Oppenheimer: డైరెక్టర్‌కి 595 కోట్ల రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకే కల్కి బడ్జెటంతా! ఆ దర్శకుడు ఎవరంటే?-christopher nolan remuneration for oppenheimer stuns industry approximately kalki 2898 ad budget ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Christopher Nolan Remuneration For Oppenheimer Stuns Industry Approximately Kalki 2898 Ad Budget

Oppenheimer: డైరెక్టర్‌కి 595 కోట్ల రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకే కల్కి బడ్జెటంతా! ఆ దర్శకుడు ఎవరంటే?

Sanjiv Kumar HT Telugu
Mar 09, 2024 11:24 AM IST

Christopher Nolan Remuneration Oppenheimer: ఓపెన్‌ హైమర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్‌కు ఆ సినిమాకు గాను వందల కోట్ల పారితోషికం అందుకున్నట్లు హాలీవుడ్ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. 96వ అకాడమీ అవార్డ్స్‌లో ఏకంగా 13 విభాగాల్లో నామినేన్స్ పొంది రికార్డ్ క్రియేట్ చేసిందీ ఓపెన్‌ హైమర్ మూవీ.

డైరెక్టర్‌కి 595 కోట్ల రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకే కల్కి బడ్జెటంతా! ఆ దర్శకుడు ఎవరంటే?
డైరెక్టర్‌కి 595 కోట్ల రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకే కల్కి బడ్జెటంతా! ఆ దర్శకుడు ఎవరంటే?

Christopher Nolan Remuneration: ఆస్కార్ 2024 అవార్డ్స్‌లో (Academy Awards 2024) ఓపెన్‌‌హైమర్ మూవీ ఏకంగా 13 నామినేషన్లతో సినీ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించింది. బెస్ట్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ పిక్చ‌ర్‌, బెస్ట్ యాక్ట‌ర్‌, బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌తో పాటు ప‌లు విభాగాల్లో నామినేష‌న్స్ ద‌క్కించుకున్న ఓపెన్ హైమర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

సుమారు 100 మిలియ‌న్ డాల‌ర్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కిన ఓపెన్‌ హైమ‌ర్ మూవీ 900 మిలియ‌న్ల డాల‌ర్ల క‌లెక్ష‌న్స్ కొల్లగొట్టింది. అంతేకాకుండా నిర్మాత‌ల‌కు తొమ్మిదో వంతు లాభాల‌ను మిగిల్చింది. 2023లో హాలీవుడ్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూడో సినిమాకు ఓపెన్ హైమర్ రికార్డ్ నెల‌కొల్పింది. వ‌ర‌ల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా మరో చరిత్ర సృష్టించింది. ఇంతటి ఘన విజయం సాధించిన ఓపెన్ హైమర్ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించారు.

ఓపెన్ హైమర్ సినిమా కోసం క్రిస్టోఫర్ నోలన్ అందుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. మాట్ క్రెయిగ్ ప్రకారం సినిమాను నిర్నించిన వార్నర్ బ్రోస్ యూనివర్సల్‌తో ఓపెన్ హైమర్ సినిమాకు వచ్చిన గ్రాస్ కలెక్షన్స్‌లో 15 శాతం వసూళ్లను పారితోషికం కింద తీసుకునేందుకు క్రిస్టోఫర్ నోలన్ ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఈ లెక్కన ఓపెన్ హైమర్ సినిమాకు క్రిస్టోఫర్ నోలన్‌కు దాదాపు 72 మిలియన్ డాలర్స్ రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం.

అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 595 కోట్లు. ఇది ఒక దర్శకుడికి చెల్లించిన మొత్తాల్లోనే అత్యధికం అని హాలీవుడ్ మీడియా అంటోంది. బాక్సాఫీస్ వసూళ్లు మాత్రమే కాకుండా హోమ్ వీడియో అమ్మకాలు, సినిమా మొదటి స్ట్రీమింగ్ విండో లైసెన్స్, నోలన్ తన ఏజెంట్, న్యాయవాదికి చెల్లించిన ఫీజు, ప్రీ-టాక్స్ వంటివి అన్ని లెక్క వేస్తే సుమారుగా డైరెక్టర్ రెమ్యునరేషన్ 85 మిలియన్ డాలర్ల గ్రాస్ అని తెలుస్తోంది. ఇందులోని అన్ని పోను చివరికి 72 మిలియన్ డాలర్స్ నోలన్ చేతిలో ఉంటాయన్నది సారాంశం.

ఇలా చూస్తే క్రిస్టోఫర్ నోలన్ ఒక్క సినిమా పారితోషికం చూస్తే దాదాపుగా ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం కల్కి 2898 ఏడీ బడ్జెట్ అంతా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. కల్కి బడ్జెట్ సుమారుగా రూ. 600 కోట్లు అని ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ లెక్కన క్రిస్టోఫర్‌కు మిగిలిందే రూ. 595 కోట్లు. ఐదు కోట్ల తేడాతో కల్కి బడ్జెట్ అంతా రెమ్యునరేషన్ అందుకున్నారు స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. ప్రస్తుతం ఈ న్యూస్ సినీ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే ఓపెన్ హైమర్ మూవీ యూనివర్సల్ పీకాక్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్‌లో ఫిబ్రవరి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అదనంగా, ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, వీఓడీ వేదికల్లో అద్దె లేదా కొనుగోలు పద్ధతిలో అందుబాటులో ఉంది. ఈ చిత్రం డీవీడీలు సైతం అమ్మకానికి ఉన్నాయి. డీవీడీ 16 డాలర్లు (అసలు ధర 35 డాలర్లు), బ్లూ-రే 18 డాలర్స్ (అసలు ధర 40 డాలర్స్), 4 కె అల్ట్రా హెచ్‌డీ బ్లూ-రే 25 డాలర్స్ (అసలు ధర 50 డాలర్స్)తో 57% డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి.

ఇక ఓపెన్ హైమర్ సినిమా ఇండియాలో ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయేత ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులు మాత్రమే ఓపెన్ హైమర్‌ను చూడగలరు. ఇంగ్లీషుతో పాటు దక్షిణాది భాషల్లో సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు.

WhatsApp channel