TGPSC Group 4 : గ్రూప్-4 తుది ప్రక్రియ త్వరలోనే చేపడతాం, అభ్యర్థులకు మంత్రి తుమ్మల హామీ-minister tummala nageswara rao says tgpsc group 4 final results released soon ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Group 4 : గ్రూప్-4 తుది ప్రక్రియ త్వరలోనే చేపడతాం, అభ్యర్థులకు మంత్రి తుమ్మల హామీ

TGPSC Group 4 : గ్రూప్-4 తుది ప్రక్రియ త్వరలోనే చేపడతాం, అభ్యర్థులకు మంత్రి తుమ్మల హామీ

Bandaru Satyaprasad HT Telugu
Oct 07, 2024 08:16 PM IST

TGPSC Group 4 : గ్రూప్-4 తుది ప్రక్రియ త్వరలోనే చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి గ్రూప్-4 తుది ఫలితాలు తొందరగా ప్రకటించాలని కోరారు. 2023లో గ్రూప్-4 పరీక్ష నిర్వహించగా, ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది.

గ్రూప్-4 తుది ప్రక్రియ త్వరలోనే చేపడతాం, అభ్యర్థులకు మంత్రి తుమ్మల హామీ
గ్రూప్-4 తుది ప్రక్రియ త్వరలోనే చేపడతాం, అభ్యర్థులకు మంత్రి తుమ్మల హామీ

TGPSC Group 4 : గ్రూప్-4 అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-4 పరీక్ష తుది ప్రక్రియను త్వరలోనే చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సోమవారం కొంత మంది అభ్యర్థులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి తమ సమస్యను తెలియజేశారు. మంత్రి తుమ్మల వెంటనే...టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేశారు. గ్రూప్-4 తుది ఫలితాలను వెంటనే ప్రకటించాలని కోరారు. 2023లో గ్రూప్-4 పరీక్ష నిర్వహించగా... ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. ఇంకా నియామక ప్రక్రియ చేపట్టకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

తుది ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్

గ్రూపు-4 పరీక్ష తుది ఫలితాలు ప్రకటించాలని ఇటీవల టీజీపీఎస్సీ, గాంధీ భవన్ ముట్టడికి అభ్యర్థులు యత్నించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ 45 రోజులు దాటుతున్నా... ఇప్పటికీ ఫైనల్ ఫలితాలు విడుదల చేయలేదని, ఉద్యోగాలు కేటాయించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ భవన్ ముట్టడికి పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలిరాగ... పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గ్రూప్ 4 పరీక్ష రాసి 460 రోజులు అవుతుందని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైందని అభ్యర్థులు తెలిపారు. డీఎస్సీ పోస్టులకు 56 రోజులో పూర్తి చేసిన అధికారులు, 8 వేల గ్రూప్-4 పోస్టులకు 460 రోజులు ఎలా పడుతుందని అభ్యర్థులు ప్రశ్నించారు. వెంటనే తుది ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

డీఎస్సీ తుది జాబితా

తెలంగాణ సర్కార్ 11,063 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. డీఎస్సీ ఫలితాలను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. డీఎస్సీ తుది జాబితాను ఇవాళ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో జాయినింగ్ ఆర్డర్‌లను అందించనున్నారు. ముందుగా 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయిందని సీఎస్ శాంతి కుమారి తెలిపారు.

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2024 డీఎస్సీలో అభ్యర్థులు స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టుల్లో.. ఏదో ఒక దానికే ఎంపికయ్యేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను కూడా రెడీ చేసింది. దీని కారణంగా.. నియామకాల తర్వాత మళ్లీ పోస్టుల ఖాళీలు ఉండబోవని అధికారులు చెబుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం