Oscars 2024 Winners: ఆస్కార్స్‌లో దుమ్ము రేపిన ఓపెన్‌హైమర్.. బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ సహా 7 అవార్డులు
Oscars 2024 Winners: ఆస్కార్స్ 2024లో దుమ్ము రేపింది హాలీవుడ్ బయోపిక్ ఓపెన్‌హైమర్. బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ సహా మొత్తంగా 7 అవార్డులు గెలుచుకుంది. మొత్తంగా 13 నామినేషన్లలో ఏడింట్లో విజేతగా నిలిచింది.
Oscars 2024 Winners: ఆస్కార్స్ 2024లో ఊహించినట్లే ఓపెన్‌హైమర్ మూవీ హవా కొనసాగింది. ఆ సినిమాకు కీలకమైన కేటగిరీల్లో మొత్తంగా అవార్డులు రావడం విశేషం. ఈ సినిమా డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్, లీడ్ యాక్టర్ సిలియన్ మర్ఫీ తొలిసారి ఆస్కార్స్ గెలిచారు.
జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 96వ అకాడెమీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం (మార్చి 10) రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుఝామున) లాస్ ఏంజిల్స్ లో జరిగింది. క్రిస్టోఫర్ నోలన్ బయోపిక్ డ్రామా ఓపెన్‌హైమర్ ఉత్తమ చిత్రంతో పాటు ఏడు ఆస్కార్ లను గెలుచుకుంది.
ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో అవార్డులు దక్కాయి. సిలియన్ మర్ఫీ నేతృత్వంలోని ఈ డ్రామా 13 నామినేషన్లతో టాప్ లో ఉండగా.. ఏడు కేటగిరీల్లో విజేతగా నిలిచింది. బార్బీ, పూర్ థింగ్స్, ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వంటి సినిమాలకూ అవార్డులు దక్కాయి.
ఆస్కార్స్ 2024 విజేతలు
ఉత్తమ చిత్రం
ఓపెన్‌హైమర్
ఉత్తమ నటుడు
సిలియన్ మర్ఫీ, “ఒపెన్హైమర్”
ఉత్తమ నటి
ఎమ్మా స్టోన్, “పూర్ థింగ్స్”
ఉత్తమ దర్శకుడు
క్రిస్టోఫర్ నోలన్, “ఒపెన్ హైమర్”
ఉత్తమ సహాయ నటుడు
రాబర్ట్ డౌనీ జూనియర్, “ఓపెన్హైమర్”
ఉత్తమ సహాయ నటి
డావిన్ జాయ్ రాండోల్ఫ్, “ది హోల్డోవర్స్”
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే
“అమెరికన్ ఫిక్షన్”
ఒరిజినల్ స్క్రీన్ ప్లే
“అనాటమీ ఆఫ్ ఎ ఫాల్”
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్
“ది బాయ్ అండ్ ది హెరాన్”
యానిమేటెడ్ షార్ట్
వార్ ఈజ్ ఓవర్! ఇన్‌స్పైర్డ్ బై ద మ్యూజిక్ ఆఫ్ జాన్ అండ్ యోకో
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం
"ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్", యునైటెడ్ కింగ్ డమ్
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్
20 డేస్ ఇన్ మరియుపోల్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్
ది లాస్ట్ రిపేర్ షాప్
ది బెస్ట్ ఒరిజినల్ స్కోర్
ఓపెన్‌హైమర్
ఉత్తమ ఒరిజినల్ సాంగ్
“బార్బీ”
బెస్ట్ సౌండ్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్
పూర్ థింగ్స్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్
ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
ఉత్తమ సినిమాటోగ్రఫీ
ఓపెన్‌హైమర్
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్
పూర్ థింగ్స్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్
పూర్ థింగ్స్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్
గాడ్జిల్లా మైనస్ వన్
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్
ఓపెన్‌హైమర్
ఆస్కార్స్ 2024 హైలైట్స్
- ఈ ఏడాది ఆస్కార్స్ లో ఇండియాకు నిరాశే ఎదురైంది. బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో నామినేట్ అయిన టు కిల్ ఎ టైగర్ అవార్డు దక్కలేదు.
- ఇక ఆస్కార్స్ 2024లో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు ఇవ్వడానికి వచ్చి డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా ఒంటిపై నూలిపోగు లేకుండా రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతడు తర్వాత స్టేజ్ పైనే డ్రెస్ వేసుకున్నాడు.
- ఆస్కార్స్ 2024లో మరోసారి ఆర్ఆర్ఆర్ మెరిసింది. గతేడాది బెస్ట్ ఒరిజినల్ స్కోరు కేటగిరీలో అవార్డు అందుకున్న ఈ మూవీ.. ఈసారి స్టంట్స్ కోఆర్డినేటర్ల కోసం ప్లే చేసిన ట్రిబ్యూట్ వీడియోలో చోటు దక్కించుకుంది.
టాపిక్