Manamey Movie: సినిమా అంతా తిట్టుకుంటూనే ఉంటాం.. హిట్ పక్కా: శర్వానంద్.. 'మనమే'లో ఏకంగా 16 పాటలు-manamey movie also like murari and kushi says sharwanand and the film has 16 songs ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manamey Movie: సినిమా అంతా తిట్టుకుంటూనే ఉంటాం.. హిట్ పక్కా: శర్వానంద్.. 'మనమే'లో ఏకంగా 16 పాటలు

Manamey Movie: సినిమా అంతా తిట్టుకుంటూనే ఉంటాం.. హిట్ పక్కా: శర్వానంద్.. 'మనమే'లో ఏకంగా 16 పాటలు

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 01, 2024 04:04 PM IST

Manamey Movie - Sharwanand: మనమే సినిమా హిట్ అవుతుందని చాలా నమ్మకంగా ఉన్నట్టు హీరో శర్వానంద్ చెప్పారు. ప్రేక్షకులకు మంచి ఫీలింగ్‍ను ఈ చిత్రం కల్పిస్తుందన్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో ఈ విషయాలు చెప్పారు.

Sharwanand: మురారి, ఖుషిల్లా ఈ సినిమాలో..: మనమే గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన శర్వానంద్
Sharwanand: మురారి, ఖుషిల్లా ఈ సినిమాలో..: మనమే గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన శర్వానంద్

Manamey Movie: శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మనమే మూవీకి మంచి క్రేజ్ ఉంది. టీజర్, పాటలు ఆకట్టుకోవడంతో ఈ మూవీపై క్యూరియాసిటీ పెరిగింది. ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్ నేడు (జూన్ 1) రిలీజ్ అయింది. ట్రైలర్ లాంచ్ కోసం మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. దీంట్లో హీరో శర్వానంద్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

కథ కొత్తతేమీ కాదు.. కానీ

మనమే సినిమా కథ కొత్తగా ఉందని తాను చెప్పనని, కానీ కచ్చితంగా అందరికీ మంచి ఫీల్ ఇస్తుందని శర్వానంద్ చెప్పారు. ఇంత మంచి సినిమా చూసి ఎంతకాలమైందని ప్రేక్షకులు అనుకుంటారని అన్నారు. మూవీ ఫలితాన్ని తాను బాధ్యతగా తీసుకుంటానని శర్వానంద్ తెలిపారు.

మురారి, ఖుషి చిత్రాల్లా..

మనమే మూవీలో తాను, హీరోయిన్ కృతి శెట్టి తిట్టుకుంటూనే ఉంటామని శర్వానంద్ చెప్పారు. మహేశ్ బాబు ‘మురారి’, పవన్ కల్యాణ్ ‘ఖుషి’లతో పాటు హీరోహీరోయిన్ తిట్టుకునే సినిమాలు బ్లాక్‍బస్టర్ అయ్యాయని అన్నారు. “నేను, కృతి శెట్టి సినిమా అంతా తిట్టుకుంటూనే ఉంటాం. మురారి చూడండి.. ఖుషి చూడండి హీరోహీరోయిన్ తిట్టుకుంటూ ఉంటే సినిమా బ్లాక్‍బస్టర్” అని శర్వానంద్ చెప్పారు. మొత్తంగా.. మురారి, ఖుషి చిత్రాల్లా మనమే మూవీలోనూ తాను, కృతి తిట్టుకుంటూనే ఉంటామని శర్వా అన్నారు.

ఇక నుంచి బాగున్నా, బాగోలేకపోయినా తన సినిమాలకు తానే బాధ్యత తీసుకుంటానని శర్వానంద్ అన్నారు. ఈసారి హిట్ కొట్టాల్సిందేనని, అందరినీ ఇబ్బంది పెట్టి గొడవలతో ఈ చిత్రం చేశామని శర్వా తెలిపారు. సినిమా బాగారావాలనే ఇదంతా చేశామని శర్వానంద్ అన్నారు. ప్రేక్షకులు కొనే టికెట్‍కు జవాబుదారితనంగా ఉండాలని, ఒళ్లు జాగ్రత్త పెట్టుకొని కష్టపడి మనమే మూవీ చేశామని చెప్పారు.

16 పాటలు

మనమే సినిమాలో 16 పాటలు ఉంటాయని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చెప్పారు. మ్యూజికల్‍గా ఈ చిత్రం అద్భుతంగా ఉంటుందని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ చిత్రానికి ఆత్మలాంటి వాడని తెలిపారు. మొత్తంగా ఫుల్ సాంగ్స్, బిట్ కలిపి ఈ చిత్రంలో 16 పాటలు ఉండనున్నాయి.

మనమే మూవీలో శర్వానంద్, కృతి శెట్టి జోడీగా నటించగా.. పిల్లాడి పాత్రలో చేశారు విక్రమ్ ఆదిత్య, మనమే ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. రిలేషన్‍షిప్ ఫీల్ గుడ్ డ్రామాగా ఉండనుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో సీరత్ కపర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిశోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలు పోషించారు.

మనమే సినిమా జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీవీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మించగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా ఉన్నారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. గతేడాతి హాయ్ నాన్నతో ఆకట్టుకున్న హేషమ్.. మనమేతో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్, విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్లుగా చేయగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024