LIVE UPDATES
TGSRTC Dasara Services : ఈ నెల 9 నుంచి 12 వరకు అధిక రద్దీ, గమ్యం యాప్ తో బస్సుల ట్రాకింగ్ - ఎండీ వీసీ సజ్జనార్
Telangana News Live October 7, 2024: TGSRTC Dasara Services : ఈ నెల 9 నుంచి 12 వరకు అధిక రద్దీ, గమ్యం యాప్ తో బస్సుల ట్రాకింగ్ - ఎండీ వీసీ సజ్జనార్
07 October 2024, 21:58 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Telangana News Live: TGSRTC Dasara Services : ఈ నెల 9 నుంచి 12 వరకు అధిక రద్దీ, గమ్యం యాప్ తో బస్సుల ట్రాకింగ్ - ఎండీ వీసీ సజ్జనార్
- TGSRTC Dasara Services : దసరాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్, రవాణా శాఖలతో ఎండీ సజ్జనార్ సమీక్షించారు. మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంతో రద్దీ దృష్ట్యా గత ఏడాదితో పోల్చితే అదనంగా 600 స్పెషల్ సర్వీసులను తిప్పాలని నిర్ణయించామన్నారు.
Telangana News Live: TGPSC Group 4 : గ్రూప్-4 తుది ప్రక్రియ త్వరలోనే చేపడతాం, అభ్యర్థులకు మంత్రి తుమ్మల హామీ
- TGPSC Group 4 : గ్రూప్-4 తుది ప్రక్రియ త్వరలోనే చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి గ్రూప్-4 తుది ఫలితాలు తొందరగా ప్రకటించాలని కోరారు. 2023లో గ్రూప్-4 పరీక్ష నిర్వహించగా, ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది.
Telangana News Live: National Merit Scholarship : ఇంటర్ పాసైన విద్యార్థులకు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్- దరఖాస్తులకు అక్టోబర్ 31 చివరి తేదీ
- National Merit Scholarship : 2024లో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ పొందే అవకాశం లభించింది. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 31 వరకు అవకాశం ఇచ్చింది. అలాగే గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి సైతం అవకాశం కల్పించారు.
Telangana News Live: MP Raghunandan Rao : రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధమేంటో- ఎంపీ రఘునందన్ రావు పాత వీడియో వైరల్
- MP Raghunandan Rao : నాగార్జున, సమంత, బీఆర్ఎస్ గురించి గతంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన సంచలన వ్యాఖ్యల వీడియో తాజాగా వైరల్ అవుతుంది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా...బీఆర్ఎస్ హయాంలో ఎందుకు కూల్చలేదని, సమంతను చేనేత అంబాసిడర్ గా ఎందుకు చేశారని రఘునందర్ రావు ప్రశ్నించారు.
Telangana News Live: Lower Manair Dam : ఎత్తిపోసి వదిలేసి, ముచ్చటగా మూడోసారి- లోయర్ మానేరు గేట్లు ఎత్తివేత
- Lower Manair Dam : గత 25 రోజుల్లో మూడోసారి లోయర్ మానేర్ డ్యామ్ గేట్లు ఎత్తారు. వర్షాలకు ముందు నంది పంప్ హౌస్ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని మిడ్ మానేర్ కు అక్కడి నుంచి లోయర్ మానేరుకు విడుదల చేశారు. ఈ నీటిని వృద్ధాగా వదులుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
Telangana News Live: Hero Nagarjuna Petition : పరువు నష్టం దావా కేసు, హీరో నాగార్జున వాంగ్మూలం రికార్డు చేయాలన్న కోర్టు
- Hero Nagarjuna Petition : మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంలో హీరో నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని కోర్టు తెలిపింది. దీంతో ఆయన రేపు కోర్టుకు హాజరు కానున్నారు.
Telangana News Live: Siddipet : వ్యభిచార గృహంపై దాడి.. నలుగురు విటులు, ఒక మహిళ అరెస్ట్
- Siddipet : వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నలుగురు విటులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక ప్రభుత్వ ఉపాద్యాయుడు ఉన్నారు. హోమియోపతి డాక్టర్ పరారీలో ఉన్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.
Telangana News Live: Johnny Master Case : జానీ మాస్టర్‌కు మరో షాక్.. బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేయనున్న పోలీసులు
- Johnny Master Case : జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్ దాఖలు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు వేయనున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ నేషనల్ అవార్డును క్యాన్సిల్ చేశారు. అవార్డు తీసుకోవడం కోసం 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ అయ్యింది.
Telangana News Live: TG BSc Nursing Admission 2024 : బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లకు నోటిఫికేషన్.. ఈ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి
- TG BSc Nursing Admission 2024 : బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అక్టోబరు 14న సాయంత్రం 6 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు.
Telangana News Live: TG Teacher Appointment Letter : ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 9న నియామక పత్రాలు.. 10 ముఖ్యమైన అంశాలు
- TG Teacher Appointment Letter : 2024 డీఎస్సీకి సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 9న వీరికి అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వనున్నారు.
Telangana News Live: Singareni : బీఆర్ఎస్ సింగరేణి నిరసన దీక్ష భగ్నం.. టెంట్ కూల్చేసిన పోలీసులు.. ఉద్రిక్తత
- Singareni : పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్, దాని అనుబంధ కార్మిక సంఘం టీబీజికేఎస్ చేపట్టిన సింగరేణి నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. దీక్షకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకొని టెంట్‌ను తొలగించారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగి.. ఉద్రిక్తతకు దారితీసింది.
Telangana News Live: TG Rains : 365 జాతీయ రహదారిపై భారీ వర్షానికి కూలిన ఆర్చీలు.. తప్పిన ప్రమాదం
- TG Rains : ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో వచ్చిన భారీ వర్షానికి నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసి ఆర్చీలు కూలిపోయాయి. కూలిపోయిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో.. ప్రమాదం తప్పింది.