Manamey: శర్వానంద్, కృతి శెట్టి జోడీగా మనమే.. ప్లే బాయ్‌గా హీరో.. లండన్‌లో సరికొత్త కథతో మూవీ-sharwanand krithi shetty manamey teaser released and trending with 2 million views ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manamey: శర్వానంద్, కృతి శెట్టి జోడీగా మనమే.. ప్లే బాయ్‌గా హీరో.. లండన్‌లో సరికొత్త కథతో మూవీ

Manamey: శర్వానంద్, కృతి శెట్టి జోడీగా మనమే.. ప్లే బాయ్‌గా హీరో.. లండన్‌లో సరికొత్త కథతో మూవీ

Sanjiv Kumar HT Telugu
Apr 20, 2024 01:05 PM IST

Sharwanand Krithi Shetty Manamey Teaser: యంగ్ హీరో శర్వానంద్, బ్యూటిఫుల్ కృతి శెట్టి జంటగా నటించిన సినిమా మనమే. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన మనమే టీజర్ విశేషాల్లోకి వెళితే..

శర్వానంద్, కృతి శెట్టి జోడీగా మనమే.. ప్లే బాయ్‌గా హీరో.. లండన్‌లో సరికొత్త కథతో మూవీ
శర్వానంద్, కృతి శెట్టి జోడీగా మనమే.. ప్లే బాయ్‌గా హీరో.. లండన్‌లో సరికొత్త కథతో మూవీ

Sharwanand Krithi Shetty Manamey: ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ల్యాండ్‌మార్క్ 35వ చిత్రం 'మనమే'. టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ అద్భుతంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, ప్రతి ప్రమోషనల్ మెటిరియల్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఏప్రిల్ 19న మనమే టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.

'మనమే' మెస్మరైజ్ చేసే ప్రపంచంలోకి ఒక స్నీక్ పీక్. ఇది పరస్పరం భిన్నమైన మనస్తత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు, వారి జర్నీలో ఊహించని మలుపులతో సాగే అతిథి కథ. శర్వానంద్ హీరో పాత్రలో అమాయకంగా కనిపిస్తున్నారు. కానీ కనిపిస్తున్నంత ఇన్నోసెంట్ కాదని, చెడ్డవాన్ని అని తానే చెబుతూ టీజర్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

సినిమాలో జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఇష్టపడే ప్లేబాయ్‌గా శర్వానంద్ కనిపించాడు. ఇక కృతి శెట్టి బాధ్యతాయుత అమ్మాయిగా కనిపించింది. పిల్లాడి పాత్రలో విక్రమ్ ఆదిత్య ఎంట్రీతో వారి జీవితాలు తలకిందులు అవుతాయని టీజర్ చూస్తే తెలుస్తోంది. పిల్లాడి రాక వారిని గందరగోళానికి గురిచేస్తుంది.

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య న్యూ ఏజ్ కథతో వచ్చి హ్యూమరస్‌గా ప్రజెంట్ చేశారు. మూడు పాత్రల మధ్య రిలేషన్‌ని బయటపెట్టకుండా టీజర్‌ను స్మార్ట్‌గా కట్ చేశారు. త్వరలో విడుదల కానున్న థియేట్రికల్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశారు మేకర్స్.

సినిమాలో మూడు పాత్రలను అందంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక పిల్లవాడి సాధారణ మనస్తత్వాలను అద్భుతంగా చూపించారు. శర్వానంద్ కూల్‌గా కనిపించాడు. తన పాత్రలో ఆదరగొట్టారు. కృతి శెట్టి అందంగా ఉంది. తన పాత్రలో ఒదిగిపోయింది. కిడ్ విక్రమ్ ఆదిత్య అందరినీ ఆకట్టుకున్నాడు.

విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ కెమెరా పనితనం ప్రత్యేకంగా నిలుస్తుంది. విజువల్స్ వైబ్రెంట్, గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ తన అద్భుతమైన స్కోర్‌తో ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ డిజైన్ టాప్-క్లాస్‌గా ఉంది. అన్నింటిలో రిచ్‌నెస్ ఉంది. టీజర్ మనలోని ఆసక్తిని మరింత పెంచింది.

ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్‌గా చేశారు. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ అందించారు. ఈ హాలిడే సీజన్‌లో 'మనమే' సినిమాకు థియేటర్లలోకి రానుంది. అయితే ఈ టీజర్ యూట్యూబ్‌లో 2 మిలియన్ వ్యూస్‌తో మంచి ఆదరణ పొందుతోంది.

కాబట్టి ఈ వేసవి తమ సినిమాతో చాలా కూల్‌గా ఉండబోతుందని టీజర్‌లో మేకర్స్ తెలిపారు. ఈ హోల్సమ్ ఎంటర్ టైనర్ అన్ని వర్గాలను సమానంగా ఆకర్షిస్తుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ మధ్య కృతీ శెట్టికి సరైన హిట్ పడలేదు. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి.

IPL_Entry_Point