ చేశారు.

టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ ఏప్రిల్ 8వ తేదీన జరగనుంది. ఈ ఈవెంట్‍కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

Whats_app_banner