RRR in Oscars 2024: ఆర్ఆర్ఆర్ మళ్లీ మెరిసింది.. ఆస్కార్స్ వేదికపై రాజమౌళి, తారక్, రామ్ చరణ్ మూవీ-rrr again on oscars 2024 stage rajamouli jr ntr ram charan movie stunts shown on 96th academy awards stage ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr In Oscars 2024: ఆర్ఆర్ఆర్ మళ్లీ మెరిసింది.. ఆస్కార్స్ వేదికపై రాజమౌళి, తారక్, రామ్ చరణ్ మూవీ

RRR in Oscars 2024: ఆర్ఆర్ఆర్ మళ్లీ మెరిసింది.. ఆస్కార్స్ వేదికపై రాజమౌళి, తారక్, రామ్ చరణ్ మూవీ

Hari Prasad S HT Telugu
Mar 11, 2024 08:08 AM IST

RRR in Oscars 2024: ఆస్కార్స్ వేదికపై మన ఆర్ఆర్ఆర్ మూవీ మరోసారి మెరిసింది. రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ మూవీలోని స్టంట్స్ వీడియో ఒకటి వేదికపై ప్లే చేశారు.

ఆర్ఆర్ఆర్ మళ్లీ మెరిసింది.. ఆస్కార్స్ వేదికపై రాజమౌళి, తారక్, రామ్ చరణ్ మూవీ
ఆర్ఆర్ఆర్ మళ్లీ మెరిసింది.. ఆస్కార్స్ వేదికపై రాజమౌళి, తారక్, రామ్ చరణ్ మూవీ

RRR in Oscars 2024: ఆస్కార్స్ లో గతేడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలిచిన విషయం తెలుసు కదా. అయితే ఈసారి కూడా ఆర్ఆర్ఆర్ మూవీ మరోసారి వేదికపై మెరిసింది. 96వ అకాడెమీ అవార్డుల వేదికపై ఈ సినిమాకు సంబంధించిన ఓ స్టంట్స్ వీడియోను ప్లే చేయడం అభిమానులను థ్రిల్ కు గురి చేసింది.

ఆస్కార్స్ వేదికపై ఆర్ఆర్ఆర్

గతేడాది ఆస్కార్స్ వేడుక సమయానికి ఇండియాలో అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. ముందు రోజు రాత్రి నుంచీ అవార్డు సెర్మనీ లైవ్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఆస్కార్స్ రెడ్ కార్పెట్ పై మన స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణిలాంటి వాళ్లు మెరిశారు. చివరిగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట అవార్డు గెలవడంతో తెలుగువారితోపాటు మొత్తం దేశమంతా గర్వంతో ఉప్పొంగిపోయింది.

అయితే ఇది జరిగి ఏడాది గడిచింది. ఇప్పుడు ఆస్కార్స్ 2024 వేడుకలో ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఎలాంటి హడావిడి లేదు. అయితే వేదికపై ప్రదర్శించిన ఓ వీడియోలో సడెన్ ఈ మూవీలోని సీన్స్ కనిపించడంతో అభిమానులకు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్, చరణ్ కలిసి చేసిన స్టంట్స్ వీడియోను ఆస్కార్స్ వేదికపై ప్లే చేశారు.

ఆర్ఆర్ఆర్ స్టంట్స్‌కు ఆస్కార్స్ ఫిదా

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న డాల్బీ థియేటర్ లో ఆస్కార్స్ 2024 వేడుక జరిగింది. ఇందులో ఆస్కార్స్ కు నామినేట్ అయిన నటీనటులు రియాన్ గోస్లింగ్, ఎమిలీ బ్లంట్.. ప్రపంచవ్యాప్తంగా సినిమాల్లో పని చేసే స్టంట్ కోఆర్డినేటర్ల కృషిని గుర్తు చేసుకుంటూ ఓ వీడియో ప్లే చేశారు. ఇందులో ఎన్నో హాలీవుడ్ సినిమాలతోపాటు మన ఆర్ఆర్ఆర్ మూవీలోని స్టంట్స్ కూడా ఉన్నాయి.

క్లైమ్యాక్స్ ఫైట్ లో రామ్ చరణ్ ను తన భుజాలపైకి ఎక్కించుకొని తారక్ చేసే ఫైట్, ఆ తర్వాత మంటల్లో నుంచి ఈ ఇద్దరూ బయటకు దూసుకొచ్చే సీన్ ఈ స్టంట్స్ వీడియోలో చోటు దక్కించుకుంది. ఇది చూసి ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఎంతో మంది అభిమానులు తమ ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

"ఆస్కార్స్ లో ఆర్ఆర్ఆర్ క్లిప్ చూపించారు", "ఓ మై గాడ్, ఓ మై గాడ్.. ఆర్ఆర్ఆర్ లోని పిగ్గీబ్యాక్ ఫైట్ సీన్ ను ఆస్కార్స్ లో చూపించారు" అంటూ అభిమానులు ఈ వీడియోను షేర్ చేశారు. నిజానికి గతేడాది హాలీవుడ్ లో జరిగిన ప్రతి ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలో ఆర్ఆర్ఆర్ సందడి కనిపించింది. గోల్డెన్ గ్లోబ్స్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు, ఆస్కార్స్ లో ఈ మూవీ అవార్డులు గెలుచుకుంది.

గతేడాది ఆస్కార్స్ వేదికపై నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చేయడం విశేషం. సినిమాలో ఈ పాట పాడిన కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్స్ స్టేజ్ పై లైవ్ ఇచ్చారు. బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఈ లైవ్ పర్ఫార్మెన్స్ ప్రజెంటర్ గా పాట గురించి కొన్ని గొప్ప మాటలు కూడా చెప్పింది.