TS Lawcet, Ecet: ఎల్లుండి నుంచి లాసెట్, ఈసెట్ దరఖాస్తులు
TS Lawcet, Ecet: ఎల్లుండి నుంచి లాసెట్, ఈసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.
TS Lawcet, Ecet: మార్చి 2వ తేదీ నుంచి లాసెట్, ఈసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ రెండు ప్రవేశ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఓయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ నిన్న విడుదల చేశారు.
లాసెట్ నోటిఫికేషన్ మార్చి 1న విడుదల కానుంది. దరఖాస్తులను మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు సమర్పించవచ్చు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 7 నుంచి మే 3 వరకు సమర్పించవచ్చు. అలాగే దరఖాస్తుల్లో తప్పుల సవరణ చేసుకునేందుకు మే 4 నుంచి 10 వరకు సమయం ఉంటుంది. హాల్‌టికెట్లను మే 16 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లాసెట్ పరీక్ష మే 25న ఉంటుంది. లాసెట్ దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన అభ్యర్థులు రూ. 600, ఇతరులు రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది.
ఈసెట్ నోటిఫికేషన్ మార్చి 1న విడుదల కానుంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 2 నుంచి మే 2 వరకు సమయం ఉంటుంది. ఆలస్య రుసుముతో మే 3 నుంచి మే 12 వరకు గడువు ఉంది. దరఖాస్తుల్లో సవరణ చేసేందుకు మే 8 నుంచి మే 12 వరకు సమయం ఉంటుంది. హాల్ టికెట్లను మే 15 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈసెట్ పరీక్ష మే 20న ఉంటుంది. ఈసెట్ దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే రూ. 500, ఇతరులు రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది.