NALSAR Hyderabad : నల్సార్‌ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు - ఖాళీలు, ముఖ్య వివరాలివే-nalsar hyderabad faculty recruitment 2024 for various positions full details read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nalsar Hyderabad : నల్సార్‌ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు - ఖాళీలు, ముఖ్య వివరాలివే

NALSAR Hyderabad : నల్సార్‌ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు - ఖాళీలు, ముఖ్య వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 06, 2024 02:09 PM IST

NALSAR Hyderabad Jobs : హైదరాబాద్ నల్సార్‌ యూనివర్సిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. పలు రకాల ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 33 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. https://nalsar.ac.in/f వెబ్ సైట్ లోకి అప్లయ్ చేసుకోవచ్చు.

హైదరాబాద్ నల్సార్‌ యూనివర్సిటీలో ఉద్యోగాలు
హైదరాబాద్ నల్సార్‌ యూనివర్సిటీలో ఉద్యోగాలు

ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ (లా) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 30 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో 18 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉండగా….అసోసియేట్ ప్రొఫెసర్‌ ఖాళీలు ఎనిమిది ఉన్నాయి.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 12వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://nalsar.ac.in/f వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లా లో పీజీ పూర్తి చేయటంతో పాటు నెట్/ సెట్ అర్హత పరీక్షల్లో పాస్ అయి ఉండాలి. పీహెచ్డీ పూర్తి చేయటంతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి. ఈ వివరాలను పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో చూడొచ్చు.

కేవలం ఆన్ లైన్ లోనే దరఖాస్తులను స్వీకరిస్తారు. జనరల్‌ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళ అభ్యర్థులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. పార్ట్ టైమ్ విధానంలో కాకుండా రెగ్యూలర్ విధానంలో పీహెచ్డీ చేసిన అభ్యర్థులు ఈపోస్టులకు అర్హులవుతారు. టీచింగ్ లోనూ మూడేళ్లకుపైగా అనుభవం ఉండాలి.

వరంగల్ నిట్ లో ఉద్యోగాలు :

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్) నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా పది నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://nitw.ac.in/Careers/  వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ముఖ్య వివరాలు :

ఉద్యోగ ప్రకటన - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్), వరంగల్

ఉద్యోగాలు - నాన్ - టీచింగ్ పోస్టులు

మొత్తం ఖాళీలు - 10 (ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్‌ - 02, ప్రిన్సిపల్ స్టూడెంట్స్‌ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ - 01, Deputy Registrar - 02, అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 01, టెక్నికల్ ఆఫీసర్‌ - 01, అసిస్టెంట్ ఇంజినీర్‌ - 03)

పై పోస్టుల్లో కొన్ని డైరెక్ట్ రిక్రూట్ మెంట్, మరికొన్ని డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.

పోస్టును అనుసరించి విద్యార్హతలను పేర్కొన్నారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు

దరఖాస్తు - ఆన్ లైన్

దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 16, 2024వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.

దరఖాస్తులకు చివరి తేదీ - సెప్టెంబర్ 09, 2024.

దరఖాస్తు ఫీజు - రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం - వచ్చిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆయా అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

అధికారిక వెబ్ సైట్ - https://nitw.ac.in/Careers/

ఏమైనా సందేహాలు ఉంటే recruit_admn@nitw.ac.in మెయిల్ అడ్రస్ ద్వారా సంప్రదించవచ్చు.