Group 4 Jobs: 9వేలకు పైగా గ్రూపు -4 ఉద్యోగాలు.. 2 పేపర్లు, 300 మార్కులు!-tspsc group 4 jobs and exam pattern ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tspsc Group 4 Jobs And Exam Pattern

Group 4 Jobs: 9వేలకు పైగా గ్రూపు -4 ఉద్యోగాలు.. 2 పేపర్లు, 300 మార్కులు!

HT Telugu Desk HT Telugu
Apr 30, 2022 03:04 PM IST

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. ఇప్పటికే పోలీసు శాఖ నుంచి నోటిఫికేషన్లు వచ్చేశాయ్. ఇక టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 1 వచ్చింది. మరోవైపు గ్రూపు 2, 3,4 కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే గ్రూపు -4 ఉద్యోగాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.

తెలంగాణలో గ్రూపు 4 ఉద్యోగాలు
తెలంగాణలో గ్రూపు 4 ఉద్యోగాలు

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి అన్ని శాఖలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖ భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక 500కు పై పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. మరోవైపు గ్రూపు 1, 2 లో ఇంటర్వూలు కూడా ఎత్తివేశారు. ఇక 1,373 ఉద్యోగాలను గ్రూప్-3లో భాగంగా భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉంటే 9వేలకుపైగా గ్రూపు -4 ఉద్యోగాలు ఉన్నాయి.  ఇందులో ఎలాంటి పోస్టులు ఉంటాయి..? సిలబస్ స్వరూపమేంటి..? వంటి అంశాలపై చాలానే డౌట్స్ ఉంటాయి. అయితే ఇందుకు సంబంధించిన అంశాలను చూస్తే...

ట్రెండింగ్ వార్తలు

గ్రూపు -4లోని ఉద్యోగాలు...

జూనియర్ అసిస్టెంట్. టైపిస్ట్, స్టెనో వంటి పోస్టులు ఇందులో ఉంటాయి. అయితే టైపిస్ట్, స్టెనోలోనూ జూనియర్, సీనియర్ లెవల్ ఉద్యోగాలు ఉంటాయి. వీటిలో గెజిటెడ్, నానా గెజిటెడ్ కేటగిరీలు కూడా ఉన్నాయి. వీటికి వేర్వురు దశల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

ఎగ్జామ్..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించే.. గ్రూపు 4 ఉద్యోగాలకు పేపర్ - 1, పేపర్ -2 పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలకు గానూ 150 మార్కులు ఉంటాయి. రెండో పేపర్ లోనే ఇదే విధంగా ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో గరిష్ఠ మార్కులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు.

సిలబస్ ఇదే..

పేపర్-1 లో మొత్తం 150 మార్కులు ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్‌నెస్(General Knowledge) నుంచి ప్రశ్నలు వస్తాయి. సమయం గంటన్నర ఉంటుంది. కరెంట్ ఆఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు, సామాన్యశాస్త్రం, భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు, భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు , భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యంతో పాటు తెలంగాణ రాష్ట్ర విధానాల వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఇక పేపర్ -2లో మొత్తం 150 మార్కులు ఉంటాయి. ఇందులో సెక్రటేరియల్ సామర్ధ్యాల (Secretarial Abilities) నుంచి ప్రశ్నలు వస్తాయి. పాలనా సామర్థ్యాలు (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మెంటల్ ఎబిలిటీస్ (వెర్బల్, నాన్ వెర్బల్), లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్, రీ-అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఎ వ్యూ టు ఇంప్రూవింగ్ ఎనాలసిస్ ఆఫ్ ఎ పాసేజ్, న్యూమరికల్, అర్థమెటికల్ ఎబిలిటీస్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించి పేపర్ -1లో పై విధంగా సూచించిన అంశాలు ఉండగా.. ఇక పేపర్ -2లో మాత్రం సంబంధిత సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందుకు సంబంధించిన సిలబస్ ను నోటిఫికేషన్ సమయంలో విడుదల చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అయితే ఫైనల్ నోటిఫికేషన్ సమయంలో సిలబస్ లో ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్