National Merit Scholarship : ఇంటర్ పాసైన విద్యార్థులకు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్- దరఖాస్తులకు అక్టోబర్ 31 చివరి తేదీ
National Merit Scholarship : 2024లో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ పొందే అవకాశం లభించింది. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 31 వరకు అవకాశం ఇచ్చింది. అలాగే గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి సైతం అవకాశం కల్పించారు.
2024లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ పొందే అవకాశం లభించింది. ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులు 'నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్'కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం.. ఇంటర్ పూర్తైన విద్యార్థులకు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ అందిస్తున్న విషయం తెలిసిందే. 2024లో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఫ్రెష్ గా దరఖాస్తు చేసుకునేందుకు, అలాగే గతంలో అప్లై చేసుకున్న వారు అప్లికేషన్ రెన్యువల్ చేసుకునేందుకు అక్టోబర్ 31 వరకు అవకాశం కల్పించారు. విద్యార్థులు https://scholarships.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్ వచ్చిన మొత్తం విద్యార్థులు 59355 ఉన్నారని బోర్డు ప్రకటించింది.
రెన్యువల్ అప్లికేషన్లకు మరో ఛాన్స్
ఇన్స్టిట్యూట్ నోడల్ అధికారి వెరిఫికేషన్ కు నవంబర్ 15 చివరి తేదీ అని ప్రకటించారు. అర్హులైన విద్యార్థులు http://scholarships.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. అయితే రెన్యువల్ దరఖాస్తులకు మరో అవకాశం కల్పించారు. గతంలో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులకు రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ లో రెన్యువల్ చేసుకునేందుకు విద్యార్థులను అనుమతించనున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఓటీఆర్ ఐడీని రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు పంపుతారు. ఈ దరఖాస్తుదారులు సంబంధిత సర్టిఫికేట్లతో మంత్రిత్వ శాఖను సంప్రదించాలి. అనంతరం మంత్రిత్వ శాఖ ఆ విద్యార్థులకు స్కాలర్ షిప్ రెన్యువల్ కు అర్హత కల్పిస్తుంది.
వాల్వోలిన్ ముస్కాన్ స్కాలర్ షిప్
వాల్వోలిన్ కమ్మిన్స్ సంస్థ ముస్కాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్-2024 కింద కమర్షియల్ వెహికల్ డ్రైవర్లు (LMV/HMV), మెకానిక్‌ల పిల్లలు, ఆర్థికంగా బలహీన వర్గానికి(EWS) చెందిన విద్యార్థులకు స్కాలర్ ఫిష్ అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ను దక్షిణ భారతం, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు రూ.12,000 వరకు గ్రాంట్‌ను అందిస్తారు. దరఖాస్తుకు అక్టోబర్ 10 చివరి తేదీ.
ఈ స్కాలర్ షిప్ నకు ఎంపికైన విద్యార్థులు విద్యాపరంగా సవాళ్లను అధిగమించడానికి, లక్ష్యాలను నిర్దేశించడంలో అకడమిక్ ఎక్సలెన్స్‌ను సాధించడానికి మెంటర్‌షిప్ మద్దతు ఇస్తారు. ఈ మెంటర్‌షిప్ ద్వారా విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, వారి పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకునేలా వారిని మోటివేట్ చేస్తారు.
అప్లికేషన్ విధానం
- వాల్వోలిన్ కమ్మిన్స్ అధికారిక లింక్ http://muskaan.valvolinecummins.com/?cuid=tt_MKSP1_20240705_1 పై క్లిక్ చేయండి. అప్లై నౌ ఆప్షన్ ను ఎంచుకోండి.
- మీ రిజిస్టర్డ్ ఐడీతో Buddy4Studyకి లాగిన్ చేయండి. 'దరఖాస్తు ఫారమ్ పేజీ'కి నావిగేట్ అవుతుంది. మీ ఇమెయిల్, మొబైల్ నంబర్ లేదా జీ మెయిల్ ఖాతాను ఉపయోగించి Buddy4Studyలో సైన్ అప్ చేయండి.
- ఆ తర్వాత ‘ముస్కాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024’ దరఖాస్తు ఫారమ్ పేజీకి నావిగేట్ అవుతారు.
- అప్లికేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి 'అప్లికేషన్ స్టార్ట్ ' బటన్‌పై క్లిక్ చేయండి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన వివరాలను నమోదు చేయండి.
- సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయండి
- షరతులు అంగీకరించి ‘ప్రివ్యూ’పై క్లిక్ చేయండి.
- దదరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
సంబంధిత కథనం