AP EdCET 2023: ఏపీ ఎడ్‌సెట్‌ షెడ్యూల్.. మే 5న పరీక్ష, ముఖ్య తేదీలివే-ap edcet 2023 registration begins apply till april 23 check full details are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Edcet 2023: ఏపీ ఎడ్‌సెట్‌ షెడ్యూల్.. మే 5న పరీక్ష, ముఖ్య తేదీలివే

AP EdCET 2023: ఏపీ ఎడ్‌సెట్‌ షెడ్యూల్.. మే 5న పరీక్ష, ముఖ్య తేదీలివే

HT Telugu Desk HT Telugu
Jun 10, 2024 03:58 PM IST

AP EdCET 2023 Updates: ఏపీ ఎడ్ సెట్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మే 5వ తేదీన పరీక్ష జరగనుంది. ఈ మేరకు పూర్తి వివరాలను వెబ్ సైట్ లో పేర్కొన్నారు.

ఏపీ ఎడ్ సెట్ 2023
ఏపీ ఎడ్ సెట్ 2023

AP EdCET 2023 Notification: ఆంధ్రప్రదేశ్ ఎడ్ సెట్ 2023కు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదలైంది. మార్చి 24వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మే 5వ తేదీన పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆంధ్రా వర్శిటీ ప్రకటించింది. రాష్ట్రంలోని బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌) నిర్వహిస్తారు. ఈ ఏడాది పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ మేరకు ఈ పరీక్షను సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది.

ముఖ్య తేదీలు:

పరీక్ష - ఏపీ ఎడ్ సెట్ 2023

దరఖాస్తులు ప్రారంభం - మార్చి 24, 2023.

దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ ఫీజు- ఎస్సీ/ ఎస్టీలకు రూ.450; బీసీలకు రూ.500; ఓసీలకు రూ.650.

దరఖాస్తులకు చివరి తేదీ - ఏప్రిల్, 23, 2023.

వెయ్యి రూపాయల ఫైన్ తో గడువు -02 - -5- 2-23.

దరఖాస్తులోని తప్పులను సరిచేసుకోవటానికి గడువు - 03, మే, 2023.

2 వేల రూపాయల ఫైన్ గడువు - 10 - 05- 2023.

హాల్ టికెట్లు డౌన్లోడ్ -12, మే, 2023.

ఏపీ ఎడ్ సెట్ పరీక్ష తేదీ- మే, 20, 2023.

సమయం - ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు

ప్రిలిమినరీ కీ - మే, 24, 2023.(ఉదయం 10 గంటలకు)

కీలోని అభ్యంతరాలు తెలిపేందుకు గడువు - 26, మే, 2023(సాయంత్రం 5 గంటల లోపు)

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. బీటెక్, బీసీఏ, బీబీఎం విద్యార్థులూ అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్ట్‌లుగా ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఎగ్జామ్: మూడు విభాగాలుగా 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.

NOTE: ఏపీ ఎడ్ సెట్ దరఖాస్తులు, హాల్ టికెట్లు, కీ, ఫలితాలను ఈ లింక్ పై క్లిక్ చేసి పొందవచ్చు.

Telangana EDCET Schedule 2023: మరోవైపు తెలంగాణ ఎడ్ సెట్ 2023 నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీతో పాటు పలు వివరాలను ఆ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

షెడ్యూల్ వివరాలు:

మార్చి 4 - ఎడ్‌సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల.

మార్చి 6 - అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

దరఖాస్తు రుసుం - ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 500, ఇత‌ర కేట‌గిరీల అభ్య‌ర్థులు రూ. 700 చెల్లించాలి. ఎలాంటి ఆల‌స్య రుసుం లేకుండా ఏప్రిల్ 20 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రూ. 250 ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

మార్చి 30- అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మే 5 - ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

మే 18 - ఎడ్ సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష ఉంటుంది.

మే 21 - ప్రాథ‌మిక కీ విడుద‌ల చేస్తారు.

NOTE: తెలంగాణ ఎడ్ సెట్ దరఖాస్తులు, హాల్ టికెట్లు, కీ, ఫలితాలను https://edcet.tsche.ac.in/ లింక్ పై క్లిక్ చేసి పొందవచ్చు.

Whats_app_banner