తెలుగు న్యూస్  /  Telangana  /  Trs Fires On Pm Modi Comments Over Singareni Privatisation:

TRS On Singareni Issue : పార్లమెంట్ లో చెప్పింది నిజమా..? మోదీ చెప్పింది నిజమా?

HT Telugu Desk HT Telugu

13 November 2022, 7:46 IST

    • pm modi on singareni privatisation: ప్రధాని మోదీ తెలంగాణ టూర్ లో చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సింగరేణితో పాటు బొగ్గు గనుల విషయంలో ప్రధాని అవాస్తవాలను చెప్పారని విమర్శిస్తున్నారు.
మోదీ టూర్ పై టీఆర్ఎస్ ఫైర్
మోదీ టూర్ పై టీఆర్ఎస్ ఫైర్

మోదీ టూర్ పై టీఆర్ఎస్ ఫైర్

PM Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణ టూర్.. హీట్ ను పుట్టిస్తోంది. శనివారం బేగంపేట్ లో మాట్లాడిన ప్రధాని... తెలంగాణ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలను దోచుకుంటే వదిలే ప్రసక్తి లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక రామగుండం సభలో మాట్లాడిన ప్రధాని... సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదన్నారు. బొగ్గు గనుల విషయంలో కొందరు హైదరాబాద్ లో కూర్చొని రెచ్చగొడుతున్నారంటూ... పరోక్షంగా టీఆర్ఎస్ టార్గెట్ చేశారు. అయితే ప్రధాని చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ మండిపడుతోంది.

ట్రెండింగ్ వార్తలు

TS Weather Updates : తెలంగాణలో భానుడి భగభగలు - ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, IMD తాజా అప్డేట్స్ ఇవే

Sangareddy fake Documents: నకిలీ పత్రాలను సృష్టించి ఫ్లాట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు

TSPSC Group 1 Exam Updates : ఓఎంఆర్‌ విధానంలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష - TSPSC ప్రకటన

TS SSC Supplementary: జూన్‌ 3 నుంచి తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్‌ టేబుల్ విడుదల

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై విషం చిమ్మేలా మోదీ వ్యాఖ్యానించార‌ని మండిప‌డ్డారు మంత్రి జగదీశ్ రెడ్డి. మునుగోడులో ఓట‌మి చెందిందనే మోదీ త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కార‌ని అన్నారు. వ‌డ్డీతో స‌హా ఇస్తార‌న్న మీకే ప్ర‌జ‌లు తిరిగి చెల్లిస్తారని చెప్పారు. బ్యాంకు లోన్లు రాకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుని, టీఆర్ఎస్ పార్టీలో అలజడి చేసేందుకు కుట్రలు చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.నాయకులు, పార్టీలను భయపెట్టి ఎదురు లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుంద‌న్నారు. దేశంలో బీజేపీ పీడను వదిలించుకునేందుకు కేసీఆర్ నాయకత్వంలో మరింతగా ముందుకు పోతామ‌ని తేల్చిచెప్పారు.

సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాని మోదీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ఒకమాట.. రామగుండంలో మరో మాట ఉంటుందా? అని నిలదీశారు. సింగరేణి ప్రైవేటీకరణపై పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి చెప్పిన విషయాలు, శనివారం రామగుండంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

సింగరేణి కార్మికుల సమ్మెపై పార్లమెంట్‌లో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి సమాధానం ఇచ్చారని వినోద్‌కుమార్‌ గుర్తుచేశారు. తెలంగాణలో సింగరేణి కాలరీస్‌కు సంబంధించిన కల్యాణఖని బ్లాక్‌-6, కోయిల్‌గూడెం బ్లాక్‌-3, సత్తుపల్లి బ్లాక్‌-3, శ్రావణపల్లి బ్లాకులను వేలం వేయరాదని, వాటిని సింగరేణికే అప్పజెప్పాలని కార్మికులు సమ్మె చేయడంతో ప్రహ్లాద్‌జోషి స్పష్టమైన సమాధానమిచ్చారని చెప్పారు.