TSLPRB Results 2022: SI, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల - లింక్ ఇదే-telangana police constable preliminary results 2022 released ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Police Constable Preliminary Results 2022 Released

TSLPRB Results 2022: SI, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల - లింక్ ఇదే

HT Telugu Desk HT Telugu
Oct 21, 2022 07:04 PM IST

TS Police Constable Results 2022: టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నిర్వహించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

తెలంగాణ పోలీసు ఉద్యోగాలు
తెలంగాణ పోలీసు ఉద్యోగాలు (ht)

TSLPRB Constable Results 2022: TSLPRB Results 2022: పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు ఫలితాలు, ఇతర వివరాల కోసం https://www.tslprb.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ఉత్తీరణత శాతం ఇలా…

సివిల్‌ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సివిల్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్ పరీక్షలో 31.40శాతం అయ్యారు. రవాణా కానిస్టేబుల్‌ పరీక్షలో 44.84శాతం, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పరీక్షలో 43.65శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు రిక్రూట్ మెంట్ బోర్డు పేర్కొంది.

పలు ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 7న ప్రాథమమిక పరీక్ష జరిగింది. మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులకుగాను 6,03,955 (91.34శాతం) మంది హాజరయ్యారు. పోలీస్‌ సివిల్‌ విభాగంలో 15,644, ఆబ్కారీశాఖలో 614, రవాణాశాఖలో 63 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇలా చెక్ చేసుకోండి...

అభ్యర్థులు https://www.tslprb.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

లాగిన్ ఆప్షన్ ను ఎంచుకోండి

మీ మొబైల్ నంబర్, పాస్ వర్డ్ ను ఇవ్వండి.

డ్యాష్ బోర్డులో ఎస్సై , కానిస్టుబుల్ పరీక్ష లో మీరు అర్హత సాధించారా లేదా అనే వివరాలను చూసుకోండి.

telangana state police level recruitment board: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు నిర్వహించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల రాత పరీక్షల కటాఫ్‌ మార్కులను ప్రభుత్వం సవరించిన సంగతి తెలిసిందే. 200 మార్కులకుగాను 60 మార్కులు ఓసీలకు, 50 బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 40 మార్కులు ఉంటాయని పేర్కొంది. గతంలో ఈ మార్కులు ఓసీలకు 80, బీసీలకు 70, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం ఉండగా.. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్‌ విచారణలో ఉండగానే ప్రభుత్వం కటాఫ్‌లను సవరించడంతో ధర్మాసనం పిటిషన్‌పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

IPL_Entry_Point