తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Si, Constable Recruitment 2022 : ఎస్సై, కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్.. ఏమేం సర్టిఫికేట్స్ కావాలి?

SI, Constable Recruitment 2022 : ఎస్సై, కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్.. ఏమేం సర్టిఫికేట్స్ కావాలి?

HT Telugu Desk HT Telugu

26 October 2022, 11:15 IST

    • TS Police Constable Recruitment 2022 : టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ(TSLPRB) నిర్వహించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల అయ్యాయి. అయితే సర్టిఫికేట్స్ అప్ లోడ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి అభ్యర్థులు.
తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్
తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ (tsplrb)

తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్

ఎస్సై, కానిస్టేబుల్ నియామాకాల(SI Constable Recruitment)కు ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. సుమారు 2.69 లక్షల మంది ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించారు. ఇక తదుపరి చేయాల్సిన పని.. ధ్రువీకరణ పత్రాలు(Certificates) ఆన్ లైన్ లో సమర్పించడం. ఈ ప్రాసెస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు.. సర్టిఫికేట్స్ టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ(TSLPRB) అధికారిక వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుది. ఈ ప్రక్రియ ఈ నెల 27 నుంచి నవంబర్ 10 వరకు ఉంటుంది. దీనిని పార్ట్ 2 గా పిలుస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

Mlc Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, బెయిల్ నిరాకరించిన కోర్టు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

అయితే సర్టిఫికేట్స్ అప్ లోడ్ ప్రక్రియ ప్రారంభం అయ్యాక.. అభ్యర్థులు అలర్ట్ గా ఉండాలి. వివిధ పోస్టులకు ప్రాథమిక పరీక్ష(Constable Exam Primary Result)లో సుమారు 2.69 లక్షల మంది అర్హత సాధించారు. దీంతో ఎక్కువమంది ధ్రువ పత్రాల అప్ లోడ్ కోసం ప్రయత్నిస్తే.. వెబ్ సైట్లో ట్రాఫిక్ పెరుగుతుంది. దీంతో టెక్నికల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను జిల్లా, కంటీజియస్ జిల్లా కేడర్ గా విభజించారు. ఈ కేడర్లలో 95 శాతం స్థానికులకే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు స్థానికతను రుజువు చేసుకోవాలి. దీనికోసం సర్జిఫికేట్స్ అప్ లోడ్ చేయాలి.

ఏమేం కావాలి

1 నుంచి ఏడో తరగతి వరకు స్టడీ, కాండక్ట్ సర్టిఫికెట్లు(Study Conduct Certificates) సమర్పించాలి. ఒకవేళ మీరు గుర్తింపు పొందిన పాఠశాలలో చదవకుంటే.. తహశీల్దారు జారీ చేసిన నివాస ద్రువీకరణ పత్రం కావాలి. పుట్టిన తేదీ నిర్ధారణకు పదో తరగతి మెమో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సైకి క్వాలిఫై అయినవారు.. డిగ్రీ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇంటర్ మెమో కావాలి.

ఓసీల్లో నిరుపేదలకు వయోపరిమితి సడలింపునకు ఈడబ్య్లూఎస్ ధ్రువీకరణ పత్రాం తప్పనిసరిగా ఉండాలి. బీసీ అభ్యర్థులు రిజర్వేషన్ పొందేందుకు 2021 ఏప్రిల్ 1 తర్వాత పొందిన నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ కూడా కావాలి. ఎస్టీ అభ్యర్థులు ఎత్తులో సడలింపునకు ఏజెన్సీ ఏరీయా ధ్రువీకరణపత్రం సమర్పించాలి.

తెలంగాణ(Telangana) రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల కోటాలో వయోపరిమితి సడలింపునకు సర్వీస్ సర్టిఫికెట్ కూడా కావాలి. మాజీ సైనికోద్యోగులు వయోపరిమితి సడలింపునకు, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఉద్యోగాల కోసం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేదా డిశ్ఛార్జి బుక్ కూడా అధికారిక వెబ్ సైట్ లో స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.