తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Lawcet 2023: లాసెట్‌ గడువు మరోసారి పొడిగింపు.. ఈ లింక్ తో అప్లయ్ చేసుకోండి

TS LAWCET 2023: లాసెట్‌ గడువు మరోసారి పొడిగింపు.. ఈ లింక్ తో అప్లయ్ చేసుకోండి

HT Telugu Desk HT Telugu

20 April 2023, 18:59 IST

    • TS LAWCET 2023 Updates: తెలంగాణ లాసెట్ దరఖాస్తుల గడువు మరోమారు పెంచారు. ఏప్రిల్ 29వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ సెట్ కన్వీనర్ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ లాసెట్ గడువు పొడిగింపు lawcet.tsche.ac.in
తెలంగాణ లాసెట్ గడువు పొడిగింపు lawcet.tsche.ac.in

తెలంగాణ లాసెట్ గడువు పొడిగింపు lawcet.tsche.ac.in

TS LAWCET Applications 2023: తెలంగాణ లాసెట్ - 2023 దరఖాస్తుల ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. లాసెట్, పీజీ లాసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 29 వరకు వరకు అప్లయ్ చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి(ఏప్రిల్ 20)తో ముగియగా… మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Hyd Bike Blast: హైదరాబాద్‌లో ఘోరం, బైక్‌‌లో మంటలు ఆర్పుతుండగా భారీ పేలుడు, పలువురికి తీవ్ర గాయాలు

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Medak Crime News : దారుణం.. బెట్టింగ్‌ ఆడుతున్నాడని కుమారుడిని రాడుతో కొట్టి చంపిన తండ్రి

ఇప్పటివరకు లాసెట్ కు 25 వేలకు దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది 37,500 మంది వరకు దరఖాస్తులు వచ్చాయి. 29 వేల మంది మాత్రమే పరీక్ష రాశారు. ఈ పరీక్షకూ గత ఏడాది కంటే దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే దరఖాస్తు గడువు పెంచినట్లు తెలుస్తోంది.

మే 25న రాత పరీక్ష...

ఓపెన్ కేట‌గిరి అభ్య‌ర్థులకు రూ. 900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థుల‌కు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు ఎడిట్ చేసుకునేందుకు మే 5 నుంచి 10వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు. మే 16 నుంచి హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. మే 25న టీఎస్ లాసెట్‌, టీఎస్ పీజీ ఎల్‌సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.

అర్హతలు...

మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో చేరేందుకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక ఎల్ఎల్ బీ ఐదేళ్ల కోర్సులో చేరాలంటే ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఇక ఎల్ఎల్ ఎం చేయాలంటే... ఎల్ఎల్ బీ డిగ్రీ ఉండాలి. పూర్తి వివరాల కోసం https://lawcet.tsche.ac.in ద్వారా సంబంధిత సైట్ ను సందర్శించవచ్చు. సంబంధిత వివరాల ఆధారంగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

మరోవైపు ఏపీ లాసెట్ 2023 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి అపరాధ రుసం లేకుండా ఏప్రిల్ 22వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. మే 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. మే 20వ తేదీన లాసెట్ పరీక్షలు జరగనున్నాయి.

NOTE: ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ లాసెట్ 2023కు దరఖాస్తు చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం