Sharwanand: తండ్రి అయిన శర్వానంద్.. బర్త్‌డే రోజున శుభవార్త షేర్ చేసిన హీరో-tollywood actor sharwanand and rakshitha reddy welcomes baby girl and names her as leela devi myneni ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tollywood Actor Sharwanand And Rakshitha Reddy Welcomes Baby Girl And Names Her As Leela Devi Myneni

Sharwanand: తండ్రి అయిన శర్వానంద్.. బర్త్‌డే రోజున శుభవార్త షేర్ చేసిన హీరో

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 06, 2024 08:27 PM IST

Sharwanand: టాలీవుడ్ హీరో శర్వానంద్ తండ్రి అయ్యారు. తన పుట్టిన రోజున ప్రపంచానికి ఈ గుడ్‍న్యూస్ వెల్లడించారు. తమ కూతురి పేరును కూడా శర్వా వెల్లడించారు.

Sharwanand: తండ్రి అయిన శర్వానంద్.. బర్త్‌డే రోజున శుభవార్త షేర్ చేసిన హీరో
Sharwanand: తండ్రి అయిన శర్వానంద్.. బర్త్‌డే రోజున శుభవార్త షేర్ చేసిన హీరో

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ శుభవార్త చెప్పారు. ఆయన తండ్రి అయ్యారు. శర్వా భార్య రక్షితా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తన పుట్టిన రోజైన నేడు (మార్చి 6) ఈ గుడ్‍న్యూస్ ప్రపంచానికి తెలియజేశారు శర్వానంద్. తన గారాల కూతురి పేరును కూడా వెల్లడించారు.

తన కుమార్తెకు ‘లీలా దేవీ మైనేని’ అని పేరు పెట్టారు శర్వానంద్, రక్షితా రెడ్డి. ఈ విషయాన్ని నేడు సోషల్ మీడియా వేదికగా శర్వా వెల్లడించారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ విషయాన్ని తెలిపారు.

తన కూతురితో ఉన్న ఫొటోలను కూడా శర్వానంద్ షేర్ చేశారు. “ప్రేమ, శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. బెస్ట్ న్యూస్‍ను చెప్పాలని దాచుకున్నా. అత్యంత ముఖ్యమైన అతిపెద్ద నేను కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నా” అని శర్వానంద్ ట్వీట్ చేశారు. తన కూతురికి లీలా దేవి మైనేని అని పేరు పెట్టినట్టు మరో పోస్ట్ చేశారు.

తన చిన్నారి కూతురు తన వేలిని పట్టుకున్న ఫొటోను కూడా శర్వానంద్ షేర్ చేశారు. అయితే, కూతురు ఏ రోజు జన్మించారో కచ్చితంగా శర్వానంద్ చెప్పలేదు. తన పుట్టిన రోజు సందర్భంగా నేడు ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు. శర్వా, రక్షితకు సోషల్ మీడియాలో చాలా మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

శర్వానంద్ పెళ్లి

శర్వానంద్, రక్షితా రెడ్డి వివాహం 2023 జూన్ తేదీన ఘనంగా జరిగింది. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‍లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్, సిద్ధార్థ్ సహా కొందరు సెలెబ్రిటీలు వీరి వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్‍లో వీరి వివాహ రిసెప్షన్‍ కూడా గ్రాండ్‍గా జరిగింది.

ఒకే రోజు మూడు సినిమాల అనౌన్స్‌మెంట్స్

శర్వానంద్ పుట్టిన రోజు కావడంతో అతడు హీరోగా ఏకంగా నేడు మూడు సినిమాలు అనౌన్స్ అయ్యాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వా హీరోగా నటిస్తున్న సినిమా (Sharwa 35) టైటిల్ నేడు వెల్లడైంది. ఈ చిత్రానికి ‘మనమే’ టైటిల్ ఖరారైంది. టైటిల్ అనౌన్స్‌నెంట్ వీడియో అట్రాక్టివ్‍గా ఉంది. మనమే మూవీలో శర్వా సరసన కృతి శెట్టి హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో శర్వానంద్ మరో చిత్రానికి (Sharwa 36) ఓకే చెప్పారు. ఈ మూవీ బైక్ రేసర్‌గా ఆయన నటించనున్నారు. ఈ మూవీ అనౌన్స్‌నెంట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. లూజర్ వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ కంకర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వంశీ, ప్రమోద్ ఈ మూవీని నిర్మించనున్నారు. బైక్ రేసింగ్ స్పోర్ట్స్ బ్యాక్‍డ్రాప్‍లో థ్రిల్లర్‌గా ఈ మూవీ రానుందని తెలుస్తోంది. ఈ మూవీకి జిబ్రాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి జే.యువరాజ్ సినిమాటోగ్రఫీ చేయనున్నారు.

సామజవరగమన ఫేమ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ మరో సినిమా (Sharwa 37) చేయనున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రానుంది. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకం నిర్మించనున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నారు.

WhatsApp channel