AP KGBV Posts : ఏపీలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో(కేజీబీవీ) ఖాళీలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో 604 బోధన సిబ్బంది పోస్టుల, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు అక్టోబర్ 10 ఆఖరి తేదీ. అయితే సత్యసాయి (70), అనంతపురం (68), కర్నూలు (52) జిల్లాల్లో అత్యధిక పోస్టులు ఉండగా, ఏలూరు (1), విశాఖపట్నం (3), ఎన్‌టీఆర్ (3), బాపట్ల (3), తిరుపతి (3) జిల్లాల్లో అత్యల్ప పోస్టులు ఉన్నాయి.
ప్రిన్సిపల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ, పార్ట్ టైం టీచర్స్, వార్డెన్, అకౌంటెంట్ వంటి మొత్తం 604 పోస్టులను భర్తీ చేస్తారు. అందులో ప్రిన్సిపల్ 10, పీజీటీ 165, సీఆర్‌టీ 163, పీఈటీ 4, పార్ట్ టైం టీచర్స్ 165, వార్డెన్ 53, అకౌంటెంట్ 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో 507 బోధనా, 107 బోధనేతర పోస్టులు ఉన్నాయి. కాగా, టైప్-3లో 386 పోస్టులు భర్తీ చేస్తారు.
అందులో 342 బోధన, 44 బోధనేతర పోస్టులు ఉన్నాయి. టైప్-3 లో ప్రిన్సిపల్ పోస్టులు 10, పీజీటీ 163, సీఆర్‌టీ 165, పీఈటీ 4, అకౌంటెంట్స్ 44 పోస్టులు ఉన్నాయి. అలాగే టైప్-4లో 218 పోస్టులు భర్తీ చేస్తారు. అందులో 165 బోధన, 53 బోధనేతర పోస్టులున్నాయి. వాటిలో పార్ట్ టైం టీచర్స్ 165, వార్డెన్ 53 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను 2024-25 విద్యా సంవత్సరం (ఒక సంవత్సరం) కాలానికి భర్తీ చేస్తున్నారు. మెరిట్ ఆధారంగానే ఎంపిక ఉంటుంది.
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు అప్లై చేయాలంటే, 2024 జూలై 1 నాటికి 42 సంవత్సరాలు దాటకూడదు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు (47 ఏళ్ల వరకు) ఉంటుంది. మాజీ సైనిక ఉద్యోగుల మహిళలకు మూడేళ్ల వయస్సు సడలింపు (45 ఏళ్ల వరకు) ఉంటుంది. దివ్యాంగులైన అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు (52 ఏళ్ల వరకు) ఉంటుంది.
అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తును దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు. అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://welfarerecruitments.apcfss.in/kgbvDRecruitmentPaymentForm.do పై క్లిక్ చేసి రూ. 250 ఫీజు చెల్లించాలి. దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://welfarerecruitments.apcfss.in/kgbvDRecruitApplication.do క్లిక్ చేసి దాఖలు చేసుకోవాలి. అక్టోబర్ 10 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు దాఖలు చేసేందుకు గడువు ఉంటుంది.
అక్టోబర్ 14న మెరిట్ జాబితా జనరేట్ అవుతుంది. అక్టోబర్ 17న జిల్లా స్థాయి కమిటీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేస్తారు. అక్టోబర్ 19 తుది మెరిట్ జాబితాను విడుదల చేశారు. అక్టోబర్ 21 లోపు తుది మెరిట్ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. అక్టోబర్ 21న ఫిర్యాదులను పరిశీలించి తుది జాబితా విడుదల చేస్తారు. అక్టోబర్ 23న అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇస్తారు. అక్టోబర్ 24న డ్యూటీ కోసం రిపోర్టు చేయాలి.
ఈ లింక్‌లు క్లిక్ చేస్తే జిల్లాల వారీగా, పోస్టుల వారీగా రోస్టర్ వస్తుంది. టీచింగ్ పోస్టులకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://apkgbv.apcfss.in/pdfs/t_roster.pdf క్లిక్ చేస్తే పోస్టుల రోస్టర్ విధానం వస్తుంది. అలాగే నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://apkgbv.apcfss.in/pdfs/nt_roster.pdf క్లిక్ చేస్తే పోస్టుల రోస్టర్ విధానం వస్తుంది.
ప్రిన్సిపాల్‌కు రూ.34,139, సీఆర్‌టీ (కాంట్రాక్ట్ రెసిడెన్సియల్ టీచర్)కు రూ.26,759, పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్)కు రూ.26,759, పీజీటీ (పోస్టు గ్రాడ్యూట్ టీచర్)కు రూ.26,759 ఉంటుంది. అకౌంటెంట్‌కు రూ.18,500, వార్డెన్‌కు రూ.18,500, పార్ట్ టైం టీచర్‌కు రూ.18,500 ఉంటుంది.
ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు రెండేళ్ల పీజీ, బీఈడీ తప్పనిసరిగా చేయాలి. పీజీలో ఓసీలకు 50 శాతం, బీసీలకు 45 శాతం, ఎస్‌సీ, ఎస్‌టీలకు 40 శాతం మార్కులు రావాలి. పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా రెండేళ్ల పీజీ చేయాలి. పీజీలో ఓసీలకు 50 శాతం, బీసీలకు 45 శాతం, ఎస్‌సీ, ఎస్‌టీలకు 40 శాతం మార్కులు రావాలి. సీఆర్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేయాలి.
అలాగే 50 శాతం మార్కులు రావాలి. పీఈటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత సాధించిడంతో పాటు ఫిజికల్ ఎడ్యూకేషన్‌లో బీపీఈడీ, ఎంపీఈడీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే దివ్యాంగులు పీఈటీ పోస్టులకు అర్హులు కారు. వార్డెన్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ చేసి ఉండాలి. పార్ట్ టైం టీచర్స్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ చేసి ఉండాలి. అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు బీకాం, బీకాం (కంప్యూటర్) డీగ్రీ పూర్తి చేయాలి.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు