TS EAMCET 2022 Counselling: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌, అవసరమైన పత్రాలు-ts eamcet 2022 counselling schedule and required documents ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eamcet 2022 Counselling: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌, అవసరమైన పత్రాలు

TS EAMCET 2022 Counselling: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌, అవసరమైన పత్రాలు

HT Telugu Desk HT Telugu
Aug 19, 2022 10:56 AM IST

TS EAMCET 2022 ఎంసెట్‌ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. మూడు విడతలుగా ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్‌ కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు.

TS EAMCET 2022 Counselling: తెలంగాణ ఎంపీసీ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
TS EAMCET 2022 Counselling: తెలంగాణ ఎంపీసీ ఎంసెట్ షెడ్యూల్ విడుదల (Shankar Mourya/HT photo)

తెలంగాణ ఎంసెట్‌ ఎంపిసి స్ట్రీమ్‌ విద్యార్ధులకు కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థులు ఏయే తేదీలలో హాజరు కావాలో కౌన్సిలింగ్ తేదీలను విడుదల చేశారు. దీంతో పాటు కౌన్సిలింగ్‌కు హాజరు కావడానికి అవసరమైన పత్రాల జాబితాను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.

ఎంసెట్ 2022 కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంపీసీ విద్యార్ధులకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. విద్యార్ధులకు పూర్తి షెడ్యూల్‌ను www.tseamcet.nic.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎంసెట్‌ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ ప్రకారం ఆగష్టు 21 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఆగష్టు29వరకు రిజిస్ట్రేషన్లకు గడువుగా నిర్ణయించారు. ఆగష్టు 23నుంచి 30వరకు స్లాట్ బుక్‌ చేసుకున్న విద్యార్ధులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. వెరిఫికేషన్‌ పూర్తైన తర్వాత ఆగష్టు 23 నుంచి సెప్టెంబర్ 2వరకు కాలేజీలను ఎంచుకునే అవకాశం కల్పిస్తారు.

రెండో విడత అడ్మిషన్లను సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 10వరకు నిర్వహిస్తారు. తుది దశ అడ్మిషన్ ప్రక్రియను అక్టోబర్ 11 నుంచి 21వరకు నిర్వహిస్తారు. స్పాట్ అడ్మిషన్లను అక్టోబర్ 20 నుంచి నిర్వహిస్తారు. మరిన్ని వివరాలను తెలంగాణ ఎంసెట్‌ నిర్వహణకు సంబందించిన అధికారిక వెబ్‌సైట్‌ www.tseamcet.nic.inనుంచి పొందవచ్చు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ కోసం కావాల్సిన పత్రాలు…

  1. TSEAMCET -2022 ర్యాంకు కార్డు
  2. TSEAMCET -2022 హాల్ టిక్కెట్
  3. ఆధార్ కార్డు
  4. ఎస్సెస్సీ తత్సమానమైన కోర్సు మార్కుల జాబితా
  5. ఇంటర్‌ మార్కుల జాబితా
  6. ఆరు నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్స్‌
  7. ఇంటర్మీడియట్ టీసీ
  8. 2022 జనవరి 1 తర్వాత తీసుకున్న ఆధాయ ధృవీకరణ పత్రం
  9. 2022-23లలో చెల్లుబాటయ్యే ఈడబ్ల్యుఎస్‌ ఆదాయ ధృవీకరణ పత్రం
  10. కుల ధృవీకరణ పత్రం
  11. నివాస ధృవీకరణ పత్రం, రెగ్యులర్‌గా చదవని వారు ఏడేళ్ల రెసిడెన్స్‌ సర్టిఫికెట్ సమర్పించాలి.

IPL_Entry_Point