TG BSc Nursing Admission 2024 : బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లకు నోటిఫికేషన్.. ఈ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి
TG BSc Nursing Admission 2024 : బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అక్టోబరు 14న సాయంత్రం 6 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు.
తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని.. యూనివర్సిటీ అధికారులు సూచించారు. https://tsparamed.tsche.in లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో వివరించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 14వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు.
తెలంగాణలో వరుసగా నాలుగేళ్ల పాటు చదివిన వారే రిజిస్ట్రేషన్ చేసుకోవాడనికి అర్హులని యూనివర్సిటీ అధికారులు వివరించారు. ఇంజనీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలని స్పష్టం చేశారు. జనరల్ అభ్యర్థులకు 50, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40, దివ్యాంగులకు 45 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు హెల్త్ యూనివర్సిటీ వెబ్‌సైట్ https://www.knruhs.telangana.gov.in/all-notifications/ ను సంప్రదించవచ్చు.
పూర్తి వివరాలు..
కోర్సు- బీఎస్సీ నర్సింగ్
వ్యవధి- నాలుగేళ్లు
అర్హతలు- కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ), ఇంటర్ ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు, సార్వత్రిక విద్యలో ఇంటర్ (ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి. టీజీ ఈఏపీసెట్-2024 స్కోరు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.
వయసు- డిసెంబర్ 31, 2024 నాటికి అభ్యర్థులకు 17 ఏళ్లు నిండి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు- ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.2500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.2000 ఉంటుంది.
ఎంపిక ఇలా- టీజీ ఈఏపీసెట్-2024 స్కోరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ తేదీలు: 06-10-2024 నుంచి 14-10-2024 వరకు అప్లై చేసుకోవచ్చు
సాంకేతిక సాయం కోసం- 9392685856, 7842136688, 9059672216 నంబర్లలో సంప్రదించాలి.
సాంకేతిక సమస్యలు ఉంటే.. tsparamed.tech@gmail.com మెయిల్ ఐడీని సంప్రదించాలి.
నిబంధనలపై వివరణల కోసం- 7901098840, 9490585796 నంబర్లలో సంప్రదించాలి.
చెల్లింపు సమస్యల ఉంటే.. 9618240276 నంబర్‌కు ఫోన్ చేయొచ్చు.
ఏవైనా ఇతర సమస్యల ఉంటే.. knrparamedadmission@gmail.com కు ఈ మెయిల్ చేయొచ్చు.
(ఉదయం 10.00 నుండి సాయంత్రం 6.00 వరకు మాత్రమే) ఇవి అందుబాటులో ఉంటాయి