Traffic violations : ఈ రాష్ట్రంలో.. ట్రాఫిక్​ రూల్స్​ ఉల్లంఘించినా- నో 'ఫైన్స్​'!-no fine for traffic violations in this state because diwali ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  No Fine For Traffic Violations In This State. Because Diwali

Traffic violations : ఈ రాష్ట్రంలో.. ట్రాఫిక్​ రూల్స్​ ఉల్లంఘించినా- నో 'ఫైన్స్​'!

Sharath Chitturi HT Telugu
Oct 22, 2022 07:14 AM IST

Gujarat traffic violations : రాష్ట్ర ప్రజలు ట్రాఫిక్​ రూల్స్​ని ఉల్లంఘించినా జరిమానాలు విధించమని గుజరాత్​ ప్రభుత్వం ప్రకటించింది. దీపావళి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

ఈ రాష్ట్రంలో.. ట్రాఫిక్​ రూల్స్​ ఉల్లంఘించినా నో 'ఫైన్స్​'!
ఈ రాష్ట్రంలో.. ట్రాఫిక్​ రూల్స్​ ఉల్లంఘించినా నో 'ఫైన్స్​'!

Gujarat traffic rules violation : గుజరాత్​ ప్రభుత్వం.. తన రాష్ట్ర ప్రజలకు బంపర్​ ఆఫర్లు ఇస్తోంది. ప్రతి ఇంటికి.. ఏడాదికి రెండు గ్యాస్​ సిలిండర్​లు ఫ్రీ అని ప్రకటించింది ప్రభుత్వం.. తాజాగా మరో వార్త చెప్పింది. ఈ నెల 21 నుంచి 27 వరకు.. రాష్ట్రంలో ఎవరు ట్రాఫిక్​ రూల్స్​ని ఉల్లంఘించినా జరిమానాలు విధించబోమని స్పష్టం చేసింది. దీపావళి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు.. గుజరాత్​ హోంమంత్రి హర్ష్​ సంఘవి వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

సూరత్​లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో హర్ష్​ సంఘవి ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"దీపావళి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాము. 21 నుంచి 27 వరకు ట్రాఫిక్​ రూల్స్​ ఉల్లంఘించినా ఫైన్​లు వేయబోము. అలా అని మీరు ట్రాఫిక్​ రూల్స్​ ఉల్లంఘిచాలి అని కాదు. మీరు తప్పు చేసినా జరిమానాలు వేయము. దాని బదులు.. మీరు ట్రాఫిక్​ రూల్స్​ పాటించాలని, పోలీసులు మీకు పువ్వులు ఇచ్చి చెబుతారు," అని హర్ష్​ సంఘవి స్పష్టం చేశారు.

2022 గుజరాత్​ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రకటనలు చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

నెట్టింట ట్రోల్స్​..

Gujarat latest news : ట్రాఫిక్​ రూల్స్​ను ఉల్లంఘించినా, జరిమానాలు విధించమని గుజరాత్​ ప్రభుత్వం ప్రకటించడంపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇదొక మంచి చర్య అని, ప్రజలు వాలంటరీగా రూల్స్​ పాటించే అవకాశం లభిస్తుందని కొందరు చెబుతున్నారు. కాగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వ నిర్ణయంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

'ఎన్నికలు మీ చేత ఏదైనా చేయిస్తాయి,' అని ట్వీట్​ చేశారు గుజరాత్​ ఎమ్మెల్యే జిగ్నేష్​ మేవాని. ఓట్ల కోసం వాహనదారుల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని ఆర్​ఎల్​డీ చీఫ్​ జయంత్​ సింగ్​ చౌదరి అభిప్రాయపడ్డారు.

"ఇదేం ప్రకటన అసలు. ఓట్ల కోసం వాహనదారుల ప్రాణాలను ఫణంగా పెడతారా? ఇలాంటి ప్రకటనలు చేయడం కోసమేనా.. ఎన్నికల సంఘం ఇంకా ఎలక్షన్​ షెడ్యూల్​ను విడుదల చేయలేదు?" అని జయంత్​ సింగ్​ ప్రశ్నించారు.

ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చట్టాలను ఎవరు పట్టించుకోరని కొందరు, యాక్సిడెంట్లు పెరుగుతాయని మరికొందరు అంటున్నారు.

గుజరాత్​ ఎన్నికలు..

Gujarat Assembly elections 2022 : గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. కాగా.. కొన్ని రోజుల క్రితం హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల షెడ్యూల్​ను ఈసీ ప్రకటించింది. అదే సమయంలో గుజరాత్​ ఎన్నికల షెడ్యూల్​ కూడా వస్తుందని అందరు భావించారు. కానీ ఆ షెడ్యూల్​ను ఈసీ ప్రకటించలేదు. ఫలితంగా ఈసీ చర్యలపై విపక్షాలు నిరసన తెలిపాయి. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ప్రజలను ఆకట్టుకనే విధంగా బీజేపీ ప్రకటనలు చేయడం కోసమే ఎన్నికల షెడ్యూల్​ను ఈసీ వాయిదా వేసిందని విమర్శలు వచ్చాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం