Anantapuram Teachers: అప్పులు చేసి అజ్ఞాతంలోకి ఉపాధ్యాయులు.. కలకలం రేపుతున్న వరుస ఘటనలు-teachers go into hiding after taking loans a series of disturbing incidents ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anantapuram Teachers: అప్పులు చేసి అజ్ఞాతంలోకి ఉపాధ్యాయులు.. కలకలం రేపుతున్న వరుస ఘటనలు

Anantapuram Teachers: అప్పులు చేసి అజ్ఞాతంలోకి ఉపాధ్యాయులు.. కలకలం రేపుతున్న వరుస ఘటనలు

Muvva Krishnama Naidu HT Telugu
Sep 30, 2024 06:25 AM IST

Anantapuram Teachers: చదువు బోధించాల్సిన ఉపాధ్యాయులు పక్కా దారి పడుతున్నారు. విద్యా బుద్దులు చెప్పి భావి భారత పౌరులను తీర్చి దిద్దే ఉపాధ్యాయులే అప్పులు చేసి పంగ నామం పెట్టి పరార్ అవుతున్నాడు. అనంతపురం జిల్లాలో వరుసగా జరుగుతున్న ఉపాధ్యాయుల అప్పుల ఎగ్గొట్టే ఘటనలు కలకలం రేపుతున్నాయి.

అప్పులు చేసి ఉడాయిస్తున్న అనంతపురం ప్రభుత్వ ఉపాధ్యాయులు
అప్పులు చేసి ఉడాయిస్తున్న అనంతపురం ప్రభుత్వ ఉపాధ్యాయులు

Anantapuram Teachers: చదువు బోధించాల్సిన ఉపాధ్యాయులు పక్కా దారి పడుతున్నారు. విద్యా బుద్దులు చెప్పి భావి భారత పౌరులను తీర్చి దిద్దాల్సిన ఉపాధ్యాయులు అప్పులు చేసి జనానికి పంగ నామం పెట్టి పరారతున్నారు. అనంతపురం జిల్లాలో వరుసగా జరుగుతున్న ఉపాధ్యాయుల అప్పుల ఎగ్గొట్టే ఘటనలు కలకలం రేపుతున్నాయి.

తల్లిదండ్రుల తర్వాత అంతటి వారు ఉపాధ్యాయులు... తల్లిదండ్రులు పిల్లల్ని చక్క బెడతారో లేదో తెలియదు కానీ.. ఎంతో మంది పిల్లలకు చక్కటి చదువులు చెప్పి ఉన్నత శిఖరాల్లో కూర్చొబెట్టిన ఉపాధ్యాయులు ఎందరో. కానీ సమాజంలో నానాటికి ఆ వృత్తికి కలంకం తెస్తున్న ఉపాధ్యాయులు పెరిగిపోతూ ఉన్నారు. ఆడ పిల్లలపై అఘాయిత్యాలు చేస్తున్న ఉపాధ్యాయుల గురించి తరచూ వింటూ ఉన్నాం. ఇప్పుడు అప్పులు తీసుకొని ఎగ్గొట్టే ఉపాధ్యాయులు కూడా పెరిగిపోతూ ఉన్నారు. వినటానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే.

ఈ 'గురువులే'.. వెరైటీ 'గురు'

అనంతపురం జిల్లాలో అప్పు తీసుకొని ఉపాధ్యాయులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. నిజానికి ఇది వినటానికి, చదవటానికి కాస్తంత వింతగా ఉన్నా పచ్చి నిజమే. బడి పంతులు అంటేనే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అంటూ.. దేవుడి స్థానంలో ఊహించుకుంటున్న జనాలు వారు ఎక్కడికి పోతారన్న భరోసాతో అప్పు అడిగిన వెంటనే ఇచ్చేశారు.

నెల నెల జీతం వచ్చే టీచర్ మన డబ్బు ఉంచుకుంటారా, సమయానికి చెల్లిస్తారు లే అనే నమ్మకంతో రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బులు వారికి ఇస్తూ వచ్చారు. అయితే టీచర్లు దీన్ని బాగా అదునుగా తీసుకున్నారు. లక్షలకు లక్షలు అప్పులు తీసేసుకున్నారు.

ఐదు కోట్ల రూపాయలు అప్పు!

అనంతపురం జిల్లాలో ఇప్పటికే ముగ్గురు టీచర్లు ఇదే పని చేయగా తాజాగా విడపనకల్లు మండలంలోని హావలిగి ZPSH పాఠశాల ఉపాధ్యాయుడు బద్రీనాథ్ ఐదు కోట్ల రూపాయలు అప్పులు ఉడాయించాడు. తీసుకున్న అప్పు డబ్బు ఎక్కడ అడుగుతారనో పాఠశాలలకు రావటం మానేశాడు. రెండు నెలలుగా పాఠశాలకు ఆ ఉపాధ్యాయుడు రాలేదని వాకబు చేయగా నిజమేనని తేలింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

మహా కేటు.. టీచర్ బద్రీనాథ్..!

టీచర్ బద్రీనాథ్.. జనం భద్రంగా దాచుకున్న డబ్బుపై కన్నేశాడు. తన తోటి ఉద్యోగులతోనా, గుంతకల్లులో నివాసం ఉంటున్న కాలనీ ప్రజలతో అప్పు తీసుకున్నాడు. ఏకంగా ఐదు కోట్ల రూపాయలకు పైగా అప్పుగా డబ్బు వసూలు చేసుకున్నాడు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తన పేరు మీద ఉన్న ఇంటిని ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థకి అదే సమయంలో బ్యాంకుకు తాకట్టు పెట్టాడు.

అదే సమయంలోనే తాకట్టు పెట్టిన ఇంటిని మరో వ్యక్తికి బాండుపై రాసిచ్చి రూ. 40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే దీనిపై బాధితులు పోలీసులను సైతం ఆశ్రయించారు. పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అనంతపురం జిల్లాలో ఉపాధ్యాయులు అప్పుల బాగోతం స్థానికంగానే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్లు పెను చర్చకు దారి తీసింది. బాధితులు కష్టపడి సొమ్ము టీచర్ల పాలైందని లబోదిబోమంటున్నారు.