తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Edcet 2023 Online Applications Extended Up To 1st May 2023

TS EdCET 2023 : ఎడ్‌సెట్‌కు భారీగా దరఖాస్తులు.. మరోసారి గడువు పెంపు, ముఖ్య తేదీలివే

HT Telugu Desk HT Telugu

27 April 2023, 17:01 IST

    • Telangana EDCET Schedule 2023: తెలంగాణ ఎడ్ సెట్- 2023 దరఖాస్తుల గడువును మరోసారి పెంచారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ఎడ్‌సెట్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు
తెలంగాణ ఎడ్‌సెట్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు

తెలంగాణ ఎడ్‌సెట్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు

Telangana EdCET 2023 Updates: తెలంగాణ ఎడ్ సెట్ 2023 కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. బీఈడీ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే తెలంగాణ ఎడ్‌సెట్ దర‌ఖాస్తు గ‌డువును మరోసారి పెంచారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. భారీగా దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో… గ‌డువును మే 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ ఏ రామ‌కృష్ణ తెలిపారు. మే 18వ తేదీన ఎడ్ సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించున్నారు.

ట్రెండింగ్ వార్తలు

TS ICET 2024 Updates : తెలంగాణ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, మే 7 వరకు ఛాన్స్

Medak Accident: పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం, నవ వధువుకు తీవ్రగాయాలు

Karimnagar SSC: పది ఫలితాల్లో సత్తా చాటిన కరీంనగర్ విద్యార్థులు..600మందికి 10/10 జిపిఏ, 457 బడుల్లో నూరు శాతం ఉత్తీర్ణత

1 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

షెడ్యూల్ ముఖ్య వివరాలు:

మార్చి 4 - ఎడ్‌సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల.

దరఖాస్తు రుసుం - ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 500, ఇత‌ర కేట‌గిరీల అభ్య‌ర్థులు రూ. 700 చెల్లించాలి.

ఎలాంటి ఆల‌స్య రుసుం లేకుండా మే 1వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

మే 5 - ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

మే 18 - ఎడ్ సెట్ - 2023 ప్ర‌వేశ ప‌రీక్ష ఉంటుంది.(3 సెషన్లలో ఉంటుంది)

ఉదయం 9 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు.

మే 21 - ప్రాథ‌మిక కీ విడుద‌ల చేస్తారు.

అనంతరం తుది ఫలితాలపై తేదీని ప్రకటిస్తారు.

భారీగా దరఖాస్తులు…

ఇక తెలంగాణ ఎడ్‌సెట్‌ 2023 కు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. బుధవారం నాటికి 27 వేలకుపైగా వచ్చాయని అధికారులు తెలిపారు. తొలుతు నిర్ణయించిన సెంటర్ల కంటే… మరికొన్నింటిని పెంచే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే ఎడ్‌సెట్‌ పరీక్షాకేంద్రాల్లోని తొమ్మిది ప ట్టణాలను అధికారులు బ్లాక్‌ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, కర్నూల్‌, హైదరాబాద్‌ వెస్ట్‌, మ హబూబ్‌నగర్‌, నల్లగొండ, సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టణాలను పరీక్షాకేంద్రాలుగా ఎంపిక చేసుకోకుండా నిలిపివేశారు. ఫలితంగా ఈ ప్రాంతాల అభ్యర్థులు వేరే పట్టణాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

NOTE: తెలంగాణ ఎడ్ సెట్ దరఖాస్తులు, హాల్ టికెట్లు, కీ, ఫలితాలను https://edcet.tsche.ac.in/ లింక్ పై క్లిక్ చేసి పొందవచ్చు.

TS LAWCET Applications 2023: మరోవైపు తెలంగాణ లాసెట్ - 2023 దరఖాస్తుల గడువు కూడా పొడిగించారు అధికారులు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 29 వరకు వరకు అప్లయ్ చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 20తో ముగియగా… మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఓపెన్ కేట‌గిరి అభ్య‌ర్థులకు రూ. 900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థుల‌కు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు ఎడిట్ చేసుకునేందుకు మే 5 నుంచి 10వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు. మే 16 నుంచి హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. మే 25న టీఎస్ లాసెట్‌, టీఎస్ పీజీ ఎల్‌సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో చేరేందుకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక ఎల్ఎల్ బీ ఐదేళ్ల కోర్సులో చేరాలంటే ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఇక ఎల్ఎల్ ఎం చేయాలంటే... ఎల్ఎల్ బీ డిగ్రీ ఉండాలి. పూర్తి వివరాల కోసం https://lawcet.tsche.ac.in ద్వారా సంబంధిత సైట్ ను సందర్శించవచ్చు. సంబంధిత వివరాల ఆధారంగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.