Sharwanand Marriage: ఘనంగా శర్వానంద్ పెళ్లి వేడుకలు.. పూనకాలు లోడింగ్ పాటకు శర్వా స్టెప్పులు: రామ్‍చరణ్ హాజరు-groom sharwanand dances poonakalu loading song ramchan attends marriage ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sharwanand Marriage: ఘనంగా శర్వానంద్ పెళ్లి వేడుకలు.. పూనకాలు లోడింగ్ పాటకు శర్వా స్టెప్పులు: రామ్‍చరణ్ హాజరు

Sharwanand Marriage: ఘనంగా శర్వానంద్ పెళ్లి వేడుకలు.. పూనకాలు లోడింగ్ పాటకు శర్వా స్టెప్పులు: రామ్‍చరణ్ హాజరు

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత్‍లో పూనకాలు లోడింగ్ పాటకు డ్యాన్స్ చేశాడు శర్వా.

శర్వానంద్ పెళ్లి వేడుకల ఫొటో (Photo: Instagram/sharwanand.fans)

Sharwanand Marriage: యువ హీరో శర్వానంద్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజస్థాన్‍లోని జైపూర్‌లో ఉన్న లీలా ప్యాలెస్ వేదికగా నేటి (జూన్ 3) రాత్రి పెళ్లి కానుంది. రక్షితా రెడ్డిని శర్వా వివాహం చేసుకుంటున్నాడు. కాగా, శుక్రవారమే హల్దీ, సంగీత్ సహా మరిన్ని కార్యక్రమాలు జరిగాయి. సంగీత్ ప్రొగ్రామ్‍లో శర్వానంద్ స్టెప్పులతో అదరగొట్టాడు. వాల్తేరు వీరయ్య సినిమాలోని పూనకాలు లోడింగ్ పాటకు చిందేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఫొటోలు కూడా క్రమంగా బయటికి వస్తున్నాయి. కాగా, శర్వా వెళ్లి వివాహ వేడుకలకు అతడి క్లోజ్ ఫ్రెండ్, పాన్ ఇండియా హీరో రామ్‍చరణ్ హాజరయ్యాడు.

సంగీత్‍లో భాగంగా పూనకాలు లోడింగ్ పాటకు శర్వానంద్ డ్యాన్స్ చేశాడు. స్టేజీపై కొందరు అమ్మాయిల గ్రూప్ డ్యాన్స్ చేస్తుండగా.. శర్వా జాయిన్ అయ్యాడు. చాలా జోష్‍తో చిందేశాడు. అతడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు వేడుకంతా చప్పట్లో, ఈలలతో మార్మోగిపోయింది.

శర్వానంద్ పెళ్లి కోసం లీలా ప్యాలెస్‍ వైభవంగా ముస్తాబైంది. సంగీత్ ఫంక్షన్‍కు హాజరైన హీరో రామ్‍చరణ్.. వధూవరులతో కలిసి ఫొటోలు దిగారు. ఇరు కుటుంబాలను, అక్కడికి వచ్చిన వారిని పలుకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

శర్వానంద్ వివాహానికి సినీ ప్రముఖులు భారీగా హాజరవుతున్నారని తెలుస్తోంది. అలాగే కొందరు రాజకీయ నేతలు కూడా రానున్నారు.

ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు శర్వానంద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ప్రస్తుతం పెళ్లి సందర్భంగా కొన్ని రోజులుగా బ్రేక్ తీసుకున్నారు శర్వా. ఇది శర్వానంద్ 35వ సినిమాగా ఉంది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం గతేడాది మంచి విజయాన్ని అందుకుంది.