Graduate Election Voter Registration : పట్టభద్రుల ఓటర్ల నమోదు, అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు అప్లికేషన్ల స్వీకరణ
Graduate Election Voter Registration : ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు ఈ జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Graduate Election Voter Registration : ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు ఈ జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫారం-18 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఈసీ తెలిపింది. నవంబర్ 23న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ను విడుదల చేయనున్నారు. డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డిసెంబర్ 30న తుది జాబితాను వెల్లడించనున్నారు. ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు ఫారం-18 నింపాల్సి ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఏదైనా డిగ్రీ పూర్తి చేయాలి. ఎన్నికలు జరిగే జిల్లాల పరిధిలోని నివసించే గ్రాడ్యుయేట్లు తమ ఓటును నమోదు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఎక్కడ పూర్తి చేసినా...ఆధార్‌లోని అడ్రస్ ఆధారంగా తమ ఓటును నమోదు చేసుకోవచ్చు. అధికారులు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు దరఖాస్తుదారుడు ఒరిజినల్ సర్టిఫికెట్‌లు చూపించాలి. ఓటు హక్కు నమోదు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు అక్టోబర్ 1 నుంచి నవంబరు 6 వరకు అవకాశం కల్పిస్తున్నారు. ఆ తర్వాత నవంబరు 23న ముసాయిదా విడుదల చేస్తారు. ఆ తర్వాత నవంబర్ 9 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. నవంబరు 30న పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు. 2025 మార్చి 29తో కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలు , ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ, ఇళ్ల వెంకటేశ్వరరావు పదవీకాలం 2025 మార్చి 29తో పూర్తి అవుతుంది.
తెలంగాణలో
నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు చెందిన అర్హత కలిగిన ఓటర్లు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం ఈ నెల (సెప్టెంబర్) 30 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఇటీవల సూచించారు.
నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ స్థానంతో పాటు, పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ సభ్యుల కాలపరిమితి 2025 మార్చి 29 నాటితో ముగియనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఎలక్షన్ కమిషన్ అర్హత కలిగిన ఓటర్లకు పేర్ల నమోదు కోసం అవకాశం కల్పిస్తూ ఈ నెల 30న పబ్లిక్ నోటీసును జారీ చేయనుందని తెలిపారు. అక్టోబర్ 16, 25 వ తేదీలలో రెండు పర్యాయాలు పత్రికాముఖంగా కూడా ప్రకటనలు జారీ చేస్తారని అన్నారు.
సంబంధిత కథనం