LIVE UPDATES
Andhra Pradesh News Live September 30, 2024: East Coast Trains : ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్-28 స్పెషల్ రైళ్లు, 26 రైళ్లకు అదనపు కోచ్ లు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 30 Sep 202405:20 PM IST
Andhra Pradesh News Live: East Coast Trains : ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్‌న్యూస్-28 స్పెషల్ రైళ్లు, 26 రైళ్లకు అదనపు కోచ్ లు
- East Coast Special Trains : వరుస పండుగల ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఈస్ట్ కోస్ట్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. విశాఖ నుంచి సికింద్రాబాద్, తిరుపతి, అరకు, చెన్నై, షాలిమార్, తిరుపతి, శ్రీకాకుళం, అరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. పలు రైళ్లకు అదనపు కోచ్ లు జోడిస్తున్నారు.
Mon, 30 Sep 202404:13 PM IST
Andhra Pradesh News Live: Rajya Sabha Seats : రాజ్యసభకు పోటాపోటీ, టీడీపీ రెండు, జనసేనకు ఒకటి- బీజేపీకీ లేనట్లే
- Rajya Sabha Seats : వైసీపీ ఎంపీల రాజీనామాలతో రాజ్యసభలో ఏపీకి చెందిన మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ మూడు సీట్లకు కూటమి పార్టీల సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటికే కూటమి పార్టీలు వీటిపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. రెండు టీడీపీ, ఒకటి జనసేన పంచుకున్నట్లు తెలుస్తోంది.
Mon, 30 Sep 202412:48 PM IST
Andhra Pradesh News Live: Graduate Election Voter Registration : పట్టభద్రుల ఓటర్ల నమోదు, అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు అప్లికేషన్ల స్వీకరణ
- Graduate Election Voter Registration : ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు ఈ జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Mon, 30 Sep 202410:58 AM IST
Andhra Pradesh News Live: AP KGBV Posts : కేజీబీవీల్లో 604 పోస్టుల భర్తీ - జిల్లాల వారీగా పోస్టులు, దరఖాస్తు విధానం ఇలా
- AP KGBV Posts : ఏపీ కేజీబీవీల్లో 604 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 14న మెరిట్ జాబితా జనరేట్ అవుతుంది. అక్టోబర్ 17న జిల్లా స్థాయి కమిటీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేస్తారు. అక్టోబర్ 19న తుది జాబితా విడుదల చేస్తారు.
Mon, 30 Sep 202409:44 AM IST
Andhra Pradesh News Live: Road Accident : అల్లూరి జిల్లాలో విషాదం.. కుమార్తెను చూడటానికి వెళ్లిన తండ్రి, లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కిన వ్యక్తి మృతి
- Road Accident : అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుకుంటున్న కుమార్తెను చూడటానికి ద్విచక్ర వాహనంపై వెళ్లిన వ్యక్తి.. లిఫ్ట్ అడిగి అదే వాహనంపై ఎక్కిన మరో వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరో రెండు నిమిషాల్లో గమ్యానికి చేరేలోపే మృత్యువు కబళించింది.
Mon, 30 Sep 202409:01 AM IST
Andhra Pradesh News Live: Devi Navaratrulu : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు రండి.. చంద్రబాబుకు ఆహ్వానం
- Devi Navaratrulu : విజయవాడ దుర్గమ్మ ఆలయం.. నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానించారు. మంత్రి ఆనం, అర్చకులు సీఎంను ఆహ్వానించారు.
Mon, 30 Sep 202408:36 AM IST
Andhra Pradesh News Live: SC On Tirumala Laddu : దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచండి, సీఎం ప్రెస్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి?- సుప్రీంకోర్టు
- SC On Tirumala Laddu : తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదంపై సిట్ విచారణకు ఆదేశిస్తే... ముఖ్యమంత్రి ప్రెస్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని అభిప్రాయపడింది.
Mon, 30 Sep 202408:29 AM IST
Andhra Pradesh News Live: TTD Chiarman: టీటీడీ ఛైర్మన్ పీఠం దక్కెదెవరికి? కొనసాగుతున్న ఉత్కంఠ.. తెరపైకి కొత్తపేర్లు…
- TTD Chiarman: ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి విడత జాబితా వారం రోజుల క్రితం విడుదలైనా కీలకమైన పోస్టుల భర్తీపై మాత్రం క్లారిటీ రావడం లేదు.రాష్ట్రంలో ముఖ్యమైన పదవులు ఎన్ని ఉన్నా అందరి దృష్టి మాత్రం టీటీడీ ఛైర్మన్ నియామకంపైనే ఉంది.
Mon, 30 Sep 202405:23 AM IST
Andhra Pradesh News Live: Dasara Security: నవరాత్రుల నేపథ్యంలో విజయవాడలో ఆలయాల భద్రత కట్టుదిట్టం..
Dasara Security: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా ఆలయాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 4500మంది పోలీసులతో దసరా ఉత్సవాలకు భద్రత కల్పిస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి.
Mon, 30 Sep 202403:57 AM IST
Andhra Pradesh News Live: Guntur : గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు స్పాట్ డెడ్
- Guntur : గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్‌ను ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగ్రాతులను ఆసుపత్రికి తరలించారు.
Mon, 30 Sep 202403:36 AM IST
Andhra Pradesh News Live: Flood Compensation: ఏపీ ప్రభుత్వ వరద పరిహారం అందలేదా! ఇలా తనిఖీ చేసుకోండి, ఏ బ్యాంకులో జమ చేశారో వివరాల్లేవు..
- Flood Compensation: ఆంధ్రప్రదేశ్‌లో గత నెలలో వచ్చిన కృష్ణా, గోదావరి, బుడమేరు వరద బాధితులకు భారీగా పరిహారం చెల్లిస్తోంది. విజయవాడలో దాదాపు ఆరు లక్షల మంది ప్రజలు వరద ముంపు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారాన్ని అందలేదనే ఫిర్యాదుల నేపథ్యంలో ఇలా తనిఖీ చేసుకోవచ్చు.
Mon, 30 Sep 202402:59 AM IST
Andhra Pradesh News Live: AP Crime News: ఇద్దరు పిల్లలతో బందరు కాల్వలో దూకిన వివాహిత.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న టాటా ఏస్
- AP Crime News: భర్తతో విభేదాల నేపథ్యంలో విజయవాడలో వివాహిత ఇద్దరు పిల్లలతో బందరు కాల్వలో దూకి గల్లంతైంది. మరో ఘటనలో గుంటూరులో ఆర్టీసీ బస్సును టాటా ఏస్ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మంది గాయపడ్డారు.
Mon, 30 Sep 202402:42 AM IST
Andhra Pradesh News Live: Kadapa Murder: మంచం కింద జిలెటిన్ స్టిక్స్ పేల్చి విఆర్‌ఏ హత్య.. పాతకక్షలే కారణమంటున్న పోలీసులు
- Kadapa Murder: కడప జిల్లాలో బాంబు దాడిలో విఆర్‌ఏ ప్రాణాలు కోల్పోయాడు. పాత కక్షలతో ప్రత్యర్థులు మంచం కింద బాంబులు పెట్టి చంపేయడం కలకలం రేపింది.హత్య పక్కా ప్రణాళికతో మంచం కింద జిలెటిన్ స్టిక్స్ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. నిద్రిస్తుండగా మంచం కింద డిటోనేటర్ తో పేలుడుకు పాల్పడినట్టు గుర్తించారు.
Mon, 30 Sep 202412:30 AM IST
Andhra Pradesh News Live: Anantapuram Teachers: అప్పులు చేసి అజ్ఞాతంలోకి ఉపాధ్యాయులు.. కలకలం రేపుతున్న వరుస ఘటనలు
- Anantapuram Teachers: చదువు బోధించాల్సిన ఉపాధ్యాయులు పక్కా దారి పడుతున్నారు. విద్యా బుద్దులు చెప్పి భావి భారత పౌరులను తీర్చి దిద్దే ఉపాధ్యాయులే అప్పులు చేసి పంగ నామం పెట్టి పరార్ అవుతున్నాడు. అనంతపురం జిల్లాలో వరుసగా జరుగుతున్న ఉపాధ్యాయుల అప్పుల ఎగ్గొట్టే ఘటనలు కలకలం రేపుతున్నాయి.