తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Group 4 Jobs: గుడ్ న్యూస్.. 9,168 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

TS Group 4 Jobs: గుడ్ న్యూస్.. 9,168 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

HT Telugu Desk HT Telugu

25 November 2022, 19:21 IST

    • group 4 jobs in telangana: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రూప్ 4 పోస్టుల భర్తీకి  సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 9,168 పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలంగాణ గ్రూప్ 4 ఉద్యోగాలు,
తెలంగాణ గ్రూప్ 4 ఉద్యోగాలు,

తెలంగాణ గ్రూప్ 4 ఉద్యోగాలు,

ts govt green signal to 9168 group 4 vacancies: ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాగా.. తాజాగా మరో తీపి కబురు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. గ్రూప్ 4 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 9,168 పోస్టుల భర్తీకి ఆమోదముద్ర వేసింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆశావహులకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Siddipet Accident : పెళ్లి రోజే విషాదం, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Youth Cheated Producer : ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాత చుట్టూ ప్రదక్షిణాలు, అవకాశం చిక్కగానే బంగారంతో జంప్

Cyber Crime : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం, సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా - ఏపీలో సైబర్ కేటుగాడు అరెస్ట్

Mlc Dande Vithal : ఎమ్మెల్సీగా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు, సుప్రీంలో సవాల్ చేస్తానంటోన్న దండే విఠల్

గ్రూప్‌–4 కొలువులకు కొత్తగా సర్వీసు నిబంధనలను రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా ప్రస్తుతమున్న సర్వీసు రూల్స్‌లో మార్పులు చేసింది. ఇదివరకు 80:20 నిష్పత్తిలో స్థానిక, జనరల్‌ కేటగిరీల్లో ఉద్యోగాలు భర్తీ చేయగా ఇప్పుడు 95:5 నిష్పత్తిలో చేపట్టనుంది. ఈ క్రమంలో సర్వీసు నిబంధనలు కూడా స్థానిక అభ్యర్థులకు అధిక లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం మార్పులు చేయనుంది. భవిష్యత్తులో పదోన్నతులు ఇతర అంశాల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తోంది. దీనిపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

గ్రూపు -4లోని ఉద్యోగాలు...

జూనియర్ అసిస్టెంట్. టైపిస్ట్, స్టెనో వంటి పోస్టులు ఇందులో ఉంటాయి. అయితే టైపిస్ట్, స్టెనోలోనూ జూనియర్, సీనియర్ లెవల్ ఉద్యోగాలు ఉంటాయి. వీటిలో గెజిటెడ్, నానా గెజిటెడ్ కేటగిరీలు కూడా ఉన్నాయి. వీటికి వేర్వురు దశల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించే.. గ్రూపు 4 ఉద్యోగాలకు పేపర్ - 1, పేపర్ -2 పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలకు గానూ 150 మార్కులు ఉంటాయి. రెండో పేపర్ లోనే ఇదే విధంగా ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో గరిష్ఠ మార్కులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు.

సిలబస్ ఇదే..

పేపర్-1 లో మొత్తం 150 మార్కులు ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్‌నెస్(General Knowledge) నుంచి ప్రశ్నలు వస్తాయి. సమయం గంటన్నర ఉంటుంది. కరెంట్ ఆఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు, సామాన్యశాస్త్రం, భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు, భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు , భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యంతో పాటు తెలంగాణ రాష్ట్ర విధానాల వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఇక పేపర్ -2లో మొత్తం 150 మార్కులు ఉంటాయి. ఇందులో సెక్రటేరియల్ సామర్ధ్యాల (Secretarial Abilities) నుంచి ప్రశ్నలు వస్తాయి. పాలనా సామర్థ్యాలు (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మెంటల్ ఎబిలిటీస్ (వెర్బల్, నాన్ వెర్బల్), లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్, రీ-అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఎ వ్యూ టు ఇంప్రూవింగ్ ఎనాలసిస్ ఆఫ్ ఎ పాసేజ్, న్యూమరికల్, అర్థమెటికల్ ఎబిలిటీస్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించి పేపర్ -1లో పై విధంగా సూచించిన అంశాలు ఉండగా.. ఇక పేపర్ -2లో మాత్రం సంబంధిత సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందుకు సంబంధించిన సిలబస్ ను నోటిఫికేషన్ సమయంలో టీఎస్పీఎస్సీ విడుదల చేస్తుంది. అయితే ఫైనల్ నోటిఫికేషన్ సమయంలో సిలబస్ లో ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు